'జీహెచ్ఎంసీ కమిషనర్.. టీఆర్ఎస్ ఏజెంట్' | someshkumar is working as a TRS a agent, says uttam | Sakshi
Sakshi News home page

'జీహెచ్ఎంసీ కమిషనర్.. టీఆర్ఎస్ ఏజెంట్'

Published Wed, Jun 17 2015 9:11 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

'జీహెచ్ఎంసీ కమిషనర్.. టీఆర్ఎస్ ఏజెంట్' - Sakshi

'జీహెచ్ఎంసీ కమిషనర్.. టీఆర్ఎస్ ఏజెంట్'

హైదరాబాద్: హైదరాబాద్లో నివాసం ఉంటున్న సెటిలర్లకు కాంగ్రెస్ ఉంటుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్రెడ్డి చెప్పారు. ఇటీవల జరిగిన తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో ప్రస్తుత రాజకీయాలు ప్రజలను రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఎవరు ఎవరిని రెచ్చగొట్టినా సహించేది లేదని ఆయన పేర్కొన్నారు.

జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్కుమార్ టీఆర్ఎస్ పార్టీకి ఏజెంట్గా పనిచేస్తున్నారని ఉత్తమ్ కుమార్ ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం ఈ నెల 21 నుంచి 27 వరకు నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ పార్టీ సమావేశాలు నిర్వహిస్తుందని తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో సీనియర్ లీడర్లతో 6 కమిటీలు  ఏర్పాటు చేశామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్రెడ్డి వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement