Badminton star Saina Nehwal
-
Saina Nehwal: జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలంటున్న సైనా నెహ్వాల్
-
మళ్లీ నిరాశ
జకార్తా: కొత్త సీజన్‌ను టైటిల్‌తో ప్రారంభించాలని ఆశించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌కు నిరాశ ఎదురైంది. ఇండోనేసియా మాస్టర్స్ టోర్నమెంట్లో ఈ హైదరాబాద్ అమ్మాయి రన్నరప్‌గా నిలిచింది. ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్ సైనా 9–21, 13–21తో ఓడిపోయింది. కేవలం 27 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో సైనా తన ప్రత్యర్థికి ఏదశలోనూ పోటీనివ్వలేకపోయింది. రెండు గేముల్లోనూ ఆరంభం నుంచే తై జు యింగ్ జోరు కొనసాగింది. సైనాపై తై జు యింగ్‌కిది వరుసగా ఏడో విజయం కావడం విశేషం. తై జు యింగ్‌పై సైనా చివరిసారి 2013 స్విస్ ఓపెన్‌లో గెలుపొందడం గమనార్హం. విజేతగా నిలిచిన తై జు యింగ్‌కు 26,250 డాలర్లు (రూ. 16 లక్షల 69 వేలు)... రన్నరప్ సైనాకు 13,300 డాలర్లు (రూ. 8 లక్షల 45 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
సైనా మెరిసె...
-
సైనా మెరిసె...
మలేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్ సొంతం సారావక్ (మలేసియా): కొత్త ఏడాదిలో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ శుభారంభం చేసింది. ఆదివారం ముగిసిన మలేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్లో ఈ హైదరాబాద్ అమ్మాయి చాంపియన్‌గా అవతరించింది. గత నవంబరులో మోకాలి గాయం నుంచి కోలుకున్నాక సైనా నెగ్గిన తొలి అంతర్జాతీయ టైటిల్ ఇదే కావడం విశేషం. 46 నిమిషాలపాటు జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సైనా 22–20, 22–20తో ప్రపంచ 67వ ర్యాంకర్ పోర్న్‌పవీ చోచువోంగ్ (థాయ్‌లాండ్)పై గెలిచింది. గత ఏడాది జూన్‌లో ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ గెలిచిన తర్వాత సైనా ఖాతాలో చేరిన తొలి టైటిల్ ఇదే కావడం గమనార్హం. సైనా కెరీర్లో ఇది తొమ్మిదో గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్ కాగా ఓవరాల్‌గా 23వ టైటిల్. విజేతగా నిలిచిన సైనాకు 9,000 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 6 లక్షల 12 వేలు)తోపాటు 7,000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. కెరీర్లో తొలిసారి పోర్న్‌పవీతో ముఖాముఖిగా ఆడిన ప్రపంచ పదో ర్యాంకర్ సైనాకు తొలి గేమ్‌లో గట్టిపోటీనే ఎదురైంది. 19–20 స్కోరు వద్ద గేమ్ పాయింట్ కాచుకున్న సైనా వరుసగా మూడు పాయింట్లు గెలిచి తొలి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లో మాత్రం సైనా పలుమార్లు ఆధిక్యంలోకి వెళ్లింది. స్కోరు 20–16 వద్ద సైనా వరుసగా నాలుగు పాయింట్లు కోల్పోవడంతో స్కోరు 20–20తో సమమైంది. అయితే కీలకదశలో తేరుకున్న సైనా వరుసగా రెండు పాయింట్లు నెగ్గి విజయంతోపాటు టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ టోర్నీలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ సైనా తన ప్రత్యర్థులకు ఒక్క గేమ్ కూడా కోల్పోకపోవడం విశేషం. మోకాలికి శస్త్ర చికిత్స జరిగిన సమయం నుంచి టైటిల్ గెలిచిన ఈ క్షణం వరకు నా ప్రయాణం ఎంతో కఠినంగా, ఉద్వేగంగా సాగింది. క్లిష్ట సమయంలో నన్ను ప్రోత్సహించిన కోచ్‌లు విమల్ కుమార్, ఉమేంద్ర రాణాలకు కృతజ్ఞతలు. గాయం నుంచి కోలుకునేందుకు సహకరించిన నా ఫిజియోలు హీత్ మాథ్యూస్, చందన్ పొద్దార్, అరవింద్ నిగమ్‌లకు ఈ టైటిల్ అంకితం ఇస్తున్నాను. – సైనా నెహ్వాల్ -
శ్రమించిన సైనా
ఒడెన్స్ (డెన్మార్క్): టాప్ సీడ్ హోదాలో బరిలోకి దిగిన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్లో తొలి అడ్డంకిని కష్టపడి అధిగమించింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ నంబర్‌వన్ సైనా 23-21, 14-21, 21-18తో ప్రపంచ 17వ ర్యాంకర్ బుసానన్ ఒంగ్‌బుమ్‌రుంగ్‌ఫన్ (థాయ్‌లాండ్)పై శ్రమించి గెలిచింది. 69 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సైనాకు తొలి గేమ్‌లో గట్టిపోటీ ఎదురైంది. ఒకదశలో 20-21తో గేమ్ కోల్పోయే స్థితిలో నిలిచిన సైనా వరుసగా మూడు పాయింట్లు నెగ్గి తొలి గేమ్‌ను దక్కించుకుంది. అయితే రెండో గేమ్‌లో ఈ హైదరాబాద్ అమ్మాయి ఆటతీరు తడబడింది. ఒకదశలో వరుసగా ఐదు పాయింట్లు కోల్పోయిన సైనా అదే క్రమంలో గేమ్‌ను చేజార్చుకుంది. నిర్ణాయక మూడో గేమ్‌లో సైనా సంయమనంతో ఆడి కీలకదశలో పాయింట్లు నెగ్గి 18-12తో ఆధిక్యంలోకి వెళ్లింది. బుసానన్ కూడా రెండు పాయింట్లు నెగ్గి తేడాను తగ్గించింది. ఈ దశలో సైనా నిర్లక్ష్యానికి తావివ్వకుండా రెండు పాయింట్లు నెగ్గి 20-14తో ముందంజ వేసింది. ఆ తర్వాత బుసానన్ నాలుగు పాయింట్లు గెలిచినా... వెంటనే సైనా మరో పాయింట్ సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 18వ ర్యాంకర్ మినత్సు మితాని (జపాన్)తో సైనా ఆడుతుంది. మరో మ్యాచ్‌లో పీవీ సింధు 21-13, 21-11తో మరియా ఫెబె కుసుమస్తుతి (ఇండోనేసియా)పై సులువుగా నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. జయరామ్ ఓటమి మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో ఐదో సీడ్ కిడాంబి శ్రీకాంత్ శుభారంభం చేశాడు. తొలి రౌండ్లో శ్రీకాంత్ 21-10, 21-14తో భారత్‌కే చెందిన అజయ్ జయరామ్‌పై గెలిచాడు. గతవారం డచ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి టైటిల్ నెగ్గి జోరుమీదున్న జయరామ్‌పై శ్రీకాంత్ ఆద్యంతం ఆధిపత్యం కనబరిచి 32 నిమిషాల్లోనే విజయాన్ని దక్కించుకున్నాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి (భారత్) ద్వయం 24-22, 21-13తో మార్కస్ ఇలిస్-క్రిస్ లాంగ్రిడ్జ్ (ఇంగ్లండ్) జంటపై గెలుపొందగా... మహిళల డబుల్స్ తొలి రౌండ్లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప జోడీ 19-21, 18-21తో ఏడో సీడ్ రీకా కాకివా-మియుకి మయెదా (జపాన్) ద్వయం చేతిలో ఓడిపోయింది. -
ప్రధానికి సైనా ‘రాకెట్’
బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చిన బ్యాడ్మింటన్ స్టార్ న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్.. గురువారం ప్రధాని నరేంద్ర మోదిని కలిసింది. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో రజతం సాధించిపెట్టిన రాకెట్‌ను ఈ సందర్భంగా ఆమె ప్రధానికి బహుకరించింది. అలాగే నేడు 65వ పడిలోకి అడుగుపెడుతున్న మోదికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసింది. ‘ప్రధానిని కలిసినందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. ఓ రోజు ముందుగానే బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపా. జన్మదిన కానుకగా రాకెట్‌ను బహుకరించా. మోది ప్రతి ఆటను క్రమం తప్పకుండా ఫాలో అవుతారని తెలిసి చాలా సంతోషపడ్డా. అలాగే నా మ్యాచ్‌ల గురించి చాలా చర్చించారు. చాలా ఆశ్చర్యమనిపించింది. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పతకం సాధించినందుకు అభినందనలు తెలిపారు’ అని సమావేశం అనంతరం సైనా వ్యాఖ్యానించింది. ప్రధానిని కలిసిన వారిలో సైనా తండ్రి హర్వీర్ నెహ్వాల్, ఐఓఎస్ సీఈఓ నీరవ్ తోమర్లు ఉన్నారు.