
సాక్షి, నిజామాబాద్: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన కామెంట్స్ చేశారు. బాల్కొండలో వందల కోట్ల స్కామ్ జరిగిందని అరవింద్ ఆరోపించారు. బాల్కొండ ప్రజలకు మంత్రి ప్రశాంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కాగా, ఎంపీ అరవింద్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. బాల్కొండలో వందల కోట్ల స్కాం జరిగింది. బట్టాపూర్‌లో శ్రీకాంత్, వంశీరెడ్డి అక్రమంగా క్వారీక్రషర్లు నడుపుతున్నారు. పర్యావరణ అనుమతులు లేకుండా ఐదేళ్లు నడిపించారు. బాల్కొండ ప్రజలకు మంత్రి ప్రశాంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. రూ.51లక్షల కరెంట్ బిల్లు కట్టకపోతే విద్యుత్ శాఖ మంత్రి ఏం చేస్తున్నారు. సామాన్యుడు రూ.2వేలు విద్యుత్ ఛార్జీ కట్టకపోతే కరెంట్ కట్ చేస్తారు. దీనికి మంత్రి జగదీష్ రెడ్డి సమాధానం చెప్పాలి అని సీరియస్ కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: బాధగా ఉంది.. కనీస కృతజ్ఞత కూడా లేదు: మంత్రి ప్రశాంత్ ఆవేదన
Comments
Please login to add a commentAdd a comment