
సాక్షి, చిత్తూరు : దళితుల పేరుతో ఓట్లు పొందిన వారు..ఇంతవరకు వారిని ఎందుకు చూడటం లేదని సీపీఐ(ఎం) కేంద్ర నాయకురాలు బృందా కారత్ మోదీ సర్కారును ప్రశ్నించారు. మంగళవారం పలమనేరులో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా స్క్రూటినీ లేకుండానే మోదీ ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ బిల్లును పాస్ చేసిందని విమర్శించారు. పరువు హత్యలపై తాను గతంలో ప్రైవేటు బిల్లు పెట్టినా.. ఇప్పటికీ చట్టం జరుగలేదని తెలిపారు. ఇందుకు గల కారణాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన ఆవశ్యకత ఉందని.. పరువు హత్యలపై కచ్చితంగా చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.