జీఎస్టీ కుంభకోణంలో సీఐడీ దర్యాప్తు ముమ్మరం
సాక్షి, హైదరాబాద్: జీఎస్టీ కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్‌తోపాటు ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొందరికి నోటీసు లు ఇచ్చేందుకు సీఐడీ అధికారులు సిద్ధమవుతున్నా రు. వారికి త్వరలోనే నోటీసులు పంపనున్నట్టు తెలిసింది. తొలుత ఈ కేసు దర్యాప్తు హైదరాబాద్ సీసీ ఎస్ పోలీసులు చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి అప్పగించిన విషయం తెలిసిందే. సీసీఎస్ నుంచి వచి్చన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు దర్యాప్తు చేశారు.
మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్ సహా నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సర్విస్ ట్యాక్స్ అదనపు కమిషనర్ ఎస్‌వీ కాశీవిశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ శివరామప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్‌బాబు, మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్, ప్లియాంటో టెక్నాలజీస్ కంపెనీ నిర్వాహకులకు నోటీసులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కుంభకోణంలో సోమేశ్‌కుమార్ కీలకంగా వ్యవహరించినట్లుగా అధికారులు భావిస్తున్నారు.
‘స్పెషల్ ఇన్సియేటివ్స్’వాట్సాప్ గ్రూప్ ద్వారా సోమేశ్‌కుమార్ సర్విస్ ట్యాక్స్ అధికారులు విశ్వేశ్వరరావు, శివరామప్రసాద్, శోభన్‌బాబులకు ఆదేశాలు ఇచ్చినట్లు ఆధారాలు సేకరించారు. అయి తే, కమర్షియల్ ట్యాక్స్ సెంట్రల్ కంప్యూటర్ వింగ్ జాయింట్ డైరెక్టర్ రవి కనూరి అందించిన ఆడిట్ రిపోర్ట్స్ ఆధారంగా దర్యాప్తు చేçపట్టారు. ఇన్‌పు ట్ ట్యాక్స్ క్రెడిట్ చెల్లింపుల్లో రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ సహా 75 కంపెనీలకు లబ్ధి చేసినట్టు ఆధారాలు లభించాయి. ఈ కుంభకోణంతో ప్రభుత్వ ఖజానా కు రూ.1,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. సీఐడీ దర్యాప్తు ముమ్మరం అయితే కీలకాంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment