oberoi hotel
-
రెండు హోటల్స్ నుంచి ఏడు దేశాలకు.. వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించిన ఒబెరాయ్
ప్రపంచ వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసిన భారతీయ దిగ్గజం, ఒబెరాయ్ గ్రూప్ చైర్మన్ 'పృథ్వీ రాజ్ సింగ్ ఒబెరాయ్' (Prithvi Raj Singh Oberoi) ఈ రోజు కన్నుమూశారు. 1939లో సిమ్లాలో మొదలైన ఒబెరాయ్ హోటల్స్ ప్రస్థానం ప్రస్తుతం ఏడు దేశాలకు విస్తరించింది. దీని వెనుక ఒబెరాయ్ కృషి ఏమిటి, ఆయన సంపద ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఈస్ట్ ఇండియా హోటల్స్ బాధ్యతలు 1929లో జన్మించిన 'ఒబెరాయ్' పాఠశాల విద్యను డార్జిలింగ్‌లోని సెయింట్ పాల్స్ స్కూల్లో పూర్తి చేశారు. ఆ తరువాత అమెరికా, స్విట్జర్లాండ్ దేశాల్లో ఉన్నత చదువుకులు చదువుకున్నాడు. తన తండ్రి 'మోహన్ సింగ్ ఒబెరాయ్' మరణం తరువాత 'ఈస్ట్ ఇండియా హోటల్స్' (East India Hotels) బాధ్యతలను స్వీకరించారు. ఆ తరువాత దీనిని ప్రపంచ దేశాలకు విస్తరించడం మొదలుపెట్టారు. ఒక్క ఆలోచన నిజానికి పర్యాటకులు ఒక దేశాన్ని సందర్శిస్తున్నారంటే.. వారికి బస చేసుకోవడానికి తప్పకుండా అనువైన హోటల్స్ కావాలి. ఈ విషయాన్ని గ్రహించిన 'ఒబెరాయ్' లగ్జరీ హోటల్స్ ప్రారంభించారు. 1939లో సిమ్లాలో ఒబేరాయ్ హోటళ్ల ప్రస్థానం మొదలైంది. ఇప్పుడు ఏడు దేశాల్లో హాస్పిటాలిటీ రంగంలో (ఆతిధ్య రంగం) తిరుగులేని వ్యక్తిగా వేల కోట్ల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసాడు. రెండు హోటళ్లతో ప్రారంభమై తొమ్మిది దశాబ్దాల చరిత్ర కలిగిన ఒబెరాయ్ గ్రూప్ 1934లో కేవలం రెండు హోటళ్లతో ప్రారంభమైంది. మన దేశంలో మొదటి ఫైవ్ స్టార్ హోటల్ ప్రారంభించిన ఘనత ఒబెరాయ్ గ్రూప్‌దే కావడం విశేషం. ఈ ఘనత పీఆర్ఎస్ ఒబేరాయ్ సొంతమే. పీఆర్ఎస్ ఒబెరాయ్ 2013 వరకు ఈఐహెచ్ సీఈఓగా బాధ్యతలు చేపట్టి హాస్పిటాలిటీ రంగంలో దినదినాభివృద్ధి చెందాడు. అంతర్జాతీయ హాస్పిటాలిటీ రంగంలో గుర్తింపు పొందిన పీఆర్ఎస్ ఒబెరాయ్ గత ఏడాది మే 03న ఈఐహెచ్ డైరెక్టర్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం పీఆర్ఎస్ ఒబేరాయ్ కొడుకు 'విక్రమ్ ఒబెరాయ్' ఈఐహెచ్ బాధ్యతలు స్వీకరించారు. మొత్తం సంపద (నెట్‌వర్త్) బికీగా ప్రసిద్ధి చెందిన పీఆర్ఎస్ ఒబెరాయ్ సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2008లో దేశ రెండవ అత్యున్నత పౌరపురస్కారమైన 'పద్మవిభూషణ్'తో గౌరవించింది. ఫోర్బ్స్ ప్రకారం పీఆర్ఎస్ ఒబెరాయ్ సంపద రూ. 3829 కోట్లు అని సమాచారం. ఇదీ చదవండి: ఈ కారు కొనే డబ్బుతో ఫ్లైటే కొనేయొచ్చు - ధర తెలిస్తే అవాక్కవుతారు! కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా.. ప్రపంచంలోని ఇతర దేశాల్లో కూడా విస్తరించిన ఒబెరాయ్ హోటల్స్ ఇప్పుడు మరిన్ని ప్రాంతాల్లో ఏర్పాటుకు సిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, జమ్మలమడుగు, విశాఖపట్టణ ప్రాంతాల్లో ఒబెరాయ్ హోటల్స్ కోసం శంకుస్థాపన చేశారు. ఇవన్నీ త్వరలోనే పూర్తయ్యే అవకాశం ఉంది. -
ఒబెరాయ్ గ్రూప్ ఛైర్మన్ కన్నుమూత
ఒబెరాయ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్, రిసార్ట్స్ ఛైర్మన్ పృథ్వీ రాజ్ సింగ్ ఒబెరాయ్(94) మంగళవారం ఉదయం అనారోగ్యం కారణంతో కన్నుమూశారు. 2002లో అతను తన తండ్రి మోహన్ సింగ్ ఒబెరాయ్ మరణం తర్వాత ఐఈహెచ్ లిమిటెడ్ ఛైర్మన్, డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2013 వరకు సంస్థ సీఈఓగా కొనసాగారు. మే 2022 వరకు పృథ్వీ రాజ్ సింగ్ ఈఐహెచ్ లిమిటెడ్ ఛైర్మన్, డైరెక్టర్ బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం తన పదవిని వీడాలని నిర్ణయించుకున్నారు. ఆయన మేనల్లుడు అర్జున్ సింగ్ ఒబెరాయ్‌ను ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా నియమించారు. ఒబెరాయ్ ఆరోగ్యం కోసం ఎక్కువ సమయం కేటాయించేవారని ఆయన కుమారుడు ఒబెరాయ్ హోటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ విక్రమ్ ఒబెరాయ్ తెలిపారు. పృథ్వీ రాజ్ సింగ్ ఇండియా, యూకే, స్విట్జర్లాండ్‌లో చదువు పూర్తిచేశారు. 1967లో దిల్లీలో ది ఒబెరాయ్ సెంటర్ ఆఫ్ లెర్నింగ్ అండ్ డెవలప్‌మెంట్‌ని స్థాపించారు. టూరిజం, హాస్పిటాలిటీ రంగాల్లో చేసిన సేవలకు గాను 2008లో ఒబెరాయ్‌కు పద్మవిభూషణ్ లభించింది. 2008లో బిజినెస్‌మ్యాన్ ఆఫ్ ది ఇయర్ టైటిల్ సొంతం చేసుకున్నారు. లగ్జరీ హోటళ్లలో కలిస్తున్న వసతులకుగాను 2010లో ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. నవంబర్ 2010లో కార్పొరేట్ హోటలియర్ ఆఫ్ ది వరల్డ్ అవార్డు గెలుచుకున్నారు. ఫిబ్రవరి 2013లో ది ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ద్వారా లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు లభించింది. 2015లో సీఎన్‌బీసీ టాప్ 15 భారతీయ వ్యాపార దిగ్గజాల్లో ఒకరిగా ఎంపికయ్యారు. -
Top 10 Most Expensive Hotels In India: భారత్‌లో ఖరీదైన హోటల్స్ - చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతాయి! (ఫొటోలు)
-
ఆతిథ్యానికి అందలం
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో సంక్షేమం, అభివృద్ధిలో దూసుకెళ్తున్న రాష్ట్రం.. పర్యాటక రంగం అభివృద్ధిలోనూ వేగంగా ముందుకెళ్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికతో రాష్ట్రంలో పర్యాటక రంగంలో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. లగ్జరీ విల్లాలు, 5 స్టార్, 7 స్టార్ హోటళ్ల ఏర్పాటుతో పర్యాటకులను ఆకర్షించడంతోపాటు స్థానికులకు ఉపాధి అవకాశాలూ పెరుగుతాయి. సులభతర వాణిజ్యంలో భాగంగా పర్యాటక ప్రాజెక్టులకు ప్రభుత్వం వేగంగా అనుమతులు మంజూరు చేస్తోంది. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్)లో ఒప్పందం కుదిరిన ప్రాజెక్టులకు మరింత ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే ఐదు ప్రదేశాల్లో రూ.1,350 కోట్ల అంచనాతో 7 స్టార్ సౌకర్యాలతో లగ్జరీ రిసార్ట్స్ నిర్మాణానికి ఒబెరాయ్ ముందుకొచ్చింది. ఇందులో విశాఖ (అన్నవరం), తిరుపతి (పేరూరు), గండికోటలో నిర్మాణాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. త్వరలోనే పిచ్చుకలంక, హార్సిలీహిల్స్‌లో కూడా ఒబెరాయ్ నిర్మాణాలకు ఒప్పందాలు జరగనున్నాయి. రాష్ట్రంలో ఒక్క ఒబెరాయ్ సంస్థల ద్వారానే సుమారు 10,900 మందికి ప్రత్యేక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. తాజాగా విశాఖలో మేఫెయిర్, తిరుపతిలో ఎంఆర్కేఆర్ (హయత్) సంస్థల ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలపింది. వీటికి ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ వెంటనే స్థలాలను సైతం కేటాయించింది. తిరుపతిలో 5 స్టార్ హోటల్ ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతికి ఏటా 30 నుంచి 40 మిలియన్ల యాత్రికులు వస్తుంటారు. దీనికి తోడు చెన్నై – తిరుపతి – నెల్లూరు పారిశ్రామిక హబ్ కూడా ఈ ప్రాంతంలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ క్రమంలో తిరుపతిలోని పేరూరులో 5 స్టార్ లగ్జరీ హోటల్ నిర్మాణానికి హైదరాబాద్‌కు చెందిన ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్స్ ( హయత్ గ్రూప్) ముందుకొచ్చింది. రూ.218 కోట్ల పెట్టుబడితో 1550 మందికిపైగా ఉపాధి కల్పన లక్ష్యంగా ఈ ప్రాజెక్టును రూపొందించింది. దీని ద్వారా వచ్చే 25 ఏళ్లలో రాష్ట్రానికి రూ.230.08 కోట్ల ఆదాయం లభించనుంది. ఇందులో సుమారు 144 గదులు (స్టాండర్డ్, సుపీరియర్, డీలక్స్, సూట్స్), అత్యాధునిక రెస్టారెంట్, కాన్ఫరెన్స్, బ్యాంకెట్ హాల్, వివాహాలు, ఎగ్జిబిషన్లకు ప్రత్యేక వేదిక, హెల్త్ హబ్ ఇతర ప్రపంచ స్థాయి సౌకర్యాలు ఉంటాయి. విశాఖలో రూ.525 కోట్లతో విల్లాల సముదాయం విశాఖపట్నానికి సమీపంలోని అన్నవరం వద్ద మేఫెయిర్ సంస్థ (భువనేశ్వర్) అత్యాధునిక లగ్జరీ రిసార్ట్‌ను అభివృద్ధి చేయనుంది. సుమారు 40 ఎకరాల్లో రూ.525 కోట్లతో 250 రిసార్టులను నిర్మిస్తుంది. దీని ద్వారా 1,750 మందికి ఉపాధి లభిస్తుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 25 ఏళ్లలో రాష్ట్రానికి రూ.852.40 కోట్లు ఆదాయం లభిస్తుంది. ఇందులో భారీ కన్వెన్షన్ సెంటర్, రెస్టారెంట్, మినీ గోల్ఫ్ కోర్సు, 4,500 మంది కూర్చునేలా బ్యాంకెట్ హాల్, మరో 10 చిన్న బ్యాంకెట్ హాళ్లు, ఓపెన్ స్కై బ్యాంకెట్ హాల్, షాపింగ్ మాల్స్ ఉంటాయి. రూ.69.37 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన పర్యాటక రంగంలో మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. తొలి దశలో భాగంగా విశాఖపట్నంలోని అన్నవరం, పేరూరు, గండికోట గ్రామాలను పర్యాటకంగా అభివృద్ధి చేయనుంది. సుమారు రూ.69.37 కోట్లతో గ్రామాల్లో పెద్ద రహదారులను కలుపుతూ రోడ్ల నిర్మాణం, నీటి సౌకర్యం మెరుగుదల, ప్రత్యేక విద్యుత్ లైన్లు, అత్యాధునిక మురుగు పారుదల వ్యవస్థను అందుబాటులోకి తేనుంది. వీటికి త్వరలో టెండర్లు పిలిచి పనులను ప్రారంభించనుంది. సీఎం జగన్ బ్రాండింగ్తోనే పెట్టుబడులు సీఎం జగన్ బ్రాండింగ్‌తో రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయి హోటల్ రంగ సంస్థలు వస్తున్నాయి. ఒబెరాయ్‌తో పాటు మేఫెయిర్, హయత్ గ్రూప్‌ల హోటళ్లు, లగ్జరీ విల్లాల నిర్మాణానికి వేగంగా అనుమతులు ఇచ్చాం. పర్యాటకంతో పాటు స్థానిక యువతకు ఉపాధి కల్పనే ఈ ప్రాజెక్టుల లక్ష్యం. జీఐఎస్‌లో కుదిరిన ప్రతి ఒప్పందాన్ని క్షేత్ర స్థాయిలోకి తీసుకొస్తాం. తిరుపతి, విశాఖ, గండికోటను ప్రపంచ పటంలో మరింత ఉన్నతంగా నిలబెడతాం. పర్యాటకానికి అవకాశాలుండే ప్రాంతాలను గుర్తించి ప్రభుత్వమే అభివృద్ధి చేస్తుంది. తద్వారా మరింతగా పెట్టుబడులను ఆకర్షిస్తాం. – ఆర్కే రోజా, పర్యాటక శాఖ మంత్రి -
ఇక గ్లోబల్ గండికోట
ప్రస్తుతం దేశంలో పర్యాటకం కీ రోల్ పోషిస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ఒక దార్శనికతతో తన డైనమిక్ లీడర్‌షిప్‌తో సీఎం వైఎస్ జగన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పర్యాటక రంగం అభివృద్ధి చెందుతోంది. ఇందులో మమ్మల్ని భాగస్వాములను చేస్తున్నందుకు కృతజ్ఞతలు. ప్రపంచ స్థాయి సెవెన్ స్టార్ రిసార్ట్స్‌ను, మంచి రూమ్స్, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేస్తాం. ఏపీలో హోటల్స్ స్థాపించడం వల్ల ఇక్కడి వారికి ఉపాధి ఇవ్వగలుగుతాం. ప్రఖ్యాతిగాంచిన ఈ గండికోటలో మంచి సౌకర్యాలతో లగ్జరీ సెవెన్ స్టార్ రిసార్ట్‌ను ఏర్పాటు చేస్తున్నాం. తిరుపతి, వైజాగ్‌లో కూడా హోటల్స్‌ను ప్రారంభిస్తాం. 2025కు ఈ హోటల్స్ ప్రారంభమవుతాయి. – విక్రమ్‌సింగ్ ఒబెరాయ్, ఒబెరాయ్ హోటల్స్ సీఈవో సాక్షి ప్రతినిధి, కడప: గ్రాండ్ కాన్యన్ ఆఫ్ ఇండియాగా పిల్చుకునే మన గండికోటను ప్రపంచానికి పరిచయం చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని గండికోటలో ఆదివారం ఆయన ఒబెరాయ్ హోటల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. తిరుపతి, విశాఖపట్నం ఒబెరాయ్ హోటల్స్‌కు కూడా వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడారు. దేవుడి దయ వల్ల ఈరోజు మరో మంచి కార్యక్రమం జరుగుతోందన్నారు. ఒక్కరోజే గండికోట, విశాఖపట్నం, తిరుపతితో కలిపి మూడు చోట్ల ఒబెరాయ్ హోటళ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాలు జరగడం సంతోషకరం అని చెప్పారు. ఒబెరాయ్ లాంటి గ్రూపు ఇక్కడకు వచ్చి.. సూపర్ లగ్జరీ సెవెన్ స్టార్ హోటల్ నిర్మాణం చేపడుతోందన్నారు. ఇలాంటి పెద్ద పెద్ద గ్రూపులు వచ్చి ఇలాంటి హోటల్స్ కడితే గండికోట గ్లోబల్ టూరిజం మ్యాప్‌లోకి చేరుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టుల వల్ల వైఎస్సార్ జిల్లా, గండికోట రెండూ అంతర్జాతీయంగా చోటు దక్కించుకుంటున్నాయని అన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఏపీ కార్ల్ లో నూటెక్ బయోసైన్సెస్‌ను ప్రారంభిస్తున్న సీఎం వైఎస్ జగన్ ఉద్యోగావకాశాలు విస్తృతం ఇక్కడ ఒబెరాయ్ హోటల్ రావడం వల్ల ఉద్యోగావకాశాలు కూడా పెరుగుతాయి. ఈ హోటల్ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 500 నుంచి 800 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఒబెరాయ్ ప్రాజెక్టు అనేది మిగిలిన ప్రాజెక్టులు రావడానికి ఒక దిక్సూచిగా ఉపయోగపడుతుంది. గండికోటలో ఇలాంటి గ్రూపు ప్రాజెక్టులు రావడానికి ఇంకా అవకాశం ఉంది. ఒబరాయ్ లాంటి ఇంకో గ్రూపుని తీసుకొచ్చే కార్యక్రమం ముమ్మరంగా చేస్తాం. ► ఇంతకుముందు విక్రమ్ ఒబెరాయ్‌తో మాట్లాడుతూ ఇక్కడ గోల్ఫ్ కోర్ట్ పెట్టే ఆలోచన చేస్తే హోటల్‌కు మంచిదని, ఈ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగవుతాయని.. ఈ హోటల్‌ను ఒక గోల్ఫ్ రిసార్ట్‌గా దేశానికి, ప్రపంచానికి పరిచయం చేసే అవకాశాలు ఉంటాయని చెప్పాను. ఆ దిశగా అడుగులు వేసేలా ఆలోచన చేస్తామన్నారు. ► విక్రమ్ ఒబెరాయ్‌కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ ఈ ప్రాజెక్టు రావడానికి శాయశక్తులా కృషి చేసిన చీఫ్ సెక్రటరీ కెఎస్ జవహర్‌రెడ్డి నుంచి పర్యాటక శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ సహా ప్రతి ప్రభుత్వ అధికారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఈ ప్రాజెక్టుకు మీ అందరి సహకారం చాలా అవసరం. ఈ కంపెనీ మన గురించి బయట గొప్పగా మాట్లాడితే ఇంకా నాలుగు కంపెనీలు ఇక్కడకు వచ్చే పరిస్థితి ఉంటుందని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ► ఏవైనా చిన్న చిన్న అంశాలుంటే కలిసి మాట్లాడుకుని పరిష్కరించుకుందాం. మనం ఎంత సహకారం అందిస్తే మన జిల్లా ప్రతిష్ట అంతగా పెరిగి అంత ఎక్కువ పరిశ్రమలు వస్తాయి.. పారిశ్రామిక వేత్తలు పెట్టుబడి పెడతారు. మీ సోదరునిగా అందరికీ ఇదే నా విజ్ఞప్తి. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఇక వేగంగా స్టీల్ ప్లాంట్ పనులు ► జమ్మలమడుగు నియోజకవర్గంలో స్టీల్ ఫ్యాక్టరీ రావాలని కలులు కన్నాం. మన పిల్లలకు ఇక్కడే ఉద్యోగ అవకాశాలు రావాలని దశాబ్దాలుగా కన్న కలను నిజం చేస్తూ గతేడాది జిందాల్ గ్రూపుతో కలిసి ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశాం. ఇందుకు సంబంధించిన వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్‌కు ఈ నెలలోనే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వస్తుంది. ఆ తర్వాత రెట్టించిన వేగంతో పనులు జరుగుతాయి. ► రేపు కొప్పర్తిలో డిక్సన్ కంపెనీకి సంబంధించిన ప్లాంట్‌కు ప్రారంభోత్సవం చేస్తున్నాం. కొప్పర్తిలో డిక్సన్ గ్రూపు 1000కి పైగా ఉద్యోగాలు ఇచ్చింది. మరో రెండు నెలల్లో ఇంకో 1000 ఉద్యోగాలు రాబోతున్నాయి. ఛానల్ ప్లే అనే మరో కంపెనీ హోం ఆడియో సిస్టమ్స్ తయారు చేస్తుంది. రేపు కొప్పర్తిలో ఆ కంపెనీతో ఎంఓయూపై సంతకాలు చేయనున్నాం. ఈ కంపెనీ ద్వారా 150 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ► ఎల్ఈడీ టీవీలు, ఎలక్ట్రానిక్ ప్రొడక్టస్ తయారు చేసే టెక్నో డామ్ ఇండియా అనే మరో కంపెనీతో కూడా రేపు ఎంఓయూ చేయబోతున్నాం. ఈ కంపెనీ ద్వారా మరో 200 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. వైఎస్సార్ జిల్లాకు ఇంకా మంచి చేయాల్సిన అవసరం, మంచి జరిగే రోజులు చాలా ఉన్నాయి. దేవుడి దయ, మీ చల్లని ఆశీస్సులతో రాబోయే రోజుల్లో ఇంకా మెరుగ్గా చేసే పరిస్థితులు, అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. -
ఒబెరాయ్ హోటల్ నిర్మాణ పనులకు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన
-
గండికోటలో.. ఒబెరాయ్ అడుగులు
జమ్మలమడుగు : గండికోటలో ఒబెరాయ్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే గండికోటలో రిసార్టు నిర్మాణాలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం 50 ఎకరాల భూమిని లీజుకు కేటాయించింది. గత వారం రోజులుగా ఒబెరాయ్ సంస్థ ప్రతినిధులు ఇక్కడే ఉంటూ కేటాయించిన భూమిలో పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అధికారులు సైతం కేటాయించిన భూమిలో రహదారి ఏర్పాటుకు సంబంధించిన సర్వేలు పూర్తిచేశారు. రూ.250 కోట్లతో 120 విల్లాలు.. చరిత్రాత్మకంగా పేరుగాంచిన గండికోట పర్యాటకులను ఆకర్షించే విధంగా ఒబెరాయ్ హోటల్ యజమాన్యం రూ.250 కోట్లతో 120 విల్లాలను నిర్మించనుంది. గత ఏడాది అక్టోబర్ 11వతేదీన గండికోటలో మొదటి సారిగా ఒబేరాయ్ హోటల్స్ అండ్ రిసార్ట్సు సీఈఓ అర్జున్‌సింగ్ పర్యటించి నాలుగు ప్రదేశాలను చూసి వెళ్లారు. అనంతరం ఈ ఏడాది జనవరి 28వతేదీన విక్రమ్‌జిత్ సింగ్ ఒబెరాయ్, శంకర్, కల్లో కుండు, ఎం.ఏ.ఎల్.రెడ్డి, మహిమాసింగ్ ఠాగూర్‌లు గండికోటలో పర్యటించారు. ఈ ప్రాంతం వారికి నచ్చడంతో పెన్నానదికి సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిలో రిసార్టు నిర్మించేందుకు ముందుకు వచ్చారు. 7వతేదీన శంకుస్థాపనకు సన్నాహాలు.. ఒబెరాయ్ హోటల్స్ యాజమాన్యం ఈనెల 7వతేదీన విల్లాల నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆహ్వానించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు అధికారికంగా సీఎం పర్యటన ఖరారు కాకున్నా కచ్చితంగా వస్తారనే భావనతో ముందస్తుగా మండల పరిధిలోని దప్పెర్ల సమీపంలో హెలిప్యాడ్ నిర్మాణం చేపట్టారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ విజయరామరాజుతోపాటు, జాయింట్ కలెక్టర్ గణేష్‌కుమార్, ఆర్డీఓ జి.శ్రీనివాసులు ఈ ప్రాంతంలో పర్యటించి పనులు వేగంగా జరిగేలా సహకరిస్తున్నారు. -
రూ.100 కోట్లతో గండికోట అభివృద్ధి
బి.కొత్తకోట: వైఎస్సార్ జిల్లా గండికోటను రూ.100 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీటీడీసీ) ఎండీ కె.కన్నబాబు తెలిపారు. గండికోటకు స్పెషల్ ప్రాజెక్టు కింద కేంద్రం రూ.100 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె సమీపంలోని మల్లయ్యకొండపై అభివృద్ధి పనులు చేపట్టేందుకు స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డితో కలిసి ఆయన శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలను అమలు చేస్తోందని తెలిపారు. తద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించే దిశగా కృషి చేస్తోందని చెప్పారు. గండికోటలో చేపట్టిన రోప్ వే పనులు త్వరలో పూర్తవుతాయని చెప్పారు. శ్రీకాళహస్తి, లంబసింగి, పెనుగొండ, గాలికొండ, అన్నవరంలో 20 కిలో మీటర్ల మేర రోప్ వేను రూ.1,200 కోట్లతో పీపీపీ పద్ధతిలో ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఒబెరాయ్ సంస్థ రూ.1,350 కోట్లతో గండికోట, తిరుపతి, పిచ్చుకలంక, హార్సిలీహిల్స్, విశాఖపట్నంలో సెవెన్ స్టార్ హోటళ్లను నిర్మించనుందని చెప్పారు. వైజాగ్ బీచ్ కారిడార్ అమలుకు ప్రణాళికలు రూపొందించామని, భోగాపురం, భీమిలిలో పర్యాటకుల కోసం సీ ప్లేన్, తొట్లకొండలో రూ.120 కోట్లతో అక్వేరియం టన్నెల్ ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయని పేర్కొన్నారు. విజయవాడ భవానీ ద్వీపం అభివృద్ధికి రూ.149 కోట్లతో మాస్టర్ ప్లాన్ సిద్ధమైందని తెలిపారు. ఇంద్రకీలాద్రి నుంచి భవానీ ద్వీపం వరకు 2.5 కిలోమీటర్లు రోప్‌వే ఏర్పాటు ఈ మాస్టర్ ప్లాన్‌లో ఉందన్నారు. లంబసింగి, పాడేరులో కొత్తగా హోటళ్ల నిర్మాణం, అన్నవరంలో ఎకో రిసార్ట్‌కు చర్యలు చేపట్టామని చెప్పారు. -
మారుతున్న ‘5 స్టార్’ రుచులు
న్యూఢిల్లీ: మారిన పరిస్థితుల్లో 5 స్టార్ హోటళ్లు నూతన వ్యాపార అవకాశాలపై దృష్టి పెడుతున్నాయి. కరోనా వైరస్ నియంత్రణ కోసం గతేడాది మార్చి, ఏప్రిల్‌లో విధించిన లాక్డౌన్లు స్టార్ హోటళ్లకు కొత్త మార్గాలను వెతుక్కునేలా చేశాయి. ఈ క్రమంలోనే కోరుకున్న ఆహారాన్ని కస్టమర్ల ఇంటికే డెలివరీ చేసే వ్యాపారాన్ని కొన్ని ప్రారంభించాయి. ఆ తర్వాత లాక్డౌన్లు క్రమంగా తొలగిపోయినప్పటికీ.. హోటళ్ల వ్యాపారం పెద్దగా పుంజుకున్నది లేదు. ఈలోపే కరోనా రెండో వేవ్ (దశ) వచ్చి పడింది. ఫలితంగా దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు లాక్డౌన్లు లేదా కర్ఫ్యూల పేరుతో ఆంక్షల బాట పట్టాయి. ఈ క్రమంలో కస్టమర్ల అవసరాలపై 5 స్టార్ హోటళ్లు దృష్టి సారించాయి. ఈ సమయంలో ఆరోగ్యం పట్ల అందరిలోనూ శ్రద్ధ కొంత పెరిగిన విషయం వాస్తవం. దీన్ని ఎందుకు వ్యాపార అవకాశంగా మార్చుకోకూడదు? అన్న ఆలోచన వాటికి వచ్చింది. దీంతో మంచి పోషకాహారం, రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలతో సరికొత్త రుచుల మెనూ తయారీని ప్రారంభించాయి. ఆకర్షణీయమైన ధరలను నిర్ణయించడం ద్వారా మరింత మంది కస్టమర్లను చేరుకునేందుకు వ్యూహాలను అమలు చేస్తున్నాయి. ఫీల్ మెనూ ఐటీసీ హోటల్స్ కూడా ఇదే విధంగా ‘ఫీల్మెనూ’ను రూపొందించింది. దీని ద్వారా ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను అందించాలన్న ప్రణాళికతో ఉంది. రుతువుల వారీగా స్థానికంగా లభించే ముడిసరుకులతో (వ్యాధి నిరోధక శక్తిని పెంచేవి) ఆహారపదార్థాలను అందించాలనుకుంటోంది. ‘‘ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహార రుచులను ఎన్నింటినో ఇప్పటికే అందిస్తున్నాము. ఇప్పుడు స్థానికంగా సూపర్ ఫుడ్‌గా పరిగణించే వాటిని మా జాబితాలోకి చేర్చనున్నాము’’ అని ఐటీసీ హోటల్స్ కార్పొరేట్ చెఫ్ మనీషా బాసిన్ చెప్పారు. ఇద్దరి భోజనానికి ధర రూ.1,100–1,400 మధ్య ఉంటుందని ఆమె తెలిపారు. అంటే ఐటీసీ ఆన్లైన్ హోమ్ డెలివరీ బ్రాండ్ గోర్మెట్కచ్తో పోలిస్తే ఈ ధరలు తక్కువగానే ఉన్నాయి. ఈ నెల 25న ఐటీసీ సరికొత్త ఆహారపదార్థాల మెనూను విడుదల చేయనుంది. దేశవ్యాప్తంగా అన్ని ఐటీసీ హోటళ్లలో ఈ ఆహార పదార్థాలు అందుబాటులో ఉండనున్నాయి. తాజ్, జింజెర్ బ్రాండ్ హోటళ్లను కలిగిన ఇండియన్ హోటల్ కంపెనీ రెండు వారాల కిందటే ప్రత్యేకమైన ఆహారపదార్థాల జాబితాను అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ క్యుమిన్పై ఇవి అందుబాటులో ఉన్నాయి. కరోనా ఇన్ఫెక్షన్ బారిన పడిన తర్వాత కోలుకునే సమయంలో వివిధ వయసుల వారికి అవసరమైన పోషకాహార పదార్థాలు ఇందులో ఉన్నాయి. కొట్టక్కల్ ఆర్యవైద్యశాలకు చెందిన నిపుణుల సలహాల మేరకు కొత్త పదార్థాలను ఈ సంస్థ రూపొందించింది. రోగనిరోధక శక్తిని పెంచే ఔషధ గుణాలను కలిగిన మూలికలు, దినుసులు, ఇతర పదార్థాలను ఇందులో వినియోగిస్తున్నట్టు ఇండియన్ హోటల్ ‘క్యుమిన్’ కమర్షియల్ డైరెక్టర్ జహంగీర్ తెలిపారు. ఒబెరాయ్ సైతం..: ఒబెరాయ్ గ్రూపు హోటళ్లలోనూ వ్యాధినిరోధక శక్తిని పెంచే ఆహారపదార్థాలు అందుబాటులో ఉన్నాయి. ఆర్డర్‌పై కస్టమర్ల ఇంటికి డెలివరీ సైతం చేస్తున్నాయి. మునగ, ఖర్జూరం, పుట్టగొడుగులు, బ్రొక్కోలి తదితర ముడి పదార్థాలుగా ఆహార పదార్థాలను ఒబెరాయ్ గ్రూపు హోటళ్లు ఆఫర్ చేస్తున్నాయి. మూడ్ డైట్స్... మారియట్ ఇంటర్నేషనల్ ‘మూడ్ డైట్స్’ పేరుతో మెనూను పరిచయం చేయనుంది. ఈ సంస్థ ఇప్పటికే ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సేవలను ‘మారియట్ ఆన్ వీల్స్’ బ్రాండ్ కింద నిర్వహిస్తోంది. ఈ నెల చివరి నుంచి ఆహార ప్రియులకు మంచి భావనలను కల్పించే మూడ్ డైట్స్‌ను సైతం మారియట్ ఆన్ వీల్స్ వేదికగా అందించనుంది. ‘‘డార్క్ చాక్లెట్, కాఫీ, అరటి, బెర్రీలు, నట్స్, సీడ్స్ మంచి భావనలను కల్పించే ఆహార పదార్థాలు. మనకు తెలియకుండానే వీటిని తరచుగా తింటుంటాం. దీంతో ఈ ఆహార పదార్థాలనూ అందుబాటులో ఉంచాలని నిర్ణయించాం’’ అని మారియట్ఇంటర్నేషనల్ కలినరీ డైరెక్టర్ హిమాన్షు తనేజా తెలిపారు. మంచి ఆహారం మంచి భావనలకు మధ్యనున్న అనుబంధం నుంచి తమకు ఈ ఆలోచన వచ్చినట్టు చెప్పారు. -
పెద్ద లక్ష్యం
లక్ష్యం ఏమిటో నిర్థారించుకున్నాక దాని కోసం చేయవలసిన కష్టమంతా చేయాల్సిందే. అతనిదొక ఎగువ మధ్యతరగతి కుటుంబం. తన వాటాగా తండ్రి ఇచ్చిన డబ్బుకు మరికాస్త అప్పు చేసి ఆ వచ్చిన డబ్బుతో కాస్త పెద్ద హోటల్ పెట్టాలనుకున్నాడు. లక్ష్యం నిర్ణయించుకున్నాడు కాబట్టి దానిని నెరవేర్చుకోవడం కోసం ముందు ఏదయినా హోటల్లో పనిచేసి కొంత అనుభవం గడించాలనుకున్నాడు. ఓ హోటల్‌కు వెళ్లి లెక్కలు రాసే పని అడిగాడు. తన దగ్గర పనేమీ లేదు పొమ్మని చెప్పి లోపల ఏదో పని చూసుకుని కొద్దిసేపటి తర్వాత వచ్చాడు యజమాని. ఆ యువకుడు అక్కడే ఉండటం చూసి ఇంకా ఎందుకున్నావని అడిగాడు. ‘‘సార్, నాకు ఉద్యోగం ఏమీ లేదు కాబట్టి, మీరు ఏ పని చెప్పినా చేస్తాను. బజారుకు వెళ్లి హోటల్‌కి కావలసిన సరుకులు తీసుకు వస్తాను, వచ్చిన కష్టమర్లను రిసీవ్ చేసుకుని వారికి ఏం కావాలో అడిగి తెలుసుకుంటాను. మీరు జీతం ఎంత ఇచ్చినా ఫరవాలేదు’’ అని ప్రాధేయపడ్డాడు. ఆ యజమానికి జాలేసి, వెంటనే ఉద్యోగం ఇచ్చాడు. ఈ యువకుడు హోటల్లోకి అవసరమైన సరుకులు, కూరగాయలు మధ్యవర్తులతో పని లేకుండా స్వయంగా తనే వెళ్లి కొనడం దగ్గర నుంచి çహోటల్‌ను శుభ్రంగా ఉంచడం, వచ్చిన వారికి మర్యాద చేయడం వంటి పనులతో హోటల్‌కు ఖర్చులు తగ్గించి, రాబడి పెంచాడు. తన మంచితనంతో, సామర్థ్యంతో తొందరలోనే అసిస్టెంట్ మేనేజర్‌గా, ఆ తర్వాత మేనేజర్‌గా ఉద్యోగోన్నతి పొందాడు. కొద్దికాలానికి ఆ పెద్దాయన పొరుగు దేశంలో స్థిరపడదలచి ఈ యువకుడికి నామమాత్రపు ధరకే ఆ హోటల్‌ను విక్రయించాడు. ఆ యువకుడు తాను పని చేసే హోటల్‌కు యజమాని అయ్యాడు. అలా మొదలైన ఆ యువకుడి ప్రస్థానం అంతటితో ఆగలేదు. ఎన్నో హోటల్స్‌ను స్థాపించాడు. ఎందరో హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులకు ప్రేరణ అయ్యాడు. ఆనాటి ఆ యువకుడే మోహన్ సింగ్ ఒబెరాయ్. స్టార్ హోటల్స్‌లో తనదైన ముద్ర వేసిన ఒబెరాయ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ చైర్మన్ అయ్యాడు. పెద్ద లక్ష్యాన్ని ఎంచుకోగానే సరిపోదు, అది స్పష్టంగానూ, అర్థవంతంగానూ ఉండాలి. దానిని ఎలాగైనా నెరవేర్చుకునే తపన, వచ్చిన చిన్న అవకాశాలని కూడా అందిపుచ్చుకునే ఓర్పూ నేర్పూ ఉండాలి. – డి.వి.ఆర్. -
ఢిల్లీ 5 స్టార్ హోటల్లో నర్సుపై గ్యాంగ్‌రేప్
ఆడవాళ్లు అర్ధరాత్రి కూడా స్వేచ్ఛగా తిరగగలిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లని గాంధీ మహాత్ముడు చెప్పారు. అయితే, స్వాతంత్ర్య దినోత్సవం రోజు రాత్రే.. దేశ రాజధాని ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్లో గల ఓ సూట్లో 27 ఏళ్ల నర్సుపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. ఆస్పత్రిలో అనారోగ్యంతో ఉన్నఓ మహిళను చూసుకోడానికి ఈ నర్సును నియమించారు. అయితే.. సదరు బాధితురాలికి సహాయకులుగా వచ్చిన ఇద్దరు వ్యక్తులే ఆ నర్సుపై అఘాయిత్యం చేశారు. సంఘటనతో తీవ్రంగా కలత చెందిన నర్సు తొలుత పోలీసులకు ఫిర్యాదు చేయకపోయినా, తన భర్తకు చెప్పింది. అయితే.. నిందితులు ఆమెపై మరోసారి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు. దాంతో పోలీసులు వారిద్దరినీ అరెస్టు చేసి తీహార్ జైలుకు పంపారు. వాళ్లను నీరజ్ (25), రాజన్ (23)గా గుర్తించారు. తాను అత్యాచారాన్ని అడ్డుకోడానికి ప్రయత్నించగా, ఉద్యోగం పీకేస్తామని వాళ్లు బెదిరించి, ఒకరి తర్వాత ఒకరుగా పలుమార్లు అత్యాచారం చేసినట్లు బాధిత నర్సు తన ఫిర్యాదులో పేర్కొంది.