పండగ రుచులు.. చూసొద్దామా..
పలు హోటల్స్ ప్రత్యేకంగా ‘ఫుడ్ ఫెస్టివల్స్’
సంప్రదాయ వంటకాలకు ప్రత్యేక స్థానం
న్యూ రెసిపీలను పరిచయం చేస్తున్న చెఫ్‌లు
సాక్షి, సిటీబ్యూరో: వచ్చేది ఏడాది ముగింపు సెలబ్రేషన్స్.. ఆ తర్వాత వచ్చేది సంక్రాంతి పండగ.. ఆహార ప్రియులను ఆకట్టుకునేందుకు వివిధ హోటల్ యాజమాన్యాలు ప్రత్యేక రుచులను సిద్ధం చేస్తున్నాయి. సాధారణ రెసిపీలకు భిన్నంగా సంప్రదాయ, గ్రామీణ, స్థానిక, అంతర్జాతీయ వంటకాలను మరోమారు పరిచయం చేస్తున్నాయి. క్రిస్మస్ నుంచి సంక్రాంతి వరకు ఆహారం వేగంగా తినడం, పానీయాలు త్వరగా తాగడం, ఇతర వివిధ రకాల పోటీలు నిర్వహిస్తున్నాయి. ఈ సెలవుల్లో కుటుంబ సభ్యులతో కలిసి జ్ఞాపకాలను సొంతం చేసుకోవాలనుకునే వారికి ఇదో మంచి అవకాశం.
ఒక్కో హోటల్‌లో ఒక్కో రకం..
మినీ భారత దేశంగా ఖ్యాతిగాంచిన భాగ్యనగరంలో వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 1.5 కోట్ల మంది జనాభా నివాసం ఉంటున్నారు. ఆయా ప్రాంతాలకు అనుగుణంగా విభిన్నమైన ఆహారపు అలవాట్లు వారి సొంతం. ఒక్కో ప్రాంతంలో ఫెస్టివల్ సెలబ్రేషన్స్ ఒక్కో విధంగా ఉంటాయి. దీనికి అనుగుణంగానే నగరంలోని పలు హోటల్స్ సైతం ప్రాంతీయ అభిరుచులకు తగ్గట్లుగా ప్రత్యేకించి చెఫ్‌లను తెప్పించి వంటకాలు సిద్ధం చేస్తున్నారు. ఒక్కో హోటల్‌లో ఒక్కో రకమైన మెనూ ప్రత్యక్షం అవుతోంది. సంక్రాంతి సందర్భంగా ప్రత్యేకించి బర్గర్ ఈటింగ్, పానీపూరీ, జూస్ స్పీడ్ డ్రింకింగ్ వంటి పోటీలను నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment