
అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణ పనులు పరిశీలిస్తున్న ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి
భువనగిరి : భువనగిరి పట్టణాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని సమ్మద్ చౌరస్తా నుంచి జంఖానగూడెం చౌరస్తా వరకు చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో సీసీ రోడ్లతో పాటు డ్రెయినేజీ పనులు చేపడతామని, మంచి నీటి సమస్యలు లేకుండా చూస్తామని తెలిపారు. ఇప్పటికే పట్టణంలో సీసీ రోడ్లు వేయడం జరిగిందని, ప్రస్తుతం సమ్మద్ చౌరస్తా నుంచి జంఖానగూడెం చౌరస్తా వరకు అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయన్నారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు, వైస్ చైర్మన్ కిష్టయ్య, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, బీఆర్‌ఎస్ పట్టణ కమిటీ అధ్యక్షుడు ఏవీ కిరణ్‌కుమార్, కార్యదర్శి రచ్చ శ్రీనివాస్‌రెడ్డి, కౌన్సిలర్ హేమలత, నాయకులు జగన్, హరికిషన్‌గౌడ్ తదితరులు నాయకులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment