ట్రిపుల్‌ఆర్ దక్షిణ భాగంలో రేవంత్ సర్కారు భూ దందాలు
సాక్షి, హైదరాబాద్: రీజనల్ రింగు రోడ్డు (ట్రిపుల్ ఆర్) దక్షిణ భాగంలో అలైన్‌మెంట్ మార్పుతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం భూ దందాలకు తెరలేపుతోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ నేతల సొంత లాభం కోసం అలైన్‌మెంట్ మార్చు తూ పేదల భూముల నుంచి రోడ్డును తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అలైన్‌మెంట్ మా ర్పు వెనకాల దందాలు, అరాచకాలు ఎవరి కోసం జరుగుతున్నాయో ప్రభుత్వం చెప్పాలన్నా రు.
అలైన్‌మెంట్ మార్పుపై ప్రజలకు ఉన్న అనుమానాలను సీఎం రేవంత్ నివృత్తి చేయాలన్నా రు. పార్టీ నేతలు శుభప్రద్ పటేల్, కిషోర్, రాకేశ్‌కుమార్ తదితరులతో కలసి వేముల ప్రశాంత్‌రెడ్డి శుక్రవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. రీజనల్ రింగు రోడ్డు ఉత్తరభాగం అలైన్‌మెంట్ ఇప్పటికే అమోదం పొందగా, గతంలోనే ఖరారు చేసిన దక్షిణ భాగం అలైన్‌మెంట్‌కు కేంద్రం ఆమోదం లభించాల్సి ఉందన్నారు.
నాలుగు చోట్ల అలైన్‌మెంట్ మార్పు
ఫోర్త్‌సిటీ సౌలభ్యం పేరిట సాగర్ రోడ్డు, శ్రీశైలం రోడ్డులో 4 కిలోమీటర్లు మార్చడంతో పాత, కొత్త అలైన్‌మెంట్‌ల మధ్య 10 నుంచి 12 కిలోమీటర్లకు దూరం పెరిగిందని ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ఆమన్‌గల్ మండలం కుందారంలో పేదలు సా గు చేసుకుంటున్న 400 ఎకరాల భూమిని రాజవంశీయులతో బేరం చేసుకుని కాంగ్రెస్ నేతలు ‘బిగ్ బ్రదర్స్’అండతో లాక్కుంటున్నారని ఆరోపించారు. మాడుగులలో సీఎం బంధువుల భూ ముల్లో ఏం జరుగుతుందో చెప్పాలని, ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు లబ్ధి జరిగేలా అలైన్‌మెంట్ మా రిందన్నారు. బిగ్ బ్రదర్స్‌తో పాటు కాంగ్రెస్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, మాజీ మంత్రి, కాంగ్రెస్ నేతలకు మేలు చేసేలా చేవెళ్ల మా ర్గంలో అంగడి చిట్టెంపల్లి నుంచి 5 కిలోమీటర్లు జరిపి మన్నెగూడ క్రాస్ రోడ్‌కు అలైన్‌మెంట్ మా ర్చారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment