దళిత జాతుల వైతాళికుడికి నివాళి
నేడు దళిత జాతుల వైతాళికుడు, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి రోజు. 1956, డిసెంబర్ 6 నుండి దేశ వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ ప్రజలు తమ ప్రియ తమ నేత అంబేద్కర్‌ను గుర్తుచేసుకుంటూ ఘనంగా నివా ళులర్పిస్తున్నారు. ముస్లింల ప్రార్థనామందిరం బాబ్రీ మసీ దును సరిగ్గా ఈ రోజునే (1992 డిసెంబర్ 6) కూల్చివేశారు. ఇది జరిగి నేటికి 22 ఏళ్లు. అంబేద్కర్ వర్ధంతి నాడే ఈ ఘటన జరగ డంతో ఈ దినం రెండు రకాలుగా మన జ్ఞాపకాలను తడుము తోంది. ఒక జ్ఞాపకం హిందూ సమాజంపై ధ్వజమెత్తిన అంబే ద్కర్‌ను స్మరించుకోవడం.
హిందూ మతం సాంఘిక సమానత్వా నికి వ్యతిరేకమని పీడిత కులాల ప్రజలకు వివరించడమే కాకుం డా ఆజన్మాంతం ఆయన హిందూమతానికి, కులవ్యవస్థకు వ్యతిరే కంగా పోరాడారు. ఇక రెండో జ్ఞాపకం. ఒక స్వయం సేవకుడు ప్రస్తుతం దేశప్రధాని అయిన నేపథ్యానికి సంబంధించినది. 68వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ‘జెండా సాక్షిగా చెబు తున్నా జాతిని నిర్మిస్తా’మన్నారు.
అనేక భాషలు, ఆచార వ్యవహా రాలు, పలు కులాలు, పరస్పర విరుద్ధ దృక్పథాలు, మతాలు ఉన్న దేశంలో కొందరు పుట్టుక ద్వారా బానిసత్వం అనుభ విస్తూ, మతం పేరుతో పీడనకు గురవుతున్నంత కాలం జాతి నిర్మాణం కాదు. కులం పునాదుల మీద ఒక జాతిని, నీతిని నిర్మించలేమంటాడు అంబేద్కర్. లౌకిక, ప్రజాస్వా మిక ఉద్యమశక్తులు, వామపక్షాలు భావజాల రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్లే హిందుత్వశక్తులు విస్తరించి, కేం ద్రాధికారం చేజిక్కించుకున్నాయి.
మత ఘర్షణలు జరిగినప్పుడే నిరసన చర్యలకు పూనుకునే ప్రగతిశీలవాదులు, దళితులు, అంబే ద్కర్ వారసులు తర్వాత నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంటున్నారు. ఈ నిర్లక్ష్యంవల్లే మతం నేడు అధికారమైంది. కావున భావజాల రంగంలో కూడా ప్రగతిశీల శక్తులు క్రియాశీలకపాత్ర పోషించాల్సి ఉంది. దీర్ఘకాలిక ప్రణాళికతో ఉద్యమ నిర్మాణం తక్షణ అవసరం. అదే అంబేద్కర్‌కు మనం అర్పించే నివాళి. అంబేద్కర్ వర్ధంతిని హిందూమతోన్మాద వ్యతిరేకదినంగా జరుపుకుందామని ఈ దేశం లోని లౌకిక, వామపక్ష ఉద్యమశక్తులకు, దళిత ప్రజా సంఘాలకు కులనిర్మూలనా పోరాట సమితి పిలుపునిస్తోంది.
(నేడు డా॥బి.ఆర్.అంబేద్కర్ వర్ధంతి)
దుడ్డు ప్రభాకర్ కులనిర్మూలనా పోరాట సమితి