సాక్షి, యాదాద్రి : కంటి వెలుగు రెండో విడతలో ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 1,00,980 మందికి పరీక్షలు నిర్వహించినట్లు కలెక్టర్ పమేలా సత్పతి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కంటి వెలుగు, హారితహారం, అయిల్‌పామ్ సాగు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 110 గ్రామ పంచాయతీలు, 40 వార్డుల్లో కంటి వెలుగు పరీక్షలు పూర్తయినట్లు చెప్పారు. 19,198 రీడింగ్ అద్దాలు, 1,421 ప్రిస్క్రిప్షన్ అద్దాలు పంపణీ చేసినట్లు వెల్లడించారు. 13,547 ప్రిస్క్రిప్షన్ అద్దాలు ఆర్డర్ పెట్టినట్లు చెప్పారు. 918 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగులోకి వచ్చిందని, మార్చి నెలాఖరు నాటికి వెయ్యి ఎకరాలకు చేరుతుందన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు దీపక్ తివారీ, శ్రీనివాస్‌రెడ్డి, డీఎంహెచ్‌ఓ మల్లికా ర్జున్‌రావు, జిల్లా అటవీ అధికారి పద్మజారాణి, ఉద్యానవన శాఖ అధికారి అన్నపూర్ణ, మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment