someshkumar
-
సోమేశ్‌కుమార్‌కు నోటీసులు?
సాక్షి, హైదరాబాద్: జీఎస్టీ కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్‌తోపాటు ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొందరికి నోటీసు లు ఇచ్చేందుకు సీఐడీ అధికారులు సిద్ధమవుతున్నా రు. వారికి త్వరలోనే నోటీసులు పంపనున్నట్టు తెలిసింది. తొలుత ఈ కేసు దర్యాప్తు హైదరాబాద్ సీసీ ఎస్ పోలీసులు చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి అప్పగించిన విషయం తెలిసిందే. సీసీఎస్ నుంచి వచి్చన ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు దర్యాప్తు చేశారు.మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్ సహా నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సర్విస్ ట్యాక్స్ అదనపు కమిషనర్ ఎస్వీ కాశీవిశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ శివరామప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్‌బాబు, మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్, ప్లియాంటో టెక్నాలజీస్ కంపెనీ నిర్వాహకులకు నోటీసులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కుంభకోణంలో సోమేశ్‌కుమార్ కీలకంగా వ్యవహరించినట్లుగా అధికారులు భావిస్తున్నారు.‘స్పెషల్ ఇన్సియేటివ్స్’వాట్సాప్ గ్రూప్ ద్వారా సోమేశ్‌కుమార్ సర్విస్ ట్యాక్స్ అధికారులు విశ్వేశ్వరరావు, శివరామప్రసాద్, శోభన్‌బాబులకు ఆదేశాలు ఇచ్చినట్లు ఆధారాలు సేకరించారు. అయి తే, కమర్షియల్ ట్యాక్స్ సెంట్రల్ కంప్యూటర్ వింగ్ జాయింట్ డైరెక్టర్ రవి కనూరి అందించిన ఆడిట్ రిపోర్ట్స్ ఆధారంగా దర్యాప్తు చేçపట్టారు. ఇన్‌పు ట్ ట్యాక్స్ క్రెడిట్ చెల్లింపుల్లో రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ సహా 75 కంపెనీలకు లబ్ధి చేసినట్టు ఆధారాలు లభించాయి. ఈ కుంభకోణంతో ప్రభుత్వ ఖజానా కు రూ.1,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. సీఐడీ దర్యాప్తు ముమ్మరం అయితే కీలకాంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. -
పకడ్బందీగా పరీక్షలు: సీఎస్
సాక్షి, హైదరాబాద్: పరీక్షల నిర్వహణలో గతేడాది జరిగిన తప్పులు పునరావృతం కావద్దని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ స్పష్టంచేశారు. మార్చి, ఏప్రిల్‌ల్లో జరగనున్న ఇంటర్, టెన్త్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. సోమవారం ఆయన బీఆర్కేఆర్ భవన్లో పదో తరగతి పరీక్షల నిర్వహణపై విద్యాశాఖాధికారులతో సమీక్ష నిర్వహించారు. జవాబు పత్రాల మూల్యాంకనంలో పాల్గొనే ప్రతి ఉపాధ్యాయుడికి అవసరమైన శిక్షణను ఇవ్వాలని సూచించారు. విద్యార్థుల కోసం ఆన్లైన్ గ్రీవెన్స్ రిడ్రెసెల్ సిస్టమ్ ప్రారంభిస్తామని తెలిపారు. ఇంటర్ పరీక్షలు మార్చి 4 నుంచి 23 వరకు, టెన్త్ పరీక్షలు మార్చి 19 నుంచి ఏప్రిల్ 6 వరకు జరుగుతాయన్నారు. ఇంటర్ పరీక్షలకు 9.65 లక్షల మంది విద్యార్థులు, పదో తరగతి పరీక్షలకు 5.08 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారని, సెంటర్ల ఏర్పాటు, జంబ్లింగ్ పద్ధతి, హాల్ టికెట్ల జారీ, ఫలితాల వెల్లడి ప్రక్రియలను అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించారు. -
కాళేశ్వరం కదా.. కలెక్టర్లు ఫిదా!
సాక్షి, భూపాలపల్లి: కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం అద్భుతమని, అతి తక్కువ సమయంలో నిర్మించిన ప్రాజెక్టు తీరు అందరికీ స్ఫూర్తిదాయకమని కలెక్టర్లు అభిప్రాయపడ్డారు. కాళేశ్వరం నిర్మాణ స్ఫూర్తితో జిల్లాల్లో సంక్షేమాభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని వారు తెలిపారు. ఇన్నాళ్లు కాళేశ్వరం ఇంజనీరింగ్ అద్భుతమని వార్తాపత్రికల్లో చదవడమే తప్పితే నేరుగా చూసింది లేదని, ఇన్నాళ్లకు తమ కోరిక తీరిందని అన్ని జిల్లాల కలెక్టర్లు సంతోషం వ్యక్తం చేశారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా బుధవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని లక్ష్మీ (మేడిగడ్డ)బ్యారేజ్, లక్ష్మీ (కన్నెపల్లి) పంప్‌హౌస్‌లను సందర్శించారు. ఇటీవల కలెక్టర్ల సమావేశంలో సీఎం కేసీఆర్ కలెక్టర్లందరూ కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను సందర్శించి రావాలని సూచించారు. పర్యటనలో భాగంగా మంగళవారం హన్మకొండలో విడిది చేసిన కలెక్టర్లు బుధవారం ప్రత్యేక బస్సులో జిల్లాకు చేరుకున్నారు. కాళేశ్వరం రాచబాట కాళేశ్వరం ప్రాజెక్ట్ సీఎం కేసీఆర్ కల అని, బంగారు తెలంగాణ ఏర్పాటుకు కాళేశ్వరం రాచబాట అని ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సోమేశ్‌కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి నేరుగా హైదరాబాద్ నుంచే కాళేశ్వరం ప్రాజెక్ట్ పనితీరును సమీక్షిస్తున్నారని తెలిపారు. మేడిగడ్డలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశంలో ప్రాజెక్టు వివరాలను ఇంజనీరింగ్ అధికారులు కలెక్టర్లందరికీ వివరించారు. కేవలం 29 నెలల్లోనే ప్రాజెక్టు నిర్మించిన తీరును చూసి కలెక్టర్లందరూ ప్రేరణ పొందుతున్నారని సోమేశ్‌కుమార్ అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను కాళేశ్వరం ప్రాజెక్టు స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాలని ఆయన కలెక్టర్లకు సూచించారు. ప్రాజెక్టు ప్రారంభిస్తున్నప్పుడు ఇది అవుతుందా అని అనేకమంది సందేహాలు లేవనెత్తారని అలాంటిది సీఎం కేసీఆర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని సోమేశ్ కుమార్ వివరించారు. బ్యారేజ్, పంప్‌హౌస్‌ల సందర్శన ప్రాజెక్ట్‌పై ఇంజనీరింగ్ అధికారులు నిర్వహించిన సమావేశం అనంతరం కలెక్టరందరూ మేడిగడ్డ బ్యారేజ్, కన్నెపల్లి పంప్‌హౌస్‌ను సందర్శించారు. మందుగా మేడిగడ్డ బ్యారేజ్‌ను సందర్శించిన కలెక్టర్లకు ఇంజనీర్లు నిర్మాణం, నీటి ప్రవాహం, గేట్ల పనితీరును వివరించారు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన అక్కడే ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని తిలకించారు. అనంతరం కాళేశ్వరంలోని కన్నెపల్లి పంప్‌హౌస్‌ను సందర్శించిన కలెక్టర్లు మోటార్ల పనితీరును, నీటి లభ్యత వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. పంప్‌హౌస్ నుంచి నీటిని గ్రావిటీ కెనాల్లోకి వదిలే డెలివరీ సిస్టర్న్‌ను పరిశీలించారు. కాళేశ్వర ముక్తీశ్వర ఆలయంలో పూజలు.. మేడిగడ్డ నుంచి కాళేశ్వరం చేరుకున్న పాలనాధికారులు కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. -
'జీహెచ్ఎంసీ కమిషనర్.. టీఆర్ఎస్ ఏజెంట్'
హైదరాబాద్: హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న సెటిలర్లకు కాంగ్రెస్ ఉంటుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి చెప్పారు. ఇటీవల జరిగిన తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో ప్రస్తుత రాజకీయాలు ప్రజలను రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఎవరు ఎవరిని రెచ్చగొట్టినా సహించేది లేదని ఆయన పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్ టీఆర్ఎస్ పార్టీకి ఏజెంట్‌గా పనిచేస్తున్నారని ఉత్తమ్ కుమార్ ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం ఈ నెల 21 నుంచి 27 వరకు నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ పార్టీ సమావేశాలు నిర్వహిస్తుందని తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో సీనియర్ లీడర్లతో 6 కమిటీలు ఏర్పాటు చేశామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి వివరించారు. -
నగరంలో 81 బృందాలు ఏర్పాటు: సోమేశ్
హైదరాబాద్: వర్షాలతో నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చూసేందుకు జీహెచ్ఎంసీ ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. నాలాలు, డ్రైనేజీల పూడికతీతతో పాటు వర్షం నీరు నిలువ ఉండకుండా చర్యలు తీసుకోనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్లో ఇందుకోసం 81 బృందాలను ఏర్పాటు చేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ తెలిపారు. ఇవి తమ పరిధిలో నాలాల పూడికతీత పనులను చేపడతాయని, ఈ పనుల నివేదికలను రోజువారీగా తనకు పంపించాలని ఆయన ఆదేశించారు. అదే విధంగా నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి, సంబంధిత బృందాల ఇన్‌ఛార్జిల ఫోన్ నంబర్లను పేర్లతో పాటు బోర్డులు ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను సోమేశ్ కోరారు.