బంద్‌లో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ, వామపక్ష, జనసేన నాయకులు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ సోమవారం చేపట్టిన బంద్ రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణంగా కొనసాగుతోంది. రాష్ట్ర బంద్‌కు ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపునిచ్చిన సంగతి తెల్సిందే. ఈ బంద్‌కు టీడీపీ, బీజేపీ దూరంగా ఉన్నాయి. వైఎస్సార్‌సీపీ, వామపక్షాలతో పాటు మిగతా పార్టీలు బంద్‌కు సంపూర్ణ మద్ధతు ప్రకటించాయి. బంద్ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రజాసంకల్పయాత్రకు విరామం ప్రకటించారు.
వైఎస్ జగన్ పిలుపు మేరకు బంద్‌ను విజయవంతం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు సన్నద్ధమయ్యాయి. ఉదయం 5 గంటల నుంచే ఆర్టీసీ డిపోల ముందు భైఠాయించి బస్సులను బయటికి రాకుండా అడ్డుకున్నారు. ఇక బంద్‌కు తమ పార్టీ దూరంగా ఉంటుందని స్వయంగా సీఎం చంద్రబాబు ప్రకటించిన సంగతి తెల్సిందే. మరోవైపు బంద్ విచ్ఛిన్నానికి కూడా ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోంది. నిరసనల్లో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవంటూ నోటీసుల ద్వారా విపక్షాల నేతలు, కార్యకర్తలను బెదిరించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బంద్ నేపథ్యంలో రాష్ట్రంలో సోమవారం జరిగే అన్ని పరీక్షలను వాయిదా వేశారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment