
మంగళవారం తిరుపతిలో బిజిలీ బంద్‌లో పాల్గొన్న వివిధ పార్టీల నేతలు
సాక్షి, నెట్‌వర్క్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ మంగళవారం రాత్రి ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన బిజిలీ బంద్ విజయవంతమైంది. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోపాటు సీపీఎం, సీపీఐ, జనసేన, ప్రజా సంఘాలు బిజిలీ బంద్ నిర్వహించాయి. ఇందులో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని ప్రత్యేక హోదా కోసం నినదించారు.
జగన్ సంఘీభావం
గన్నవరం నియోజకవర్గంలోని దావాజీగూడెం సమీపంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పాదయాత్ర శిబిరం వద్ద మంగళవారం రాత్రి 7.30 గంటల వరకు విద్యుత్ దీపాలను ఆర్పివేసి బిజిలీ బంద్‌కు సంఘీభావం తెలిపారు.