family disptues
-
భార్యాపిల్లలను చంపి వ్యక్తి సూసైడ్..కారణమిదే..
లక్నో: కుటుంబ తగాదాల కారణంగా ఓ వ్యక్తి తన భార్య ఇద్దరు కొడుకులను దారుణంగా చంపి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాలో జరిగింది.‘భార్యతో గొడవలతో మనస్తాపం చెందిన శ్రవణ్‌రామ్(35) అనే వ్యక్తి తనభార్య శశికల(30) ఇద్దరు కొడుకులు సూర్యారావ్(7),మిట్టు(4)లను పదునైన ఆయుధంతో పొడిచి హత్య చేశాడు. ‘శ్రవణ్రామ్కు ఆయన భార్యకు మధ్య ఇప్పటికే కోర్టులో కేసు నడుస్తోంది. ఆదివారం కూడా వారిరువురి మధ్య గొడవ జరిగింది. గొడవ జరిగిన తర్వాత శ్రవణ్‌రామ్ తన భార్యా పిల్లలను చంపి ఇంటికి సమీపంలోని ఓ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ తగాదాల వల్లే భార్యాపిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాసిన లేఖ శ్రవణ్‌రామ్ జేబులో దొరికింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం’ అని పోలీసులు తెలిపారు. ఇదీచదవండి..జార్ఖండ్ సీఎం సోరేన్‌కు ఆరోసారి ఈడీ సమన్లు.. -
నెల్లూరు: హారిక మిస్సింగ్ కేసు విషాదాంతం
సాక్షి, నెల్లూరు: గుర్రాలమడుగు సంఘం చిన్నారి మిస్సింగ్ కేసు విషాదాంతంగా ముగిసింది. నాలుగు రోజుల కిందట ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారి ప్లేస్‌లో ఓ బొమ్మ ఉంచి.. పాపను ఎత్తుకెళ్లిన ఉదంతం స్థానికంగా సంచలనం సృష్టించింది. అయితే.. చిన్నారి హారిక ఆచూకీ కోసం చేపట్టిన గాలింపులో చివరికి ఆమె మృతదేహం లభ్యం అయ్యింది. సర్వేపల్లి కాలువలో చిన్నారి హారిక మృత దేహం లభ్యం అయ్యింది. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు.. మంగళవారం అర్థరాత్రి దాటాక గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని వెలికి తీయించారు. దీంతో.. ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. మరోవైపు ఈ మిస్సింగ్ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆమె మరణంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది కచ్చితంగా రక్త సంబంధీకుల పనే అయ్యి ఉంటుంది భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల విచారణలో అందిన సమాచారం మేరకే కాలువలో గాలింపు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మీడియా సమావేశం నిర్వహించి.. పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. గుర్రాలమడుగు సంఘానికి చెందిన అనూష, రావూరుకు చెందిన మణికంఠకు నాలుగేళ్ల కిందట వివాహం అయ్యింది. వీళ్లకు ఇద్దరు కూతుళ్లు. మణికంఠ హోటల్ నడుపుతుండగా. అనూష భర్తకు దూరంగా ఉంటూ ఎంసీఏ చదువుతూ గుర్రాల మడుగు సంఘంలోనే ఉంటోంది. భర్త మణికంఠ అప్పుడప్పుడూ వచ్చి భార్యాపిల్లలను చూసి పోతుంటాడు. ఈ క్రమంలో.. ఆదివారం తన తల్లి బయటకు వెళ్లడంతో.. దగ్గర్లో ఉన్న తన పిన్ని ఇంటికి పిల్లలతో వెళ్లింది అనూష. అర్ధరాత్రి కరెంట్ పోవడంతో డోర్లు తీసి పడుకుందామె. ఉదయం లేచి చూసేసరికి.. ఊయలలో ఏడాదిన్నర వయసున్న హారికకు బదులు.. బొమ్మ ఉంది. దీంతో ఆందోళనకు గురై భర్తకు సమాచారం అందించగా.. అంతా కలిసి చుట్టుపక్కల గాలించారు. ఆపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే చిన్నారిని బలి తీసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. -
అయ్యో తల్లీ.. ఎంత పని చేశావ్?
సాక్షి, బళ్లారి అర్బన్: తాలూకాలోని మోకా పోలీస్టేషన్ పరిధిలో సింధవాళ దగ్గర తుంగభద్ర ఎల్ఎల్సీ కాలువలోకి తల్లి ఇద్దరు బిడ్డలతో దూకింది. తల్లి గల్లంతు కాగా ఒక చిన్నారి చనిపోగా, మరో చిన్నారి సురక్షితంగా బయటపడింది. ఈ సంఘటన గురువారం చోటు చేసుకుంది. వివరాలు.. నగరంలోని గుగ్గరహట్టికి చెందిన లక్ష్మి(27)కి కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా హత్తిబెళగల్ గ్రామానికి చెందిన వెంకటేష్‌తో పెళ్లయింది. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. రెండురోజుల కిందట భర్తతో గొడవపడి లక్ష్మి తన నలుగురు పిల్లల్లో ఇద్దరిని తీసుకుని గుగ్గరహట్టిలోని పుట్టింటికి వచ్చింది. తమ్ముడు సురేష్ బుజ్జిగించి భర్త ఇంటికి వెళ్లాలని ఆలూరు బస్సు ఎక్కించి పంపించాడు. భర్త వద్దకు వెళ్లడం ఇష్టం లేని ఆమె మధ్యలో దిగిపోయి సింధవాళ దగ్గర ఉన్న కాలువలోకి పిల్లలతో కలిసి దూకింది. సమీప పొలాల్లో పని చేస్తున్న రైతులు పరుగున వచ్చి కాపాడేందుకు యత్నించారు. ఇద్దరు పిల్లలు వారి చేతికి దొరకగా, తల్లి కాలువలో కొట్టుకుపోయింది. అయితే వారిలో శాంతి అనే చిన్నారి మృతి చెందింది. వెన్నెల అనే చిన్నారి బతికినట్లు మోకా ఎస్ఐ పరశురామ్ తెలిపారు. ఆమె ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. (చదవండి: వీడిన మిస్టరీ.. కూతురు వల్లే ఇలా జరిగిందా?) -
పెళ్లైనప్పటి నుంచి వేధింపులు.. మూడు నిండు ప్రాణాలు బలి
సాక్షి, ఆదిలాబాద్: కుటుంబ కలహాలకు మూడు నిండు ప్రాణాలు బలయ్యాయి. ఇద్దరు పిల్లలతో కలిసి ఒంటిపై కిరోసిన్ పోసుకుని తల్లీ నిప్పంటించుకుంది. తల్లి ఘటనా స్థలంలోనే మృతిచెందగా ఇద్దరు చిన్నారులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఈ సంఘటన ఇచ్చోడ మండలం రెడ్డి కాలనీలో చోటు చేసుకుంది. తల్లీ ఇద్దరు పిల్లల మరణంతో విషాదం నెలకొంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బజార్హత్నూర్ మండలం పిప్రి గ్రామానికి చెందిన వేదశ్రీ (26)కి ఏడేళ్ల క్రితం ఇచ్చోడ మండల కేంద్రంలోని రెడ్డి కాలనీకి చెందిన బాబురెడ్డితో వివాహమైంది. వీరికి ఇద్దరు కూతుళ్లు ప్రజ్ఞ (5), వెన్నెల (3) ఉన్నారు. కొద్దిరోజులుగా వీరి కుటుంబంలో కలహాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో మనస్తాపానికి గురైన వేదశ్రీ గురువారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో వంట గదిలో ఇద్దరు చిన్నారులతో కలిసి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఇంటి నుంచి పొగలు రావడం గమనించిన ఇరుగు పొరుగువారు తలుపులు తెరిచి చూడగా వేదశ్రీ అప్పటికే మృతిచెందింది. తీవ్రంగా గాయపడిన ప్రజ్ఞ, వెన్నెలను వెంటనే ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ చిన్నారులిద్దరూ కొద్ది వ్యవధిలోనే మృతిచెందారు. ఘటనా స్థలాన్ని ఆదిలాబాద్ డీఎస్పీ ఉమేందర్, ఇచ్చోడ సీఐ నైలునాయక్, ఇచ్చోడ ఎస్సై ఉదయ్‌కుమార్ పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, వివాహమైన నుంచే వేదశ్రీని భర్త, అత్త, ఆడబిడ్డలు చిత్రహింసలకు గురి చేసి ఆత్మహత్యకు ప్రేరేపించారని మృతురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏదేమైనా కుటుంబ కలహాలకు తల్లితోపాటు ఇద్దరు ముక్కుపచ్చలారని చిన్నారులు బలవడంతో రెడ్డి కాలనీ, పిప్రిలో విషాదఛాయలు అలుముకున్నాయి. చదవండి: ప్రియుడితో కలిసి భార్య వేధింపులు.. తట్టుకోలేక ఆర్మీ జవాన్! -
‘బంగారు తల్లి’ అంటూ మురిసిపోయావు.. అంతలోనే ఏమైంది తల్లీ?
సాక్షి, ఓడీచెరువు (సత్యసాయిజిల్లా): నవమాసాలు మోసావు.. కని పెంచావు.. మూడేళ్ల పాటు కంటికి రెప్పలా కాపాడుకున్నావు.. ‘బంగారు తల్లి’ అంటూ మురిసిపోయావు..అంతలోనే ఏమైంది తల్లీ? చిన్న సమస్యకే బిడ్డ భారమైపోయిందా? క్షణికావేశంతో ఆశల దీపాన్నే ఆర్పేశావు కదా! చేతులెలా వచ్చాయి తల్లీ?! పుట్టింటికి పంపలేదని మనస్తాపం చెందిన పద్మావతి(26) అనే మహిళ మూడేళ్ల బిడ్డను బావిలో పడేసింది. దీంతో ఆ బిడ్డ విగతజీవిగా మారింది. పద్మావతి ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. ఈ ఘటన అమడగూరు మండలం గొల్లపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. బుక్కపట్నం మండల కేంద్రానికి చెందిన పద్మావతి(26)కి అమడగూరు మండలం గొల్లపల్లికి చెందిన వెంకటేష్‌కు ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి నిహస్వి (3) సంతానం. పద్మావతి, వెంకటేష్ దంపతులు అన్యోన్యంగా ఉండేవారు. రెండురోజుల కిందట పద్మావతి తనను పుట్టింటికి పంపాలని భర్తను కోరింది. అయితే పొద్దుతిరుగుడు పంట కోశాక పంపుతానని వెంకటేష్ చెప్పాడు. దీంతో మనస్తాపం చెందిన ఆమె శుక్రవారం తన బిడ్డ నిహస్విని తీసుకుని ఇంటి బయటకు వెళ్లింది. భార్య, బిడ్డ కనిపించకపోవడంతో వెంకటేష్ ఇరుగూ పొరుగున ఆరా తీశాడు. తుమ్మచెట్ల బావివైపు వెళ్లినట్లు తెలిసింది. చదవండి: (మామను ప్రియుడితో హత్య చేయించిన కోడలు) బావి వద్దకు వెళ్లి చూడగా.. చిన్నారి నిహస్వి మృతదేహం నీటిపై తేలియాడుతూ కనిపించింది. చిన్నారి మృతదేహాన్ని స్థానికులు బయటకు తీశారు. పద్మావతి అదే బావిలో దూకి గల్లంతయ్యిందా లేక ఎటైనా వెళ్లిందా అన్నది తెలియరాలేదు. అయితే.. బావిలోకి దూకి ఉంటుందనే ఉద్దేశంతో మోటారు సాయంతో నీటిని తోడిస్తున్నారు. రాత్రి పది గంటలైనా ఆచూకీ దొరకలేదు. సంఘటన స్థలాన్ని ఎస్ఐ రమణ పరిశీలించారు. కేసు నమోదు చేసినట్లు అమడగూరు పోలీసులు తెలిపారు. -
యాదగిరిగుట్టలో విషాదం
సాక్షి, యాదాద్రి: యాదగిరిగుట్టలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా.. ఓ లాడ్జి పైనుంచి దూకి తండ్రీకూతురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుల్ని హైదరాబాద్ లింగంపల్లికి చెందిన చెరకూరి సురేష్, శ్రేష్ఠగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను భువనగిరి ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకున్నారు. సూసైడ్ నోట్ ఆధారంగా.. భార్యభర్తల మధ్య గొడవ ఈ అఘాయిత్యానికి కారణమని తెలుస్తోంది. -
మనస్పర్దలతో దంపతుల బలవన్మరణం
సాక్షి, చిత్తూరు/శ్రీకాళహస్తి: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మనస్పర్ధల కారణగాంగా భార్యభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో వారి ఇద్దరి ఆడపిల్లలు అనాధలుగా మిగిలారు. వివరాలు.. మునికుమార్ (40), మాధవి (36) దంపతులు శ్రీకాళహస్తి పట్టణంలోని కర్ణల వీధిలో నివాసముంటున్నారు. వీరికి మునిశ్రావణి (15), మునిసాయి (12) సంతానం. మునికుమార్ తిరుమలలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. గత కొంతకాలంగా భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో గతరాత్రి కూడా దంపతుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుందనీ.. ఇద్దరూ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. కాగా, ఘటనకు సంబంధించి పూర్త వివరాలు తెలియాల్సి ఉంది. -
కట్టుకున్నోళ్లే కడతేర్చారు..
కట్టుకున్న భర్తలే ఆ మహిళలపాలిట కాలయములయ్యారు. అదనపు కట్నం కోసం ఒకడు, కుటుంబ తగాదాలతో మరొకడు తమ భార్యలను పొట్టనబెట్టుకున్నారు. జిల్లాలోని పాతఇస్సిపేట, ఉప్పరపల్లిలో జరిగిన ఈ ఘటనలు బాధిత కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. పురుగుల మందు తాగించి.. మొగుళ్లపల్లి : అదనపు కట్నం కోసం కొన్నాళ్లుగా భార్యను హింసిస్తున్న ఓ వ్యక్తి చివరికి ఆమెను హింసించి, పురుగుల మందు తాగించి హత్య చేసిన సంఘటన మండలంలోని చింతలపల్లి శివారు పాతఇస్సిపేటలో శుక్రవారం జరిగింది. కుటుం బ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం... పాతఇస్సిపేట గ్రామానికి చెందిన నేర్పటి మొగిలి, స్వరూ ప దంపతుల కుమార్తె స్వప్నను అదే గ్రామానికి చెందిన జన్నె పరమేశ్వర్ తొమ్మిదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో వారికి ఇద్దరు కుమారులు కలిగారు. గత రెండేళ్లుగా భర్త పరమేశ్వర్ అదనపు కట్నం కోసం స్వప్నను హింసిస్తున్నాడు. ఈ క్రమంలో పలుమార్లు పెద్దమనుషుల మధ్య పంచాయితీ లు కూడా జరిగాయి. గురువారం రాత్రి ఇంటికి వచ్చిన పరమేశ్వర్ అదనపు కట్నం కోసం భార్యను తీవ్రంగా కొట్టాడు. అనంతరం పురు గుల మందు తాగించాడు. తర్వాత ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. తల్లి స్వరూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై సురేందర్ తెలిపారు. కిరోసిన్ పోసి నిప్పంటించి.. చెన్నారావుపేట : కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి తన భార్యపై కిరోసిన్ పోసి నిప్పటించడంతో తీవ్ర గాయాలపాలై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందు తూ శుక్రవారం మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని ఉప్పరపల్లి గ్రామానికి చెందిన కుక్కల రాజుకు, నర్సంపేట మండలంలోని నాగుర్లపల్లి గ్రామానికి చెందిన కడబోయిన సదయ్య కూతురు సరిత(28)తో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరి దాంపత్య జీవితంలో ఇద్దరు కుమార్తెలు జన్మించారు. కుటుంబ తగాదాలతో సోమవారం రాత్రి భార్య సరితపై రాజు కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఆమె అరుపులను గమనించిన చుట్టుపక్కల వారు మంటలార్పి ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతిచెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పులి వెంకట్‌గౌడ్ తెలిపారు. ∙ -
అడ్డు వచ్చిన అత్తపై అల్లుడు కత్తితో దాడి..
నిజామాబాద్: కుటుంబ కలహాలతో దంపతుల మధ్య వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. ఈ నేపథ్యంలో అడ్డు వచ్చిన అత్తపై అల్లుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలోని వర్ని మండలం సిద్ధాపూర్ తండాలో ఆదివారం చోటుచేసుకుంది. కూతుర్ని ఎందుకు కొట్టావని అడగటానికి వచ్చిన అత్తపై అల్లుడు కత్తితో దాడికి దిగాడు. ఆమెను గట్టిగా పొడవటంతో పేగులు బయటకు వచ్చాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు. అల్లుడు నానక్ సింగ్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.