కోదాడ: తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యం స్థాపనే లక్ష్యంగా ముందుకు పోతున్నామని బీఎస్పీ ఉత్తరప్రదేశ్ ఎంపీ రాంజీగౌతమ్ అన్నారు. శుక్రవారం కోదాడలో జరిగిన ఆ పార్టీ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్, దేశంలో బీజేపీ రెండు ఒకటేనన్నారు. రాష్ట్రంలో బహుజనులు ఏకమై రాజ్యాధికార సాధనకు పోరాడాలన్నారు. రాష్ట్రంలో లక్షకు పైగా బ్యాక్‌లాగ్ పోస్టులు ఉన్నాయని వాటిని వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆ పార్టీ నాయకులు మందా ప్రభాకర్, బాలస్వామి, దయానందరావు, పిల్లుట్ల శ్రీనివాస్, బొడ్డు కిరణ్, మల్లేశ్‌యాదవ్, కాంపాటి శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.
Published Sat, Feb 25 2023 11:32 AM | Last Updated on Sun, Feb 26 2023 5:53 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment