
ఒబెరాయ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్, రిసార్ట్స్ ఛైర్మన్ పృథ్వీ రాజ్ సింగ్ ఒబెరాయ్(94) మంగళవారం ఉదయం అనారోగ్యం కారణంతో కన్నుమూశారు. 2002లో అతను తన తండ్రి మోహన్ సింగ్ ఒబెరాయ్ మరణం తర్వాత ఐఈహెచ్ లిమిటెడ్ ఛైర్మన్, డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2013 వరకు సంస్థ సీఈఓగా కొనసాగారు.
మే 2022 వరకు పృథ్వీ రాజ్ సింగ్ ఈఐహెచ్ లిమిటెడ్ ఛైర్మన్, డైరెక్టర్ బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం తన పదవిని వీడాలని నిర్ణయించుకున్నారు. ఆయన మేనల్లుడు అర్జున్ సింగ్ ఒబెరాయ్‌ను ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా నియమించారు. ఒబెరాయ్ ఆరోగ్యం కోసం ఎక్కువ సమయం కేటాయించేవారని ఆయన కుమారుడు ఒబెరాయ్ హోటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ విక్రమ్ ఒబెరాయ్ తెలిపారు.
పృథ్వీ రాజ్ సింగ్ ఇండియా, యూకే, స్విట్జర్లాండ్‌లో చదువు పూర్తిచేశారు. 1967లో దిల్లీలో ది ఒబెరాయ్ సెంటర్ ఆఫ్ లెర్నింగ్ అండ్ డెవలప్‌మెంట్‌ని స్థాపించారు.
- టూరిజం, హాస్పిటాలిటీ రంగాల్లో చేసిన సేవలకు గాను 2008లో ఒబెరాయ్‌కు పద్మవిభూషణ్ లభించింది.
- 2008లో బిజినెస్‌మ్యాన్ ఆఫ్ ది ఇయర్ టైటిల్ సొంతం చేసుకున్నారు.
- లగ్జరీ హోటళ్లలో కలిస్తున్న వసతులకుగాను 2010లో ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది.
- నవంబర్ 2010లో కార్పొరేట్ హోటలియర్ ఆఫ్ ది వరల్డ్ అవార్డు గెలుచుకున్నారు.
- ఫిబ్రవరి 2013లో ది ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ద్వారా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు లభించింది.
- 2015లో సీఎన్‌బీసీ టాప్ 15 భారతీయ వ్యాపార దిగ్గజాల్లో ఒకరిగా ఎంపికయ్యారు.