ఎల్‌ఐసీ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ
ఎల్‌ఐసీ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ
Published Mon, Aug 29 2016 12:17 AM | Last Updated on Mon, Sep 4 2017 11:19 AM
న్యూశాయంపేట : వరంగల్ ఎల్‌ఐసీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల 3వ ద్వైవార్షిక సమావేశం ఆదివారం హన్మకొండలోని డివిజన్ ఆఫీసులో నిర్వహిం చారు. ఈ సమావేశానికి వరంగల్, మహబూబాబాద్ ఎంపీలు పసునూరి దయాకర్, సీతారాంనాయక్ ముఖ్య అతిథులుగా హాజరై కార్యాలయం ఆవరణలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎల్‌ఐసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో జోనల్ అధ్యక్షుడు కిషన్‌నాయక్,డివిజన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, కార్యదర్శి అశోక్ , రాములు, లచమ్మ, జాన్, కిష్టయ్య, నిక్షన్‌రాజ్, మధు, నారాయణ, చిరంజీవి,పురుషోత్తం, వీరస్వామి పాల్గొన్నారు.
Advertisement
Advertisement