ST employees
-
ఎల్ఐసీ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ
న్యూశాయంపేట : వరంగల్ ఎల్ఐసీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల 3వ ద్వైవార్షిక సమావేశం ఆదివారం హన్మకొండలోని డివిజన్ ఆఫీసులో నిర్వహిం చారు. ఈ సమావేశానికి వరంగల్, మహబూబాబాద్ ఎంపీలు పసునూరి దయాకర్, సీతారాంనాయక్ ముఖ్య అతిథులుగా హాజరై కార్యాలయం ఆవరణలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎల్ఐసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో జోనల్ అధ్యక్షుడు కిషన్‌నాయక్,డివిజన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, కార్యదర్శి అశోక్ , రాములు, లచమ్మ, జాన్, కిష్టయ్య, నిక్షన్రాజ్, మధు, నారాయణ, చిరంజీవి,పురుషోత్తం, వీరస్వామి పాల్గొన్నారు. -
బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయండి
అనంతపురం : వర్సిటీలో కొన్ని సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ నాయకులు మంత్రి గంటాకు వినతిపత్రం అందజేశారు. 25 ఏళ్లుగా పనిచేస్తున్నామని, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. నాయకులు ఓబులేసు, శ్రీరాములు, ముత్యాలప్ప, మారెప్ప, రామలక్ష్మమ్మ, లోకమ్మ పాల్గొన్నారు. -
ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులపై ప్రత్యేక దృష్టి : ఎమ్మెల్యే సౌమ్య
గాంధీనగర్ : ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషిచేసే విషయమై ప్రత్యేక దృష్టి సారిస్తానని నందిగామ శాసనసభ్యురాలు తంగి రాల సౌమ్య హామీ ఇచ్చారు. ప్రెస్‌క్లబ్‌లో ఏపీఎస్ ఆర్టీసీ ఎస్సీ,ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం కృష్ణా రీజియన్ 4వ మహాసభ శుక్రవారం జరిగింది. తొలుత రాజ్యాంగ నిర్మా త బీఆర్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్‌రావ్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ ఎస్సీ,ఎస్టీ ఉద్యోగులు ఐకమత్యంగా ఉంటూ సమస్యలపై పోరాడాలని సూచించారు. కృష్ణా రీజినల్ మేనేజర్ జి.సుధేష్‌కుమార్, అసిస్టెంట్ డెరెక్టర్ బి.కమలాకర్‌రెడ్డిని ఉద్యోగ సంఘం ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఆర్టీసీ ఎస్సీ,ఎస్టీ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా బి. కోటయ్య, ప్రధాన కార్యదర్శిగా ఎం.అబ్రహం, కోశాధికారిగా నానక్ ఎన్నికయ్యారు. ఎస్సీ,ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు తాడంకి ప్రతాప్ కుమార్, ఆడిట్ డిపార్టుమెంట్ డెప్యూటీ డెరైక్టర్ మేడేపల్లి వరప్రసాద్, పి.దేవానందరావు తదితరులు పాల్గొన్నారు.