మేడే వేడుకల్లో పాల్గొన్న ఐఎన్‌టీయూసీ నాయకులు
మోత్కూరు : ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో బుధవారం స్థానికంగా మేడే వేడుకలను నిర్వహించా రు. ఈ సందర్భంగా డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు మెంట సురేష్ ఐఎన్‌టీయూసీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మం డల అధ్యక్షుడు వంగాల సత్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు గుండ గోని రామచంద్రు, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు నాయిని ప్రవీణ్, మహిళా విభాగం మండల అధ్యక్షురాలు అన్నెపు పద్మ, ఐఎన్‌టీయూసీ మండల అధ్యక్షుడు అవిశెట్టి సుధాకర్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మందుల సురేష్, సోషల్ మీడియా మండల కన్వీనర్ గుండు శ్రీను, ఎంపీటీసీలు జయశ్రీ, కురిమిళ్ల ప్రమీళ, నాయకులు పురుగుల నర్సింహ, ఎల్.రఘువర్దన్, గంజి మంగమ్మ, శేఖరాచారి తదితరులు పాల్గొన్నారు.
వామపక్షాల ఆధ్వర్యంలో...
మండలంలోని పాలడుగు, బుజిలాపురం, పొడిచేడు, దత్తప్పగూడెం, పాటిమట్ల, కొండగడప గ్రామాల్లో సీపీ ఐ ఆధ్వర్యంలో, పాలడుగులో సీపీఎం ఆధ్వర్యంలో బు ధవారం మేడే ఉత్సవాలు నిర్వహించారు. పాలడుగు లో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి యానాల దామోదర్‌రెడ్డి, సీపీఎం గ్రామశాఖ కార్యదర్శి దడిపెల్లి సుదర్శన్, దత్తప్పగూడెంలో సీపీఐ మండల కార్యదర్శి అన్నెపు వెంకట్, పొడిచేడులో జిట్ట రాములు ఎర్రజెండాలను ఎగరవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల హక్కుల సాధన కోసం సంఘటితంగా ఉద్యమించాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో సీపీఎం మండల మాజీ కార్యదర్శి గుండు వెంకటనర్సు, నాయకులు బరిగల నారాయణ, పుట్టల చంద్రయ్య, దడిపెల్లి శ్రీనివాస్, సోమరాజు, సైదులు, ప్రభాకర్, సీపీఐ నాయకులు కొంపెల్లి రవి, వల్లపు అంతయ్య, చేతరాశి సత్తయ్య, గుగ్గిల ఎల్లయ్య, జిట్ట కృష్ణ, దొండ ఎల్లయ్య, బోడ చంద్రయ్య, పులకరం మల్లేశం, లక్ష్మీనర్సయ్య, బోడ శ్రీను, కడమంచి వీర స్వామి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment