ఇండోనేషియాలోని ఒక అద్భుతం కట్టడం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అత్యంత తక్కువ స్థలంలో ఆరు అంతస్తుల్లో నిర్మించిన ఒక హోటల్ ఇపుడు హాట్ టాపిక్. సెంట్రల్ జావాలోని సలాటిగా టౌన్‌లో ఉన్న ‘‘పిటురూమ్స్’’ హోటల్ ప్రపంచంలోనే అత్యంత తక్కువ స్థలంలో నిర్మించిన అతి పెద్ద భవంతిగా రికార్డు సాధించింది.
ఇండోనేషియా ఆర్కిటెక్ట్ ఆరీ ఇంద్ర, సహబత్ సెలోజెనే రూపొందించిన అతి సన్నని హెటల్ కేవలం 110 ఇంచుల వెడల్పు అంటే నమ్ముతారా. కాని ఇదే నిజం. సలాటిగా 2022లో నిర్మితమైన ఈ హోటల్ గరిష్ట ఎత్తు 17 మీ (55 అడుగులు) పొడవు 9.5 మీ (31 అడుగులు). ఇంటీరియర్ లేఅవుట్ గురించి ఇక చెప్పాల్సిన పనేలేదు. మొత్తం ఏడు దులు, ఒక చిన్న లాంజ్, ఒక ఎంట్రన్స్ లాబీ, భవనం పైభాగంలో చిన్న అవుట్‌డోర్ టెర్రస్ ఏరియాలో బార్ అండ్ రెస్టారెంట్ కూడా ఉంది. హోటల్ గదులు మధ్య క్రిస్‌క్రాసింగ్ మెట్లు, వస్తువులు, ఇంకా వికలాంగుల కోసం చిన్న ఎలివేటర్ కూడా ఏర్పాటు చేశారు. ఇంకా ఈ ఏడు గదులలో ఒక్కోటి ఒక్కో రంగులో ఒక్కో ధీమ్‌తో ఉంటాయి. డబుల్ బెడ్, టీవీ, షవర్, సింక్ , టాయిలెట్‌తో కూడిన బాత్రూమ్ లాంటి ఫెసిలిటీస్ ఉంటాయి.
కేవలం 9.1 x 9.8 x 7.8 అడుగులతో కాంపాక్ట్ రూమ్స్‌లో అన్ని ఎమినిటీస్, ఇంటీరియర్‌తో, వివిధ ఒరిజినల్ ఆర్ట్‌వర్క్‌లతో, విభిన్న థీమ్‌తో, ప్రతీమూల ఒక పెర్సనల్ టచ్‌తో అత్భుతమైన అనుభవాన్నిస్తుందని సహబత్ సెలోజీని తెలిపారు. ఈ కాంపాక్ట్ రూములను కలిపేలా ఫ్లోటింగ్ స్టెప్స్, 90 సెంటీమీటర్ల (2.9 అడుగుల) నారో క్యారిడార్‌లు కారిడార్‌తో ఫ్లోరింగ్‌గా అమర్చినట్టు తెలిపారు.
ధర ఎంతో తెలుసా?
జపనీస్ భాషలో పిటూ అంటే ఏడు అని అర్థం. సెంట్రల్ జావాలో ఉన్న హోటల్‌లో ఏడు గదులు ఉండడంతో పిటూరూమ్స్ అని పిలుస్తారట. మరి ఈ PituRoomsలో ఒక రాత్రి బస చేయాలనుకుంటే ఒక్కో రాత్రికి సుమారు రూ. 5వేలు ఖర్చు అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment