
ఎస్సీలకు 25 శాతం రిజర్వేషన్ కల్పించాలి
మన్ననూర్ : భారత రాజ్యాంగంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్లలో భాగంగా జనాభా ప్రాతి పధికగా ఎస్సీలకు 25 శాతం రిజర్వేషన్ కల్పించాలని మాల మహనాడు రాష్ట్ర అధ్యక్షుడు జి. చెన్నయ్య డి మాండ్ చేశారు. మంగళవారం అంబేద్కర్ కూడలిలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. టీడీపీ మాల, మాదిగ ల మధ్య చిచ్చు పెట్టడంతోనే తెలంగాణలో కనుమరు గు అయిందని అన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతమైన అమ్రాబాద్ మండలానికి ప్రత్యేక ప్యాకేజీ కల్పించడంతో పాటు ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అం దించాలని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వంలో చిచ్చు రేపేందుకే టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి వర్గీకరణపై అసెంబ్లీ సమావేశాల్లో దూమారం రేపే వ్యాఖ్యలకు పాల్పడడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. టీఆర్‌ఎస్ హామీల్లో భాగంగా ఎస్సీలకు రాష్ట్ర వ్యాప్తంగా భూపంపిణీ చేపట్టాలని అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం మంత్రి వర్గంలో ఇప్పటికైనా ఇద్దరు మాల ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యధర్శి కుంద మల్లికార్జున్, విక్రం, సత్యం, నర్సింహ, వెంకటేష్, అవుల డేవిడ్, గోపాల్, అంజయ్య, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.