
గాయపడిన సుధా కుటుంబ సభ్యులు
చివ్వెంల(సూర్యాపేట) : ఇంటి స్థలం విషయంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన చివ్వెంల మండల పరిధిలోని ఉండ్రుగొండ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో చర్చి పక్కన ఉన్న 221 గజాల స్థల విషయంలో గ్రామానికి చెందిన మాద సుధాకు అదే గ్రామానికి చెందిన శీలం నాగయ్య, శీలం శ్రీను, శీలం వెంకటేశ్వర్లు, శీలం పవన్‌ల మధ్యన ఘర్షణ నెలకొంది. ఈ క్రమంలో ఆ స్థలంలో బావి ఉండడంతో దానిని పూడ్చివేసి ఇంటి నిర్మాణం కోసం సుధా గ్రామ పంచాయతీ అనుమతులు తీసుకుంది. కాగా గ్రామానికి చెందిన శ్రీను, నాగయ్య, వెంకటేశ్వర్లు, పవన్‌లు అదే స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టారు. దీంతో శుక్రవారం స్థల విషయంలో సుధా, ఆమె సోదరుడు దార పుల్లయ్య, ఆయన కుమారుడు ప్రసన్న కుమార్, కూతుర్లు నవ్య, రాజేశ్వరీలకు నాగయ్య, శ్రీను, వెంకటేశ్వర్లు, పవన్‌లతో ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణతో ఇరువర్గాల వారికి గాయాలయ్యాయి. వీరిని స్థానికులు చికిత్స నిమిత్తం సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై ఎస్‌ఐ విష్ణుమూర్తిని వివరణ కోరగా ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment