వినా డెల్ మార్ (చిలీ): స్టార్ ఆటగాళ్లు లేకపోయినా... ప్రత్యర్థి జట్టు తమకంటే మెరుగైన ర్యాంక్‌లో ఉన్నప్పటికీ... పట్టుదలతో పోరాడిన బొలివియా జట్టు కోపా అమెరికా కప్ తొలి మ్యాచ్‌తోనే పాయింట్ల ఖాతా తెరిచింది. ప్రపంచ 23వ ర్యాంకర్ మెక్సికో జట్టుతో జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌ను 89వ ర్యాంకర్ బొలివియా ‘డ్రా’గా ముగించింది. పలువురు అగ్రశ్రేణి ఆటగాళ్లున్న మెక్సికోను మ్యాచ్‌లో ఒక్క గోల్ కూడా చేయనీయకుండా బొలివియా ఆటగాళ్లు అడ్డుకోవడం విశేషం. ‘డ్రా’ ఫలితంతో రెండు జట్లకు ఒక్కో పాయింట్ లభించింది.