
సాక్షి,హైదరాబాద్:జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ వన్‌లోని ఓ హోటల్‌లో భారీ పేలుడు సంభవించింది. ఆదివారం(నవంబర్ 10) తెల్లవారుజామున 4 గంటలకు పేలుడు జరిగింది. హోటల్ కిచెన్‌లో ఉన్న రిఫ్రిజిరేటర్ కంప్రెసర్ పేలడంతో భారీ శబ్దం వచ్చింది.
పేలుడు ధాటికి హోటల్ ప్రహరీ గోడ ధ్వంసమైంది. పేలుడు తీవ్రతకు రాళ్ళు ఎగిరి పడి పక్కనే ఉన్న దుర్గాభవానీ నగర్ బస్తీలో పడ్డాయి. రాళ్లు పడడంతో బస్తీలో ఐదు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇద్దరికి గాయాలయ్యాయి. భారీ శబ్దానికి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.పేలుడు ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: జగిత్యాలలో రోడ్డు ప్రమాదం
Comments
Please login to add a commentAdd a comment