సీపీఎం మహాసభల్లో అభిప్రాయ బేధాలు | Internal Voting Amid CPM Split on Tie Up with Congress | Sakshi
Sakshi News home page

సీపీఎం మహాసభల్లో అభిప్రాయ బేధాలు

Published Thu, Apr 19 2018 2:02 PM | Last Updated on Wed, Mar 20 2024 3:30 PM

కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ మార్క్సిస్ట్‌(సీపీఎం) జాతీయ మహాసభల(22వ) రెండో రోజు రసాభాసగా మారింది. కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు అంశం ముఖ్యనేతల మధ్య మనస్పర్ధలు తారాస్థాయికి చేర్చింది. ఒకానోక దశలో సభల్లో రెండు రకాల రాజకీయ తీర్మానాలు ప్రవేశపెట్టడంతో.. వర్గ పోరు తారాస్థాయికి చేరినట్లు సమాచారం. (చారిత్రక తప్పిదమా?)

ఒంటరిగా పోరాటం చేస్తూనే ప్రగతిశీల శక్తులను ఐక్యం చేసి బీజేపీని దెబ్బ కొట్టాలని సీనియర్‌ నేత ప్రకాశ్‌ కారత్‌ తన వాదన తెరపైకి తెస్తే.. బలోపేతమైన బీజేపీని దెబ్బ కొట్టాలంటే కాంగ్రెస్‌ పార్టీతో కలిసి ముందుకెళ్లాల్సిందేనని ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వాదిస్తున్నారు. గతంలో కేంద్ర కమిటీలో ఏచూరి తీర్మానం వీగిపోగా.. అన్యమనస్కంగానే ఆయన ఇప్పుడు మహాసభల్లో పాల్గొంటున్నారు. ఈ తరుణంలో నేడు జరగబోయే కీలక భేటీలో తన నిర్ణయాన్ని కుండబద్ధలు కొట్టాలని ఆయన భావిస్తున్నారు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement