అంబేడ్కర్‌కు సముచిత గౌరవం | CM YS Jagan lays foundation stone for 125 feet Ambedkar statue | Sakshi
Sakshi News home page

అంబేడ్కర్‌కు సముచిత గౌరవం

Published Thu, Jul 9 2020 4:04 AM | Last Updated on Thu, Jul 9 2020 7:45 AM

CM YS Jagan lays foundation stone for 125 feet Ambedkar statue - Sakshi

సాక్షి, అమరావతి/ అమరావతి బ్యూరో: రాష్ట్ర ప్రజల్లో స్ఫూర్తిని కలిగించేలా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 125 అడుగుల నిలువెత్తు విగ్రహ ఏర్పాటుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ చారిత్రక ఘట్టానికి విజయవాడలోని స్వరాజ్‌ మైదాన్‌ వేదిక కానుంది. విగ్రహ ఏర్పాటుతో పాటు పార్కు తదితర నిర్మాణ పనులకు బుధవారం సీఎం వైఎస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
అంబేడ్కర్‌ పార్క్‌కు వీడియో కాన్ఫ్‌రెన్స్‌ ద్వారా శంకుస్థాపన చేసి మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌ 

► విజయవాడ నగరం నడిబొడ్డున విగ్రహం ఏర్పాటు చేస్తే అంబేడ్కర్‌కు తగిన గౌరవం ఇచ్చినట్టు అవుతుందని, ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.


అంబేడ్కర్‌ స్వరాజ్‌ మైదాన్‌గా నామకరణం
► నీటిపారుదల శాఖకు చెందిన 20.22 ఎకరాల విస్తీర్ణంలో పీడబ్ల్యూడీ మైదానం ఉంది. 
► విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ 1997లో దీని పేరు ‘స్వరాజ్‌ మైదాన్‌’గా మార్చింది. 
► ఇప్పుడు ఈ మైదానానికే ‘డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ స్వరాజ్‌ మైదాన్‌’గా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నామకరణం చేసింది. 
► ఏడాదిలోగా ఈ పనులన్నీ పూర్తి చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. విగ్రహ ఏర్పాటు తదితర అభివృద్ధి పనులను ఏపీఐఐసీకి అప్పగించింది. 
► 20 ఎకరాల స్థలంలో అంబేడ్కర్‌ స్మారక మందిరంతో పాటు గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. అలాగే విగ్రహం చుట్టూ ఆహ్లాదకరమైన (పార్కు), ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌తోపాటు వాకింగ్‌ ట్రాక్‌ను అభివృద్ధి చేయనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement