skinny
-
ఇదో అద్భుత హెటల్: ఇక్కడ అన్నీ ఉంటాయి,, కానీ..!
ఇండోనేషియాలోని ఒక అద్భుతం కట్టడం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అత్యంత తక్కువ స్థలంలో ఆరు అంతస్తుల్లో నిర్మించిన ఒక హోటల్ ఇపుడు హాట్ టాపిక్. సెంట్రల్ జావాలోని సలాటిగా టౌన్లో ఉన్న ‘‘పిటురూమ్స్’’ హోటల్ ప్రపంచంలోనే అత్యంత తక్కువ స్థలంలో నిర్మించిన అతి పెద్ద భవంతిగా రికార్డు సాధించింది. ఇండోనేషియా ఆర్కిటెక్ట్ ఆరీ ఇంద్ర, సహబత్ సెలోజెనే రూపొందించిన అతి సన్నని హెటల్ కేవలం 110 ఇంచుల వెడల్పు అంటే నమ్ముతారా. కాని ఇదే నిజం. సలాటిగా 2022లో నిర్మితమైన ఈ హోటల్ గరిష్ట ఎత్తు 17 మీ (55 అడుగులు) పొడవు 9.5 మీ (31 అడుగులు). ఇంటీరియర్ లేఅవుట్ గురించి ఇక చెప్పాల్సిన పనేలేదు. మొత్తం ఏడు దులు, ఒక చిన్న లాంజ్, ఒక ఎంట్రన్స్ లాబీ, భవనం పైభాగంలో చిన్న అవుట్డోర్ టెర్రస్ ఏరియాలో బార్ అండ్ రెస్టారెంట్ కూడా ఉంది. హోటల్ గదులు మధ్య క్రిస్క్రాసింగ్ మెట్లు, వస్తువులు, ఇంకా వికలాంగుల కోసం చిన్న ఎలివేటర్ కూడా ఏర్పాటు చేశారు. ఇంకా ఈ ఏడు గదులలో ఒక్కోటి ఒక్కో రంగులో ఒక్కో ధీమ్‌తో ఉంటాయి. డబుల్ బెడ్, టీవీ, షవర్, సింక్ , టాయిలెట్‌తో కూడిన బాత్రూమ్ లాంటి ఫెసిలిటీస్ ఉంటాయి. కేవలం 9.1 x 9.8 x 7.8 అడుగులతో కాంపాక్ట్ రూమ్స్‌లో అన్ని ఎమినిటీస్, ఇంటీరియర్‌తో, వివిధ ఒరిజినల్ ఆర్ట్‌వర్క్‌లతో, విభిన్న థీమ్‌తో, ప్రతీమూల ఒక పెర్సనల్ టచ్‌తో అత్భుతమైన అనుభవాన్నిస్తుందని సహబత్ సెలోజీని తెలిపారు. ఈ కాంపాక్ట్ రూములను కలిపేలా ఫ్లోటింగ్ స్టెప్స్, 90 సెంటీమీటర్ల (2.9 అడుగుల) నారో క్యారిడార్లు కారిడార్‌తో ఫ్లోరింగ్‌గా అమర్చినట్టు తెలిపారు. ధర ఎంతో తెలుసా? జపనీస్ భాషలో పిటూ అంటే ఏడు అని అర్థం. సెంట్రల్ జావాలో ఉన్న హోటల్లో ఏడు గదులు ఉండడంతో పిటూరూమ్స్ అని పిలుస్తారట. మరి ఈ PituRoomsలో ఒక రాత్రి బస చేయాలనుకుంటే ఒక్కో రాత్రికి సుమారు రూ. 5వేలు ఖర్చు అవుతుంది. -
బెల్లీ బటన్ టచ్ ఛాలెంజ్....
లండన్ : నాలుకతో ముక్కును పట్టుకోగలరా...అబ్బా.. ఇది పాతేదేగా అనుకుంటున్నారా. అయితే మీ చేతిని వెనకనుంచి ముందుకు తీసుకొచ్చి మీ బొడ్డును ముట్టుకోగలరా.. దీన్నే బెల్లీ బటన్ ఛాలెంజ్ అంటారు. అపుడే ట్రై చేసేస్తున్నారా.. ఆగండాగండి. ఐస్ బకెట్ ఛాలెంజ్, రైస్ బకెట్ ఛాలెంజ్ లాగానే బెల్లీ బటన్ ఛాలెంజ్ ఇపుడు చైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్లో తుపాను సృష్టిస్తోంది. ఇప్పటికే చైనాలో వేలమంది నెటిజన్లు ఈ ప్రయత్నాల్లో మునిగి తేలుతున్నారట. ఈ బెల్లీ బటన్ టచింగ్ కోసం నానా తంటలూ పడుతున్నారట. ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిలు ఈ విషయంలో తెగ పోటీపడుతున్నారని బీబీసీ రిపో్ర్టుచేసింది. ఒక్కరోజులోనే కోటి 30 లక్షల మంది చైనా వెబ్సైట్ 'వైబో'ను వీక్షించారని, దాదాపు 1,04,000కు పైగా చర్చలు జరిగాయని తెలిపింది. కొంతమంది పురుషులు గంటలకు గంటలు కష్టపడి మరీ ఈ ఫీట్‌ను సాధించారట. దీనికి సంబంధించిన ఫొటోలను నెట్లో అప్లోడ్ చేయడంతో లైకులు, కామెంట్లు వెల్లువెత్తాయి. మరోవైపు ఇలా చేయగలిగిన మహిళలు నాజూగ్గా ఉన్నట్టనీ, మిగతావాళ్లు బరువు తగ్గాల్సిందే అని అమెరికా శాస్త్రవేత్త ఒకరు వ్యాఖ్యానించారు. అయితే ఇదంతా బోగస్ అని నిపుణులు అంటున్నారు. బాడీ మాస్ ఇండెక్స్ఆధారంగా ఆరోగ్యాన్ని అంచనా వేసుకోవాలని సూచిస్తున్నారు. ఇలా అందుకోగలిగితేనే మీరు సన్నగా నాజాగ్గా ఉన్నట్టనే అభిప్రాయం ప్రచారం కావడంతో నిపుణులు మండిపడుతున్నారు. నడుం సైజు, చేతుల పొడవు, సాధన మీద ఇది ఆధారపడుతుందని, ఇలా చేయలేకపోయినంత మాత్రాన గందరగోళపడాల్సిన అవసరం లేదంటున్నారు. ముఖ్యంగా మహిళలు, పొట్ట కింది భాగంలో పేరుకుపోయిన కొవ్వును గుర్తించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.