
బాలుడిని తల్లిదండ్రులకు అప్పగిస్తున్న చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి సాయి త్రిలోక్
గరిడేపల్లి : తప్పిపోయిన బాలుడిని చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు అతడి తల్లిదండ్రులకు అప్పగించారు. వివరాలిలా ఉన్నాయి. గురువారం రాత్రి గరిడేపల్లి మండలంలోని కితవారిగూడెంలో గుర్తుతెలియని బాలుడిని గ్రామ ప్రజలు గుర్తించి చైల్డ్ డిపార్ట్‌మెంట్ వారికి అప్పగించారు. బాలుడిని బాలల సంరక్షణ కేంద్రంలో ఉంచి విచారించగా అతడి పేరు వనమా రాజీవ్‌గా, తల్లిదండ్రులు పద్మావతి, సురేష్ అని చెప్పాడు. ఈమేరకు బాలుడిని చెల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆదేశాల మేరకు చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి సాయి త్రిలోక్ ఆధ్వర్యంలో ఖమ్మంలో ఉన్న బాబు తల్లిదండ్రులకు శుక్రవారం అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment