
వెల్లంకిలో పాదయాత్ర చేస్తున్న విశారదన్ మహారాజ్
రామన్నపేట : జనాభాలో 90 శాతం ఉన్న అట్టడు గు వర్గాలు పాలకులుగా మారినప్పుడే పేదలకు ఉచిత విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు లభిస్తాయని దళితశక్తి ప్రోగ్రాం రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ అన్నారు. రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్యాధికారమే లక్ష్యంగా విశారదన్ మహారాజ్ చేపట్టిన పాదయాత్ర శుక్రవారం రామన్నపేట మండలంలో కొనసాగింది. వెల్లంకి, సిరిపురం, బోగారం గ్రామాల్లో ఆయన మాట్లాడుతూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీలు పథకాలు తీసుకునే ముడిసరుకులుగా ఉండటం ఏమిటని ప్రశ్నించారు. అట్టడుగు వర్గాల ప్రజలకు డీఎస్పీ శాశ్వత పరిష్కారం చూపబోతుందన్నారు. యాత్ర 29 జిల్లాల్లో 7,892 కిలో మీటర్లు పూర్తయినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాదయాత్ర ఇంచార్జ్ లక్ష్మణ్, జిల్లా అధ్యక్షుడు నరేందర్, మండల అధ్యక్షుడు నరసింహ, మల్లేష్, నరేందర్, గోవర్దన్, అశోక్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment