సాక్షి, నిజామాబాద్: తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు మంచి చేసినా కృతజ్ఞత చూపించడంలేదని బాధను వెల్లబోసుకున్నారు. తనకు బాధగా అనిపిస్తోందంటూ కామెంట్స్ చేశారు.
కాగా, మంత్రి ప్రశాంత్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మెండోరా ప్రాంత రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ.. శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్ట్‌కు కాళేశ్వరం నీళ్లు తెచ్చినా కనికరం చూపించరా? అని ప్రశ్నించారు. గతంలో కాకతీయ లీకేజీ నీళ్లు విడుదల చేయకపోతే ఆందోళనలు చేశారు. రైతులు హైదరాబాద్‌కు తరలివచ్చారు. నాపై చెప్పులు వేసినా పట్టించుకోలేదు. ఎందుకంటే రైతులది బతుకుపోరాటం.
శ్రీరామ్‌సాగర్ నీళ్లు మొట్టమొదటగా అందేది మెండోరాకే. ఇప్పుడు కాళేశ్వరం నుంచి నీళ్లు తెచ్చినా కెనాల్ కమిటీ వారు కనీసం కృతజ్ఞతలు చెప్పేందుకు మెండోరాకు రాలేదు. నాకు బాధగా ఉంది. మెండోరాకు ఎంత మంచి చేసినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: జడ్జి భర్తపై బీఆర్‌ఎస్ కార్యకర్తల దాడి.. ‘ఆస్పత్రికి వెళ్లాలి, దారి ఇవ్వండి’ అని అడిగినందుకు..
Comments
Please login to add a commentAdd a comment