ప్రపంచంలోని పురాతనమైన రైల్వేస్టేషన్లలో ఇదొకటి. ఒకప్పుడు రైళ్ల రాకపోకలతో కళకళలాడేది. ఇక్కడ రైల్వే సేవలు నిలిచిపోవడంతో కొన్నాళ్లకు ఈ రైల్వేస్టేషన్‌నే హోటల్‌గా మార్చేశారు. ఇది ఇంగ్లండ్‌లోని పెట్‌వర్త్‌లో ఉంది.
మిడ్ ససెక్స్ రైల్వే కంపెనీ 1859లో ఇక్కడ రైల్వేస్టేషన్‌ను నిర్మించింది. అప్పట్లో ఇక్కడ రైల్వే సిబ్బంది, ప్రయాణికుల వసతి కోసం స్టేషన్‌కు ఆనుకునే ‘రైల్వే ఇన్’ అనే హోటల్ కూడా వెలిసింది.
దాదాపు శతాబ్దానికి పైగా సేవలందించిన పెట్‌వర్త్ రైల్వేస్టేషన్ నుంచి రైళ్ల రాకపోకలను 1966లో నిలిపి వేశారు. తర్వాత దశాబ్దాల తరబడి ఇది అతీ గతీ లేకుండా పడి ఉంది. తర్వాత రైల్వేస్టేషన్‌కు మరమ్మతులు జరిపి, 1995లో తొలిసారిగా స్టేషన్ భవనంలో రెండు గదులను హోటల్ గదుల్లా మార్చి, అతిథులకు బస కల్పించడం ప్రారంభించారు.
తర్వాత ఇక్కడ నిలిచిపోయిన పాత రైళ్ల బోగీలను కూడా హోటల్ గదులుగా మార్చి, స్టేషన్ భవనంలో కూడా మరిన్ని గదులను ఏర్పాటు చేసి 1998 నుంచి దీన్ని ‘ద ఓల్డ్ రైల్వేస్టేషన్’ పేరుతో పూర్తిస్థాయి హోటల్‌గా మార్చారు.
Comments
Please login to add a commentAdd a comment