Sheldon Chalet: Sheldon Mountain House Special Story in Telugu - Sakshi
Sakshi News home page

World Costliest Hotel: చుక్కలు చూడాలా? అయితే ఆ హోటల్‌కి వెళ్లాల్సిందే..!

Published Sun, Dec 5 2021 8:29 AM | Last Updated on Sun, Dec 5 2021 10:49 AM

World Costliest Hotel: Don Shelden Ampi Theatre Sheldon Chalet In Alaska Special Story - Sakshi

చుక్కలు చూస్తూ విహారయాత్రను ఆనందించాలని అనుకుంటూన్నారా! అయితే, తప్పకుండా ఈ హోటల్‌కు వెళ్లాల్సిందే! సుమారు సముద్ర మట్టానికి సుమారు ఆరువేల అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ హోటల్‌ రాత్రి వేళల్లోనే కాదు, బస కోసం అయ్యే బిల్లులోనూ పట్టపగలే చుక్కలు చూపిస్తుంది. అలస్కాలోని డాన్‌ షెల్డన్‌ యాంఫిథియేటర్‌ శిఖరంపై ఉన్న ‘షెల్డన్‌ షాలెట్‌’ హోటల్‌ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైంది.

ఒక జంట మూడురోజులు బస చేయాలంటే రూ. 26 లక్షలు ఖర్చు చేయాలి. కేవలం పదిమందికి మాత్రమే వసతి కల్పిస్తారు. ఇక్కడకు చేరుకోవాలంటే వాయుమార్గం ఒక్కటే దిక్కు. ఇందుకోసం హోటల్‌ యాజమాన్యం కొన్ని ప్రైవేటు హెలికాప్టర్లను ఏర్పాటు చేసింది. వీటితోపాటు రుచికరమైన ఆహారం, అతిథుల ఆనందం కోసం పర్వతారోహణ, చేపలవేట వంటి పలు వినోద కార్యక్రమాలనూ అందిస్తోంది. (చదవండి: ఇంటికి కాళ్లుంటే.. అది ఎంచక్కా నడుచుకుంటూ వెళుతుంటే..! )


ఓ కల..
నిజానికి.. ఈ నిర్మాణం వెనుక ఓ చిన్న కథ ఉంది. హోటల్‌ యజమానులైన రాబర్ట్, కేన్‌ల తల్లిదండ్రులు ప్రశాంతమైన, అద్భుతమైన ఓ యాత్రను కోరుకున్నారు. ఈ విషయం ఆ అన్నదమ్ములకు వారు మరణించిన తర్వాత తెలిసింది. సుమారు దశాబ్దం పాటు శ్రమించి, హోటల్‌ నిర్మాణానికి అనుమతి పొందారు. చుట్టూ పర్వతాలు, చక్కటి వాతావరణం, ఎటు చూసినా ప్రశాంతత ప్రతిబింబించేలా చేశారు. అలా వారి తల్లిదండ్రులు కోరుకున్న ఆనందాన్ని కొంతమందికైనా పంచే ప్రయత్నమే ఈ ‘షెల్డన్‌ షాలెట్‌’. బాగుంది కదూ! మీరు కూడా మీ జోడీతో జాలీగా ఎంజాయ్‌ చేయాలనుకుంటే రెడీ అయిపోండి..కాకపోతే, కాస్త ఖర్చు అవుతుంది మరి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement