
ముంబై: పుట్టినరోజు అంటే సంబరం. అందులోనూ జన్మదిన వేడుకలో అందుకునే చిన్న చిన్న కానుకలు అంటే అపురూపంగా చూసుకుని మురిసిపోతారు. అలాంటిది ఒక మహిళ అనూహ్యంగా టమాటాలను గిఫ్ట్‌గా అందుకుని ఆశ్చర్యంలో మునిగింది. మహారాష్ట్రలోని థానే పట్టణంలో ఈ కొత్తరకం బహుమతి ఘటన జరిగింది. సంబంధిత వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది.
థానె జిల్లాలోని కళ్యాణ్ ప్రాంతంలోని కొచాడీలో ఉండే సోనల్ బోర్సే పుట్టినరోజు వేడుక ఆదివారం జరిగింది. ఆ ప్రాంతంలో కేజీ టమాటా ఏకంగా రూ.140 ధర పలుకుతోంది. అదే రోజు ఆమె నాలుగు కేజీలకుపైగా టమాటాలు ఉన్న బుట్టలను బహుమతిగా అందుకున్నారు. ఈసారి అకాల వర్షాలు, బిపర్‌జోయ్ తుపాను మిగిల్చిన విషాదం కారణంగా పంట నాశనమై దిగుబడి భారీగా తగ్గిపోయి టమాటా ధర రిటైల్ మార్కెట్లో చుక్కలనంటుతోంది. కొద్దిరోజులు గడిస్తే కొత్త పంట వచ్చి ధరలు తగ్గుముఖం పడతాయని మార్కెట్ వర్గాలు భరోసా ఇస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment