
సాక్షి, అమరావతి : ఏపీ బంద్ నేపథ్యం వైఎస్సార్‌సీపీ నేతల అరెస్టులను జనసేన పార్టీ ఖండించింది. వైఎస్సార్‌సీపీ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ బంద్‌ను ప్రభుత్వం అణచివేయాలని చూస్తోందని, ప్రజాస్వామ్యంలో నిరసన అనేది రాజకీయ పార్టీల హక్కు అని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. చంద్రబాబు బంద్ చేస్తే తప్పులేదుకాని ప్రతిపక్ష పార్టీలు బంద్ చేస్తే తప్పా..? అని మండిపడ్డారు. ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబే కారణమని ధ్వజమెత్తారు. చంద్రబాబు పోరాటం చేస్తే హోదా ఎప్పుడో వచ్చేదని నిప్పులు చెరిగారు. ప్యాకేజీ వల్ల రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగం లేదని, తన స్వలాభం కోసమే చంద్రబాబు యూ టర్న్ తీసుకున్నారన్నారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీ కావాలనే చంద్రబాబు అంగీకరించిన విషయాన్ని చంద్రశేఖర్ గుర్తు చేశారు. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమే పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెట్టారని తెలిపారు. హోదా ఉద్యమానికి చంద్రబాబు సహకరించాలన్నారు. చంద్రబాబు తన స్వార్థం కోసమే గతంలో బంద్‌కు మద్దతు ఇచ్చారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment