సీపీఐ(ఎం) నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్(ఎల్‌డీఎఫ్) కేరళలో రెండవసారి అధికారాన్ని చేపట్టడానికి సిద్ధంగా ఉంది. ఈ ఎన్నికలలో గెలిచి 44 ఏళ్ల చరిత్రను పినరయి విజయన్ తిరగ రాయనున్నారు. కేరళ రాష్ట్రంలోని 140 అసెంబ్లీ స్థానాలకు సాయంత్రం 4 వరకు ఓట్ల లెక్కింపు తర్వాత ఎల్‌డిఎఫ్ 95 స్థానాల్లో, కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్(యుడిఎఫ్) 44 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు ఒక స్థానంలో ఉన్నారు.
గత నాలుగు దశాబ్దాల చరిత్రలో కేరళలో అధికార పార్టీ రెండవసారి విజయం సాధించిన సందర్భాలు లేవు. కానీ, ఈసారి సీఎం విజయన్ నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ కూటమి ఆ చరిత్రను తిరగ రాయనుంది. గెలుపు అంచులకు చాలా దగ్గరలో ఉంది. 2016లో 91 స్థానాలను దక్కించుకున్న ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం ఈ సారి 95 నుంచి 100 వరకు స్థానాలను గెలిచే అవకాశం ఉంది. బహుళ ఎగ్జిట్ పోల్స్, ప్రీ-పోల్స్ అన్నీ అంచనా వేసినట్లుగా స్పష్టమైన మెజారిటీతో ప్రతిపక్ష యూడీఎఫ్ కూటమిపై విజయాన్ని సొంతం చేసుకోనుంది. మెట్రోమాన్ ఈ శ్రీధరణ్‌కు షాక్ తగిలింది. పాలక్కడ్ నుంచి పోటి చేస్తోన్న శ్రీ ధరణ్ సిట్టింగ్ ఎమ్మెల్యే షఫి పరంబిల్ (కాంగ్రెస్) చేతిలో ఓడిపోయారు. 1000పైగా మెజార్టీతో పాలక్కడ్‌ను తిరిగి కాంగ్రెస్ అభ్యర్థి గెలుచుకుంది.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment