INTUC leaders
-
‘విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఎలాగైనా అడ్డుకోండి’
సాక్షి, అమరావతి : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఎలాగైనా అడ్డుకోవాలని ఐఎన్టీయూసీ నేతలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని విజ్ఙప్తి చేశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆల్ ఇండియా ఐఎన్టీయూసీ ప్రెసిడెంట్ సంజీవరెడ్డి, పలువురు ఐఎన్టీయూసీ నేతలు బుధవారం కలిశారు. ఈ సందర్భంగా.. విశాఖ ప్రైవేటీకరణ జరిగితే కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా పోతుందని అన్నారు. కాబట్టి ప్రైవేటీకరణ జరగకుండా చూడాలని ముఖ్యమంత్రిని కోరారు. చదవండి: కరోనా వ్యాక్సినేషన్‌పై సీఎం జగన్ సమీక్ష -
ఎమ్మెల్యే బాజిరెడ్డి వియ్యంకుడు మృతి
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వియ్యంకుడు ఐఎన్టీయూసీ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ నేత వెంకటేశ్వర్లు(వెంకులు) కరోనాలో మృతి చెందారు. కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్న కార్మికుల విభాగానికి వెంకటేశ్వర్లు అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. సీనియర్ కార్మిక నాయకుడు అయిన వెంకటేశ్వర్లుకు రాజకీయంగా జాతీయ స్థాయిలో మంచి సంబంధాలను కలిగి ఉన్నారు. ఆయన మృతితో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు, కర్షక ప్రతినిధులు సంతాపం తెలిపారు. ఇటీవల వెంకటేశ్వర్లుకు కరోనా వైరస్ సోకగా, హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఈయన చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి తుదిశ్వాస వడిచారు. ఇప్పటికే ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ కూడా కరోనా బారినపడి కోలుకున్న విషయం తెలిసిందే. సీనియర్ రాజకీయ నాయకుడు వెంకటేశ్వర్లు మృతి పట్ల రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ సంతాపం వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభుతి తెలియజేశారు. గత ముప్పై ఏళ్లుగా కార్మిక, విద్యార్థి నాయకుడుగా, రాజకీయవేత్తగా, వెంకులు చేసిన ఎనలేని సేవలకు సంబంధించి విషయాలను గుర్తుచేసుకున్నారు. ఎంతో ఆత్మీయంగా ఉండే వెంకులు మృతి తనకు తీరని లోటని డి శ్రీనివాస్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో ‘కరోనా’ భయం జిల్లాలో కరోనా రోజురోజుకు విజృంభిస్తుండడంతో ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు భయం పట్టుకుంది. పోలీసులకు, ప్రభుత్వ ఉద్యోగులకు సైతం ‘కోవిడ్’ సోకుతుండడంతో కార్యాలయాలకు వచ్చి విధులు నిర్వహించాలంటేనే ఉద్యోగులు జంకుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా తమకూ వ్యాపిస్తుందేమోనని వారికి గుబులు పట్టుకుంది. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎక్కువ ప్రభుత్వ శాఖలు ఉండడంతో ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. కలెక్టరేట్‌కు జనం తాకిడి ఉండడంతో ప్రతిరోజూ భయం భయంగానే విధులు నిర్వహిస్తున్నారు. దీంతో ప్రగతిభవన్ మెట్లు ఎక్కాలంటే జంకుతున్నారు. ఆఫీసుల్లో ఏ వస్తువును, టేబుల్, ఫైల్ ముట్టుకోవాలన్నా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దూరం దూరంగా ఉండి ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. కలెక్టరేట్లోని ప్రగతిభవన్ ఉదయం, సాయంత్రం వేళ్లలో చేతులను శానిటైజ్ చేసుకుంటున్నారు. అయితే అధికారులకు వినతులు సమరి్పంచడానికి ప్రజలు కార్యాలయాల్లోకి రాకుండా కలెక్టరేట్లో ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇటు అన్ని శాఖల ఉద్యోగులు కూడా అప్రమత్తమయ్యారు. బయటి వ్యక్తులకు రాకుండా కార్యాలయాల ప్రధాన ద్వారాలను మూసి ఉంచుతున్నారు. ప్రగతిభవన్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలతో పాటు ఎస్సీ కార్పొరేషన్, సివిల్ సప్లయి, సివిల్ సప్లయి కార్పొరేషన్, డీఆర్డీఏ, డ్వామా కార్యాలయాలున్నాయి. పక్కనే అక్షర ప్రణాళిక భవన్లో ఐకేపీ, ఐసీడీఎస్, వైద్య ఆరోగ్య, సీపీవో, సాక్షర భారత్ కార్యాలయాలున్నాయి. ఇక కలెక్టరేట్లో ప్రధానంగా కలెక్టర్ పరిపాలనా విభాగం (డీఆర్వో కార్యాలయం) ఉంది. దాదాపు కలెక్టరేట్లో పదికి పైగా ప్రభుత్వ కార్యాలయాలున్నాయి. కలెక్టరేట్‌కు ఆనుకునే వెల్నెస్ సెంటర్, వ్యవసాయ శాఖ, టీఎన్జీవోస్ భవన్, ఎస్బీఐ బ్యాంకు, ఇతర వాణిజ్య సముదాయాలున్నాయి. అయితే ప్రధానంగా కలెక్టరేట్లోని ఆయా శాఖల్లో ఉద్యోగులు కలిపి 400 మందికి పైగా ఉంటారు. ప్రతినిత్యం ఆఫీసులకు వచ్చి వెళ్తున్నారు. కార్యాలయాలన్నీ ఒకే దగ్గర ఉండడంతో కోవిడ్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఉద్యోగులు ఒక్కింత ఆందోళనలో ఉన్నారు. కొందరయితే సెలవులు పెట్టి ఆఫీసులకు రావడం లేదంటే పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు. ప్రగతిభవన్‌లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్న సిబ్బంది పనిరోజులు తగ్గించాలని వేడుకోలు కరోనా భయంతో ఉద్యోగులు, అధికారులు ఆఫీసులకు రావడానికి భయపడుతున్నారు. వారి కుటుంబ సభ్యులు కూడా విధులకు వెళ్లవద్దని కోరుతున్నారు. ఇంటి నుంచే పని చేసుకోండని ప్రాధేయపడుతున్నారు. అయితే ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే వారికి వారంలో మూడు రోజులు మాత్రమే పని కలి్పంచాలని ఇటీవల ఉద్యోగ జేఏసీ ఆద్వర్యంలో కలెక్టర్ నారాయణరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఉద్యోగులందరికీ కరోనా టెస్టులు కూడా చేయించాలని కోరారు. డీఆర్వో ఆఫీసులో పనిచేసే ఉద్యోగులైతే భయపడి తమకు టెస్టు చేయించాలని కలెక్టరేట్ ఏవోను ఇటీవల కలిసినట్లు తెలిసింది. రెవెన్యూ వర్గాల్లోనైతే ‘కరోనా’ మరింత కలవరపెడుతోంది. కలెక్టరేట్లో హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళనను కాస్త తగ్గించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బుధవారం కలెక్టరేట్లోని అన్ని శాఖలతో పాటు ప్రగతిభవన్, ఎన్ఐసీ కార్యాలయాల్లో వైద్య శాఖ సిబ్బందితో హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. ఇనుప గేట్లు, మెట్లు, జన సంచారం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో శానిటైజ్ చేశారు. దీంతో ఉద్యోగులు కొంత సంతృప్తి చెందారు. పనిదినాలు తగ్గిస్తేనే మేలు కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పనిదినాలు తగ్గించాలి. షిప్టుల వారీగా వారానికి కొంతమంది పనిచేసేలా, పనిచేస్తున్న రక్షణ చర్యలు తీసుకోవాలి. కార్యాలయాలకు బయటి వ్యక్తులు రాకుండా చూసి కార్యాలయాలు సానిటైజ్ చేయించాలి. ఉద్యోగులకు వారి కుటుంబాల ప్రాణాలు కూడా ముఖ్యం. – అలుక కిషన్, జిల్లా అధ్యక్షుడు, టీఎన్జీవోస్ ఉద్యోగులందరికీ టెస్టులు నిర్వహించాలి రెవెన్యూ ఉద్యోగులతోపాటు ఇతర శాఖల ఉద్యోగులు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కూడా పని చేస్తున్నారు. ప్రజలకు ఉద్యోగులకు మధ్య కొన్ని రోజుల పాటు సంబంధాలు లేకుండా చూడాలి. నెలలో పదిహేను రోజులు పనిదినాలు కలి్పంచి రక్షణ చర్యలు తీసుకోవాలి. పని చేస్తున్న ఉద్యోగులందరికీ కరోనా పరీక్షలు జరపాలి. – రమణ్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు, రెవెన్యూ అసోసియేషన్ -
ఘనంగా మేడే వేడుకలు
మోత్కూరు : ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో బుధవారం స్థానికంగా మేడే వేడుకలను నిర్వహించా రు. ఈ సందర్భంగా డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు మెంట సురేష్ ఐఎన్టీయూసీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మం డల అధ్యక్షుడు వంగాల సత్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు గుండ గోని రామచంద్రు, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు నాయిని ప్రవీణ్, మహిళా విభాగం మండల అధ్యక్షురాలు అన్నెపు పద్మ, ఐఎన్టీయూసీ మండల అధ్యక్షుడు అవిశెట్టి సుధాకర్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మందుల సురేష్, సోషల్ మీడియా మండల కన్వీనర్ గుండు శ్రీను, ఎంపీటీసీలు జయశ్రీ, కురిమిళ్ల ప్రమీళ, నాయకులు పురుగుల నర్సింహ, ఎల్.రఘువర్దన్, గంజి మంగమ్మ, శేఖరాచారి తదితరులు పాల్గొన్నారు. వామపక్షాల ఆధ్వర్యంలో... మండలంలోని పాలడుగు, బుజిలాపురం, పొడిచేడు, దత్తప్పగూడెం, పాటిమట్ల, కొండగడప గ్రామాల్లో సీపీ ఐ ఆధ్వర్యంలో, పాలడుగులో సీపీఎం ఆధ్వర్యంలో బు ధవారం మేడే ఉత్సవాలు నిర్వహించారు. పాలడుగు లో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి యానాల దామోదర్‌రెడ్డి, సీపీఎం గ్రామశాఖ కార్యదర్శి దడిపెల్లి సుదర్శన్, దత్తప్పగూడెంలో సీపీఐ మండల కార్యదర్శి అన్నెపు వెంకట్, పొడిచేడులో జిట్ట రాములు ఎర్రజెండాలను ఎగరవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల హక్కుల సాధన కోసం సంఘటితంగా ఉద్యమించాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో సీపీఎం మండల మాజీ కార్యదర్శి గుండు వెంకటనర్సు, నాయకులు బరిగల నారాయణ, పుట్టల చంద్రయ్య, దడిపెల్లి శ్రీనివాస్, సోమరాజు, సైదులు, ప్రభాకర్, సీపీఐ నాయకులు కొంపెల్లి రవి, వల్లపు అంతయ్య, చేతరాశి సత్తయ్య, గుగ్గిల ఎల్లయ్య, జిట్ట కృష్ణ, దొండ ఎల్లయ్య, బోడ చంద్రయ్య, పులకరం మల్లేశం, లక్ష్మీనర్సయ్య, బోడ శ్రీను, కడమంచి వీర స్వామి తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ పార్టీలో చేరిక
నేరేడుచర్ల : పాలకవీడు మండలం జాన్‌పహాడ్‌కు చెందిన ఐఎన్టీయూసీ మండల నాయకుడ, 9వ వార్డు సభ్యుడు కాటూరి శేషగిరి ఆదివారం టీఆర్ఎస్ హుజూర్నగర్ నియోజకవర్గ ఇన్చార్జి కాసోజు శంకరమ్మ ఆధ్వర్యంలో రాష్త్ర విద్యుత్ శాఖామాత్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో నాయకులు లచ్చిరాం నాయక్, జాన్‌పహాడ్ టీఆర్ఎస్ గ్రామ శాఖ నాయకులు శ్రీను, జింకల భాస్కర్, గుమ్మడెల్లి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
సింగరేణిలో ప్రశాంతంగా సమ్మె
* కొత్తగూడెం రీజియన్‌లో 63 శాతం మంది హాజరు.. * కార్పొరేట్లో 220 మంది గైర్హాజరు * కొనసాగిన ఆందోళనలు, అరెస్టులు కొత్తగూడెం : సింగరేణి వ్యాప్తంగా జరుగుతున్న ఐదురోజుల సార్వత్రిక సమ్మెలో భాగంగా జిల్లాలో విస్తరించి ఉన్న నాలుగు ఏరియాల్లో రెండోరోజైన బుధవారం పాక్షికంగానే కొనసాగింది. రీజియన్ వ్యాప్తంగా నాలుగు ఏరియాల్లో కలిపి రెండు షిఫ్ట్‌లలో 63 శాతం కార్మికులు విధుల్లో పాల్గొన్నారు. ముందస్తు అరెస్టులు, నిరసనగా ఆందోళనలు కొనసాగాయి. కొత్తగూడెం ఏరియాలో విధులకు వెళ్లే కార్మికులను అడ్డుకునేందుకు యత్నించిన 15 మంది ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ నాయకులను టూటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అరెస్టులకు నిరసనగా నాయకులు స్థానిక సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. గుర్తింపు సంఘం టీబీజీకేఎస్‌తో పాటు సమ్మెకు పిలుపునిచ్చిన హెచ్ఎంఎస్ కూడా విధులకు హాజరవుతూ యాజమాన్యానికి తొత్తుగా వ్యవహరిస్తోందని ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ నాయకులు ఆరోపించారు. ఇల్లెందులో జీఎం కార్యాలయం ఎదుట జేఏసీ నాయకులు ధర్నా చేశారు. మణుగూరు ఏరియాలో జీఎం కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహిస్తున్న 70 మంది జేఏసీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. 63 శాతం హాజరైన కార్మికులు.. జిల్లాలోని కొత్తగూడెం రీజియన్ పరిధిలో నాలుగు ఏరియాల్లో రెండోరోజు మొదటి రెండు షిఫ్టులలో 63 శాతం కార్మికులు విధులకు హాజరయ్యారు. కొత్తగూడెం కార్పొరేట్ పరిధిలో 1710 మంది కార్మికోద్యోగులకుగాను 1311 మంది హాజరుకాగా 179 మంది సెలవులో ఉన్నారు. మిగతా 220 మంది గైర్హాజరయ్యారు. తొలిరోజు కార్పొరేట్ పరిధిలో గైర్హాజరు లేనప్పటికీ రెండోరోజు కొంతమంది ఉద్యోగులు విధులకు హాజరుకాకపోవడం గమనార్హం. కొత్తగూడెం ఏరియా పరిధిలో 3241 మంది కార్మికులకుగాను 1709 మంది హాజరయ్యారు. 185 మంది సెలవులో ఉండగా 1347 మంది విధులకు హాజరుకాలేదు. ఇల్లందు ఏరియాలో 1379 మంది కార్మికులకు గాను 585 మంది విధుల్లో పాల్గొన్నారు. మరో 50 మంది సెలవులో ఉండగా 744 మంది గైర్హాజరయ్యారు. మణుగూరు ఏరియాలో 2405 మంది కార్మికులకుగాను 1297 మంది విధుల్లో పాల్గొనగా 160 మంది సెలవులో ఉన్నారు. 948 మంది గైర్హాజరయ్యారు. మొదటిరోజు 95.3 శాతం ఉత్పత్తి.. సమ్మె ప్రారంభమైన మంగళవారం కొత్తగూడెం, ఇల్లందు, మణుగూరు ఏరియాలలో 95.3 శాతం ఉత్పత్తి నమోదైంది. మూడు ఏరియాల్లో 72,600 టన్నుల లక్ష్యానికి గాను 69,220 టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగింది. కొత్తగూడెం ఏరియా అత్యధికంగా 24,518 టన్నులకు 25,448 టన్నులు, ఇల్లందు ఏరియాలో 19,340 టన్నులకు 17,677 టన్నులు, మణుగూరు ఏరియాలో 28742 టన్నులకు 26,095 టన్నుల ఉత్పత్తి నమోదైంది. కాగా మొదటి షిఫ్టునకు హాజరైన కార్మికులను రెండో షిఫ్టులో సైతం కొనసాగిస్తూ యాజమాన్యం బొగ్గు ఉత్పత్తి చేయించిందని కార్మిక సంఘాలు అంటున్నాయి.