సాక్షి, అమరావతి : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఎలాగైనా అడ్డుకోవాలని ఐఎన్‌టీయూసీ నేతలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విజ్ఙప్తి చేశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆల్ ఇండియా ఐఎన్‌టీయూసీ ప్రెసిడెంట్ సంజీవరెడ్డి, పలువురు ఐఎన్‌టీయూసీ నేతలు బుధవారం కలిశారు. ఈ సందర్భంగా.. విశాఖ ప్రైవేటీకరణ జరిగితే కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా పోతుందని అన్నారు. కాబట్టి ప్రైవేటీకరణ జరగకుండా చూడాలని ముఖ్యమంత్రిని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment