
భార్యాభర్తల మధ్య గొడవ ఆ కుటుంబంలో విషాదం నింపింది. యాదగిరి గుట్టకు చేరుకున్న తండ్రీకూతుళ్లు..
సాక్షి, యాదాద్రి: యాదగిరిగుట్టలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా.. ఓ లాడ్జి పైనుంచి దూకి తండ్రీకూతురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుల్ని హైదరాబాద్ లింగంపల్లికి చెందిన చెరకూరి సురేష్, శ్రేష్ఠగా పోలీసులు గుర్తించారు.
మృతదేహాలను భువనగిరి ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకున్నారు. సూసైడ్ నోట్ ఆధారంగా.. భార్యభర్తల మధ్య గొడవ ఈ అఘాయిత్యానికి కారణమని తెలుస్తోంది.