సాక్షి,యాదాద్రి : రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు కృషి చేయాలని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన సంస్థల సహాయ సంచాలకులు డాక్టర్ మల్లారెడ్డి అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో శుక్రవారం ఏరువాక కేంద్రం జిల్లా సమన్వయ సమితి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఆయా ప్రాంతాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వాటి నివారణ చర్యలు వివరించాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ డీఏఓ నీలిమ, నల్లగొండ ఇన్‌చార్జ్ డీఏఓ వినోద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment