
నాగరాజు (ఫైల్)
భువనగిరి : అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన భువనగిరి మండల పరిధిలోని తుక్కాపురం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఈర్ల నాగరాజు(27) భువనగిరి పట్టణంలోని ఓ పెట్రోల్ బంకులో పనిచేస్తున్నాడు. అప్పుల బాధతో మానసిక వేదనకు గురై శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బిల్డింగ్ కొక్కానికి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా తన మృతికి ఎవరు కారణం కాదని సూసైడ్ నోటు రాశాడు. మృతుడి సోదరి కృష్ణవేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై రాఘవేందర్‌గౌడ్ తెలిపారు.