
సాక్షి, అమరావతి : రాజ్యాంగ సృష్టికర్త బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్ది ఆయనకు ట్వీటర్ వేదికగా నివాళులర్పించారు. భారత సమాజానికి దార్శనికులు బాబా సాహెబ్ అని కీర్తించారు. దశాబ్దాలుగా దేశ సామాజిక, రాజకీయ, ఆర్థిక విధానాల నిర్ణేత అంబేడ్కర్ అని, ఆయన మరణం లేని మహాశక్తి అని కొనియాడారు. ‘నేడు రాజ్యాంగ నిర్మాత, అణగారిన వర్గాల ఆరాధ్య నేత డా. బి.ఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా నిండు మనసుతో నివాళులర్పిస్తున్నాను’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు.
‘భారత రాజ్యాంగ నిర్మాత, బహుముఖ ప్రజ్ఞాశాలి, భారతరత్న డాక్టర్ భీమ్ రావ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడు, నవయుగ వైతాళికుడి కి నా ఘన నివాళులు’ అని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.