భువనగిరి : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం చెరువుల పండుగను ఊరూరా ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు బోనాలు, బతుకమ్మలతో చెరువుల వద్దకు ర్యాలీగా వెళ్లి ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసి నైవేద్యం సమర్పించారు. ఆటాపాటలతో సందడి చేశారు. అనంతరం సహపంక్తి భోజనాలు చేశారు. భువనగిరిలో పెద్ద చెరువు వద్ద నిర్వహించిన వేడుకలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు పూర్వ వైభవం సంతరించు కున్నాయన్నారు.
బోనం ఎత్తుకున్న కలెక్టర్
భువనగిరి మండలంలోని రాయగిరి చెరువు వద్ద నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొన్నారు. బోనమెత్తుకొని మైసమ్మ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఈ కార్యక్రమాల్లో జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ కొల్పుల అమరేందర్, మున్సిపల్ చైర్మన్ అంజనేయులు, వైస్ చైర్మన్ కిష్టయ్య, పీఏసీఎస్ చైర్మన్ నోముల పరమేశ్వర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, కౌన్సిలర్లు జిట్టా వేణుగోపాల్‌రెడ్డి, నర్సింగ్‌నాయక్, ఊదరి లక్ష్మీసతీష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment