alignment change
-
అలైన్మెంట్ మార్పు వెనుక అరాచకం: మాజీ మంత్రి వేముల
సాక్షి, హైదరాబాద్: రీజనల్ రింగు రోడ్డు (ట్రిపుల్ ఆర్) దక్షిణ భాగంలో అలైన్మెంట్ మార్పుతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం భూ దందాలకు తెరలేపుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ నేతల సొంత లాభం కోసం అలైన్మెంట్ మార్చు తూ పేదల భూముల నుంచి రోడ్డును తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అలైన్మెంట్ మా ర్పు వెనకాల దందాలు, అరాచకాలు ఎవరి కోసం జరుగుతున్నాయో ప్రభుత్వం చెప్పాలన్నా రు.అలైన్మెంట్ మార్పుపై ప్రజలకు ఉన్న అనుమానాలను సీఎం రేవంత్ నివృత్తి చేయాలన్నా రు. పార్టీ నేతలు శుభప్రద్ పటేల్, కిషోర్, రాకేశ్‌కుమార్ తదితరులతో కలసి వేముల ప్రశాంత్‌రెడ్డి శుక్రవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. రీజనల్ రింగు రోడ్డు ఉత్తరభాగం అలైన్మెంట్ ఇప్పటికే అమోదం పొందగా, గతంలోనే ఖరారు చేసిన దక్షిణ భాగం అలైన్‌మెంట్‌కు కేంద్రం ఆమోదం లభించాల్సి ఉందన్నారు. నాలుగు చోట్ల అలైన్మెంట్ మార్పు ఫోర్త్‌సిటీ సౌలభ్యం పేరిట సాగర్ రోడ్డు, శ్రీశైలం రోడ్డులో 4 కిలోమీటర్లు మార్చడంతో పాత, కొత్త అలైన్మెంట్ల మధ్య 10 నుంచి 12 కిలోమీటర్లకు దూరం పెరిగిందని ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ఆమన్‌గల్ మండలం కుందారంలో పేదలు సా గు చేసుకుంటున్న 400 ఎకరాల భూమిని రాజవంశీయులతో బేరం చేసుకుని కాంగ్రెస్ నేతలు ‘బిగ్ బ్రదర్స్’అండతో లాక్కుంటున్నారని ఆరోపించారు. మాడుగులలో సీఎం బంధువుల భూ ముల్లో ఏం జరుగుతుందో చెప్పాలని, ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు లబ్ధి జరిగేలా అలైన్మెంట్ మా రిందన్నారు. బిగ్ బ్రదర్స్‌తో పాటు కాంగ్రెస్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, మాజీ మంత్రి, కాంగ్రెస్ నేతలకు మేలు చేసేలా చేవెళ్ల మా ర్గంలో అంగడి చిట్టెంపల్లి నుంచి 5 కిలోమీటర్లు జరిపి మన్నెగూడ క్రాస్ రోడ్‌కు అలైన్మెంట్ మా ర్చారన్నారు. -
సీఎం ఫాంహౌస్ కోసమే ‘రీజినల్’ అలైన్మెంట్ మార్పు
సాక్షి, యాదాద్రి: రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంతో సీఎం కేసీఆర్ ఫాంహౌస్ భూములు పోతాయనే అలైన్మెంట్ మార్చారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. వాస్తానికి రింగ్‌రోడ్డు.. సంగారెడ్డి చౌరస్తా నుంచి సదాశివపేట, సీఎం ఫాంహౌస్æ మీదుగా వెళ్లాల్సి ఉండగా దాని అలైన్మెంట్ మార్చిన కారణంగా భువనగిరి పట్టణం, కలెక్టరేట్‌ను అనుకొని ఉన్న రాయగిరి భూములు పోతున్నాయన్నారు. యాదాద్రి జిల్లా రాయగిరి రైతులు సోమవారం ఎంపీ వెంకట్‌రెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఆయన రైతులతో మాట్లాడుతూ.. రైతుల కోసం తాను ఎంతటి త్యాగానికి, పోరాటానికైనా సిద్ధమేనని అన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఇంకా ఫైనల్ కాలేదని, రైతులు ఆందోళన చెందవద్దన్నారు. ఈ సమస్యను కేంద్ర మంత్రి గడ్కరీ దృష్టికి తీసుకెళ్లానని.. దసరా తర్వాత మరోసారి ఢిల్లీకి వెళ్లి గడ్కరినీ కలుద్దామని రైతులకు చెప్పారు. అంతకుముందు రాయగిరి, చౌటుప్పల్ మండలం భూనిర్వాసితులు యాదాద్రి కలెక్టరేట్ ఎదుట రాస్తారోకో నిర్వహించారు. అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్‌రెడ్డి వారి నుంచి వినతిపత్రం తీసుకుని ప్రభుత్వానికి తెలియజేస్తానని హామీ ఇవ్వడంతో రాస్తారోకోను విరమించారు. చదవండి: ప్రాజెక్టులకు సహకరించని రాష్ట్ర సర్కారు -
మార్పునకు ఓకే
చారిత్రక కట్టడాల పరిరక్షణకే సర్కార్ మొగ్గు మెట్రో అలైన్మెంట్ మార్పుతోనే ఇది సాధ్యం మెట్రో నుంచి తప్పిన కట్టడాల జాబితా వెల్లడి సిటీబ్యూరో: చారిత్రక కట్టడాల పరిరక్షణకు సర్కార్ పెద్దపీట వేసింది. వారసత్వ, చారిత్రక కట్టడాలకు ఇబ్బందులు లేకుండా మెట్రో రైల్ కారిడార్-2లో అలైన్మెంట్ మార్పులకు ప్రభుత్వం అంగీకరించింది. ఎలాంటి నిర్ణయం వెలువడుతుందోనని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆయా వర్గాల వారు తాజా నిర్ణయంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఏడు మందిరాలు, 28 వరకు ప్రార్థనాస్థలాలు సురక్షితంగా బయటపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం బుధవారం మెట్రో నిర్మాణ సంస్థ ఎల్అండ్టీకి ఇచ్చిన లేఖలో అలైన్మెంట్ మార్పుతో సురక్షితంగా ఉండేకట్టడాల జాబితాను వెల్లడించింది. ఆ వివరాలివే... జాబితాలో వెల్లడించిన మందిరాలు.. అలీజా కోట్లలోని కట్టమైసమ్మ దేవాలయం, హరిబౌలి-అక్కన్నమాదన్న దేవాలయం, హరిబౌలిలోని అక్కన్న మాదన్న ప్రార్థనాలయాలు, బేలాలోని బంగారు మైసమ్మ దేవాలయం, శాలిబండలోని జగదీశ్ టెంపుల్, శాలిబండలోని శ్రీలక్ష్మీనరసింహ దేవాలయం, అలియాబాద్లోని దర్బార్ మైసమ్మ దేవాలయం. సురక్షితంగా ఉండే మసీదులు, చిల్లాలు, దర్గా, శ్మశాన వాటికలు.. మూసీ ఎడమవైపు ఉన్న మసీదు. దారుల్షిఫాలోని చిల్లా(రోటరీ జంక్షన్). దారుల్షిఫా ఫుట్‌బాల్ గ్రౌండ్ వద్ద గల రెండు పురాతన శ్మశానవాటిక లు. పురానిహవేలిలోని మజీద్ ఈ ఎండీ ఇస్మాయిల్ ఖాన్ బక్షి. పురాణి హవేలీలోని మసీదు. నల్ ముబారక్. పురాని హవేలీ దర్గా. ఈతేబార్చౌక్ మసీదు. ఎల్హెచ్ఎస్ మసీదు. ఈతే బార్చౌక్ వద్ద రహదారి మధ్యనున్న మసీదు. అహలే అదీజ్ మసీదు. అస్లాం ఫంక్షన్‌హాలు వద్దనున్న మసీదు. అస్లాం ఫంక్షన్‌హాలు వద్ద రహదారి మధ్యనున్న మసీదు. అక్బర్ ప్లాజా వద్దగల దయీ ముర్తజా. మీర్‌మోమిన్ దర్గా. మీర్‌మోమిన్ దయిరా వద్దనున్న మసీదు. రహదారి మధ్యనున్న చిల్లా. మసీద్ ఇ ఫక్రున్నిసా. దర్గా ఆన్ ఎల్హెచ్ఎస్ ప్రేయర్‌హాల్-2. దర్గా షరీఫ్ హజ్రత్ ఆన్ ఎల్హెచ్ఎస్. శాలిబండ శ్మశానవాటిక. శాలిబండ దర్గా. షాగౌస్ హోటల్ వద్దనున్న కంబాల్ మసీదు. శ్మశానవాటిక. మసీద్ ఈ ఆసిన్ ఎల్హెచ్ఎస్. గ్రేవ్‌యార్డ్ ఆన్ ఆర్హెచ్ఎస్. అలియాబాద్ జెండా వద్దనున్న చిల్లా. దర్గా ఆన్ ఆర్హెచ్ఎస్. గ్రేవ్‌యార్డ్ అండ్ తాకియా మొఘల్ మసీద్ ఆన్ ఆర్హెచ్ఎస్ ఉన్నాయి. మెట్రోరైలు ప్రాజెక్టు అధికారులు బుధవారం కారిడార్-2లోని పలు ప్రాంతాలను సందర్శించారు. సాలార్జంగ్ మ్యూజియం నుంచి ఫలక్‌నుమా వరకు గతంలో ప్రతిపాదించిన అలైన్‌మెంట్‌ను పరిశీలించారు. దారుషిఫా, పురానీహవేలి, అలిజాకోట్ల, బీబీబజార్ చౌరస్తాలోని ప్రాంతాల్లో దూరాన్ని తెలుసుకున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు నిర్మాణ పనుల అలైన్‌మెంట్‌ను మార్పు చేయడంతో గతంలో అధికారులు నిర్దేశించిన ప్రతిపాదనలను పునఃపరిశీలించారు. - యాకుత్‌ఫురా -
ఆధ్యాత్మిక, చారిత్రక కట్టడాలకు విఘాతం లేకుండా..
* మెట్రో అలైన్మెంట్ మార్పుపై ముఖ్యమంత్రి కేసీఆర్ * మూడు చోట్ల మార్పులకు ప్రతిపాదన * పాతబస్తీలో మెట్రో అలైన్మెంట్ మార్పుపై సీఎం సమీక్ష సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో చారిత్రక కట్టడాలు, దేవాలయాలు, ముస్లింల ప్రార్థనామందిరాలు, ప్రజల మనోభావాలతో ముడిపడిన ఇతర చిహ్నాలకు ఎలాంటి విఘాతం కలగకుండా ‘మెట్రో’ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. మూడుచోట్ల మెట్రోరైలు మార్గాన్ని మార్చాలని ఇదివరకే తాము ఎల్ అండ్ టీకి స్పష్టం చేసినట్లు వివరించారు. పాతబస్తీలో అలైన్మెంట్ మార్పునకు సంబంధించి ఎంఐఎం పక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఆర్థికశాఖ కార్యదర్శులతో సీఎం కేసీఆర్ మంగళవారం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. గతంలో సూచించిన మార్పులకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిన నేపథ్యంలో ఎక్కడెక్కడ మార్పులు అవసరం, మెట్రో రైలు ఏ మార్గం నుంచి వెళ్లాలనే వివరాలను ఎల్ అండ్ టీకి అధికారికంగా తెలియజేసేందుకు ముఖ్యమంత్రి ఈ సమావేశాన్ని నిర్వహించారు. అసెంబ్లీ భవనంతోపాటు, ప్రజల మనోభావాలతో ముడిపడివున్న తెలంగాణ అమరవీరుల స్తూపానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అసెంబ్లీ వెనుకవైపు నుంచి వెళ్లేలా మొదటి మార్పు... వ్యాపార కేంద్రంగా పేరొందిన సుల్తాన్‌బజార్, బడిచౌడి మధ్యనుంచి కాకుండా ఉమెన్స్ కళాశాల వెనుకవైపు నుంచి వెళ్లేలా రెండో మార్పు ఉండాలని సూచించినట్టు తెలిపారు. ఇక, పాతబస్తీలో ప్రస్తుతం ఉన్న అలైన్మెంట్ ప్రకారం నిర్మాణం జరిగితే ఏడు హిందూ దేవాలయాలు, 28 ముస్లింల ప్రార్థనా మంది రాలు, వెయ్యి నివాసగృహాలు దెబ్బతింటాయని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వివరించారు. ఇక్కడ అలైన్మెంట్ మార్పుతో అక్కన్న మాదన్న దేవాలయం, జగదీష్ టెంపుల్, బంగారు మైసమ్మ, లక్ష్మి నర్సింహ దేవాలయంతోపాటు ఆజాఖానా జోపురా, అసుర్ఖానా నాల్ ముబారక్, ఇత్తెబార్చౌక్ మసీదు. కోట్లా మసీదు తదితర ఆధ్యాత్మిక కట్టడాలకు ఇబ్బంది ఉండదని తెలిపారు. ఈ ప్రతిపాదనలకు సంబంధించి అలైన్మెంట్ వివరాలను ప్రభుత్వం అధికారికంగా ఎల్ అండ్‌టీకి అందించనుంది. ఇదిలాఉండగా, పాతబస్తీలో మెట్రోరైలు అలైన్‌మెంట్‌కు సంబంధించి ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కూడా కొన్ని ప్రతిపాదనలు చేశారు. అభివృద్ధిలో భాగస్వాములవుతాం కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ర్టంలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల్లో తామూ భాగస్వాములవుతామని ఎల్అండ్టీ గ్రూపు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎఎం నాయక్ స్పష్టం చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు ఆయన రాసిన లేఖ విశేషాలను సీఎం కార్యాలయం మంగళవారం విడుదల చేసింది. రాష్ట్రంలో విద్యుత్, మౌలిక సదుపాయాల రంగంలో పనిచేస్తామని, ఉభయ ప్రయోజనం ఉండాలన్నది తమ అభిమతమని నాయక్ వివరించారు. ఈ నెల 15న ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో ఆయన ప్రదర్శించిన దీర్ఘకాలిక అభివృద్ధి పథకాలు, ముందుచూపు నచ్చాయని పేర్కొన్నారు. రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన సుదీర్ఘ పోరాటం తమకు తెలుసునని వ్యాఖ్యానించారు. రాష్ట్ర సంపూర్ణ అభివృద్ధితోపాటు సామాజిక, ఆర్థికాభివృద్ధిపై ముఖ్యమంత్రి విజన్ తమను ప్రభావితం చేసిందన్నారు. గుజరాత్‌లోని హజిరాలో ఎల్అండ్టీ నిర్మించిన ప్రసిద్ధ తయారీ రంగ సంస్థను సందర్శించాలని ఆ లేఖలో కేసీఆర్‌ను కోరినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం వివరించింది. -
‘మలుపుల’ భారం రూ.1,000 కోట్లు
* ఆ మొత్తాన్ని భరించనున్న తెలంగాణ ప్రభుత్వం * మూడు చోట్ల మారనున్న మెట్రో అలైన్మెంట్ * రెండు కి.మీ. మార్గంలో మార్పులు, చేర్పులు * ప్రాజెక్టు వ్యవధి మరో ఏడాది పెరిగే అవకాశం! * రెండో దశపై చిగురిస్తున్న ఆశలు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో రైలు ప్రాజెక్టులో మూడు చోట్ల అలైన్మెంట్ మారనుంది. సుమారు రెండు కిలోమీటర్ల మార్గంలో మార్పులు, చేర్పులు జరగనున్నాయి. దీంతో తెలంగాణ సర్కారుపై రూ.వెయ్యి కోట్లు అదనంగా భారం పడే అవకాశాలున్నాయి. ప్రస్తుతం రూ.14,132 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న మెట్రో ప్రాజెక్టు వ్యయం రూ.15,132 కోట్లకు చేరనుంది. గన్‌పార్క్-అసెంబ్లీ, సుల్తాన్‌బజార్‌తో పాటు ఎంఐఎం పార్టీ కోరిక మేరకు పాతనగరంలో మెట్రో అలైన్మెంట్ మార్పులు చేయాలని తెలంగాణ ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించిన విషయం తెలిసిందే. ఆయా ప్రాంతాల్లో నూతన మార్గం ఖరారు,ఆస్తుల సేకరణ, క్షేత్రస్థాయి పరీక్షలు, స్టేషన్లు, పిల్లర్ల నిర్మాణంపై నిపుణుల బృందం కసరత్తు చేశాక ఈ అంచనా వ్యయంలో హెచ్చుతగ్గులుండే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎల్బీనగర్-మియాపూర్, జేబీఎస్-ఫలక్‌నుమా, నాగోల్-శిల్పారామం మార్గాల్లో 72 కిలోమీటర్ల మేర ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. గతంలో నిర్ణయించిన ప్రకారం కాకుండా అలైన్మెంట్ మార్చితే అందుకు అయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే భరించాలని ప్రాజెక్టు నిర్మాణ ఒప్పందంలోనే స్పష్టంగా పేర్కొన్నట్లు నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మలుపులు తిరిగేది ఎక్కడంటే... * సుల్తాన్ బజార్ నుంచి కాకుండా మెట్రో మార్గాన్ని కోఠి ఉమెన్స్ కళాశాల వెనక నుంచి తిలక్పార్క, బాటా జంక్షన్ వద్ద ఎడమవైపునకు తిప్పి కాచిగూడ క్రాస్ రోడ్స్ వరకు మళ్లిస్తారు. * అసెంబ్లీ, గన్‌పార్క్ అమరవీరుల స్తూపాలకు నష్టం వాటిల్లకుండా నాంపల్లి తెలుగు విశ్వవిద్యాలయం, దాని వెనకనున్న రైల్వే ట్రాక్‌కు సమాంతరంగా పబ్లిక్‌గార్డెన్‌లోని లలిత కళాతోరణం ముందున్న రోడ్డు నుంచి పోలీసు క్వార్టర్లు, ఏపీ డీజీపీ కార్యాలయం మీదుగా లక్డీకాఫూల్ స్టేషన్ వరకు మెట్రో మార్గాన్ని పొడిగిస్తారు. * ఈ రెండు ప్రాంతాల్లో మారిన తాజా అలైన్మెంట్ ప్రకారం డిజైన్లు రూపొందించేందుకు ఎల్అండ్టీ, హెచ్ఎంఆర్ సంస్థలు రంగం సిద్ధం చేస్తున్నాయి. * ఆయా ప్రాంతాల్లో అలైన్మెంట్ మార్పుతో సుమారు 30 నుంచి 50 కట్టడాల కూల్చివేత తథ్యమని తెలిసింది. ఇందులో 19 పోలీసుశాఖ క్వార్టర్లు, తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ క్వార్టర్‌తో పాటు,కోఠి ఉమెన్స్ కళాశాలలోని మూడు భవంతులను నేలమట్టం చేయాల్సి వస్తుందని హెచ్ఎంఆర్ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. పబ్లిక్‌గార్డెన్ నుంచి రవీంద్రభారతి వరకు వేసిన 20 పిల్లర్లను తొలగించాలని నిర్ణయించారు. పాతనగరంలో మార్పులు మెట్రో మార్గం పాతబస్తీలోని దారుషిఫా-మీర్‌చౌక్-శాలిబండ మీదుగా వెళితే సుమారు 69 మసీదులు, అషురుఖానాలు, ఛిల్లాలకు నష్టం వాటిల్లుతుందని ఎంఐఎం ఆందోళన వ్యక్తం చేసింది. దాంతో మెట్రో మార్గాన్ని బహద్దూర్పూరా-కాలపత్తర్-ఫలక్‌నుమా మీదుగా మళ్లిం చాలని కోరుతోంది. ఇదే విషయమై చర్చిం చేందుకు 20న ప్రభుత్వం మరోమారు ఎల్ అండ్ టీ అధికారులతో సమావేశం కానుంది. స్టేషన్లపై తకరారు అలైన్మెంట్ మార్పుతో సుల్తాన్‌బజార్ స్టేషన్‌కు బదులుగా కోఠి మెట్రో స్టేషన్‌ను ఎక్కడ నిర్మిం చాలన్న అంశంపై హెచ్ఎంఆర్ అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. ఎంజీబీఎస్‌కు వెళ్లే ప్రయాణీకులకు ఇబ్బంది పడకుండా ఈ స్టేషన్ ఉండాలని భావిస్తున్నారు. ఇప్పుడు అలైన్మెంట్ మార్పుతోఅసెంబ్లీ సమీపంలో బదులుగా నాంపల్లి రైల్వేస్టేషన్ దగ్గర మెట్రో స్టేషన్ ఏర్పాటవుతుందని హెచ్ఎంఆర్ వర్గాలు తెలిపాయి. 200 కి.మీ. మేర మెట్రో రెండోదశ.. సుమారు 200 కి.మీ మార్గంలో మెట్రో మార్గాన్ని విస్తరిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో మెట్రో రెండో దశపై ఆశలు చిగురిస్తున్నాయి. సమీప భవిష్యత్‌లో మెట్రో ప్రాజెక్టు ఏ ఏ మార్గాలలో అవసరమో హెచ్ఎండీఏ గతంలోనే మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేసింది. 2018 వరకు ఆగాల్సిందే.. మూడు ప్రాంతాల్లో మెట్రో అలైన్మెంట్ మార్పుతో ఆయా ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన, మట్టి నమూనా పరీక్షలు, హైడ్రాలిక్ టెస్టులు, పిల్లర్ల డిజైన్, ఆస్తుల సేకరణ వంటి అంశాలన్నీ తిరిగి మొదటికి రానున్న నేపథ్యంలో మెట్రో పనులు ఏడాది పాటు ఆలస్యం కానున్నాయి. అంటే ముందుగా అనుకున్న ప్రకారం మూడు కారిడార్లలో ప్రాజెక్టు పనులు 2017 చివరి నాటికి కాకుం డా 2018 చివరికి పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాగోల్-మెట్టుగూడా (8 కి.మీ) మార్గం (మొదటి దశ) మాత్రం 2015 మార్చి 21న ప్రారంభించనున్నారు. హెచ్ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌లో మెట్రో మార్గాలివీ.. 1.బీహెచ్ఈఎల్-మియాపూర్-ఎల్బీనగర్ 2.జూబ్లీహిల్స్-ఫలక్‌నుమా-శంషాబాద్ 3.కొత్తగూడ-శిల్పారామం-నాగోల్-ఎల్బీనగర్ 4.ఎల్బీనగర్-ఒవైసీ ఆస్పత్రి-శివరాంపల్లి-మెహిదీపట్నం 5.ఎంజీబీఎస్-రామంతాపూర్-ఉప్పల్-ఘట్కేసర్ 6.ఒవైసీ ఆసుపత్రి-బేగంపేట్ 7.కాప్రా-బీహెచ్ఈఎల్ 8.ఎల్బీనగర్-చౌటుప్పల్ 9.లక్డీకాఫూల్-మెహిదీపట్నం-గచ్చిబౌలి-లింగంపల్లి-బీహెచ్ఈఎల్ 10.బీహెచ్ఈఎల్-సంగారెడ్డి 11.ఎంజీబీఎస్-ఉందానగర్- శంషాబాద్ విమానాశ్రయం