బీజేపీ కార్పొరేటర్లపై ఎంఐఎం సభ్యుల దాడి.. జీహెచ్‌ఎంసీ నిరవధిక వాయిదా | GHMC Council Meeting Live Updates | Sakshi
Sakshi News home page

బీజేపీ కార్పొరేటర్లపై ఎంఐఎం సభ్యుల దాడి.. జీహెచ్‌ఎంసీ నిరవధిక వాయిదా

Published Sat, Jul 6 2024 10:52 AM | Last Updated on Sat, Jul 6 2024 1:06 PM

GHMC Council Meeting Live Updates

Updates..

👉గలాట మధ్య జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ నిరవధిక వాయిదా.

👉కౌన్సిల్‌లో కాంగ్రెస్‌, బీజేపీ కార్పొరేట‍ర్ల గొడవ.

👉బీజేపీ కార్పొరేటర్లపై ఎంఐఎం కార్పొరేటర్ల దాడి. 

👉అధికారులు భాధ్యత తీసుకోవడం లేదు: బీజేపీ కార్పొరేటర్లు 

  • అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారు.
  • డిపార్ట్‌మెంట్‌ హెచ్‌ఓడీ కౌన్సిల్‌కు రాకుండా కింది ర్యాంక్ అధికారులను పంపుతున్నారు.
  • ఎన్ని సార్లు అధికారుల దృష్టికి సమస్యలు తీసుకువచ్చినా పట్టించుకోవడం లేదు 
  • వాటర్ బోర్డు ఎండీ కౌన్సిల్ సమావేశానికి రాకపోవడంపై బీజేపీ ఆందోళన 
  • మేయర్ పోడియం వద్ద బీజేపీ నిరసన 
  • వచ్చే జనరల్ బాడి సమావేశానికి ఎండీ రావాలని మేయర్ ఆదేశం

 

👉ప్రాపర్టీ టాక్స్ టార్గెట్ పెంచాలని జీహెచ్‌ఎంసీ ఆలోచన

👉జీహెచ్‌ఎంసీలో కొనసాగుతున్న డ్రోన్ సర్వే

👉రెండు వారాల్లో ఇంటింటి సర్వే స్టార్ట్ అవుతుంది: స్నేహ షేబరిష్


👉రంగనాథ్ ఐపీఎస్ జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ హాల్

👉వాటర్ లాగింగ్‌పై ఈవీడీఎం కసరత్తు చేసింది. సమస్యలు లేకుండా చూస్తాం

👉హైడ్రా పరిధి జీహెచ్‌ఎంసీ నుంచి హెచ్‌ఎండీఏ వరకు పెంచనున్నారు

👉డిజాస్టర్ రెస్పాన్స్ పై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది

👉ప్రజలు, ప్రజాప్రతినిధులు రాబోయే రోజుల్లో ఈవీడీఎం, హైడ్రాకు సహకరించాలి
 

కౌన్సిల్‌ కాసేపు వాయిదా.. 
👉మరోసారి మేయర్ పోడియం వద్దకు వచ్చిన బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు

👉మేయర్ పోడియం వద్దకు బీజేపీ, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ కార్పొరేటర్లు

👉బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్ల నిరసనకు కౌంటర్ నిరసన చేస్తున్న కాంగ్రెస్ కార్పొరేటర్లు

👉మేయర్ పోడియం వద్ద బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్ల నిరసన వల్ల మరోసారి సభ వాయిదా

👉15 నిమిషాల పాటు వాయిదా వేసిన మేయర్.

👉మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కామెంట్స్‌..

  • ఇప్పుడు హైదరాబాద్‌లో చాలా సమస్యలు ఉన్నాయి.
  • వర్షాకాలం కావడంతో సమస్యల పరిష్కారం కోసం ఫైట్ చేయాలి.
  • ఇది రాజకీయాలు చేసే సమయం కాదు.
  • నాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే మేయర్ ఛాంబర్ ముందు ధర్నా చేయవచ్చు.
  • సభలో ప్రజల సమస్యల కోసం మాట్లాడాలి.
  • మేయర్, డిప్యూటీ మేయర్ రాజీనామా చేయాలి అనడం కరెక్ట్ కాదు.

👉ఎన్నికల కోడ్‌కు ముందే రోడ్ల మరమ్మత్తుల కోసం బడ్జెట్ కేటాయింపు జరిగింది- బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు

👉నిధులు కేటాయింపు జరిగినా ఎందుకు విడుదల చేయలేదు అంటే మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ కావాలని అధికారులు అంటున్నారు.

👉అధికారులు కార్పొరేటర్లను పట్టించుకోవడం లేదు.


👉కౌన్సిల్‌ సమావేశానికి పలువురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు డుమ్మా..

👉కౌన్సిల్ భేటీకి డుమ్మా కొట్టిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, ప్రకాష్ గౌడ్, మహిపాల్ రెడ్డి

👉కౌన్సిల్ భేటీకి కచ్చితంగా హాజరుకావాలని అధిష్ఠానం నుంచి ఎమ్మెల్యేలకు ఆదేశం

👉అధిష్ఠానం ఆదేశించినా హాజరు కానీ ఎమ్మెల్యేలు

👉కార్పొరేటర్ చనిపోతే ఆరు నెలల్లో ఎన్నికలు పెట్టాలి - బీజేపీ కార్పొరేటర్ నరసింహ రెడ్డి

👉మన్సూరాబాద్ కార్పొరేటర్ మరణించి ఏడాది గడుస్తున్నా ఎన్నికలు జరపలేదు. 

👉లాస్య నదింత మృతిపై కౌన్సిల్‌లో సంతాపం.

👉లాస్య నందిత మరణం బాధాకరం.. బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు

👉ఆమె అకాల మరాణానికి సంతాపం తెలియజేస్తున్నాం

👉లాస్య నందిత మరణం ఎంతో బాధకలిగించింది: బీజేపీ కార్పొరేటర్లు

👉సాయన్న కుతురుగా లాస్య నందిత మంచి పేరును ప్రజల్లో తెచ్చుకున్నారుజ

👉లాస్య నందిత మరణం బాధాకరం: ఎంఐఎం కార్పొరేటర్లు

👉ఆమె పనితిరుతో ప్రజల మెప్పు పొందారు.

👉అభివృద్ధి చేయలేక.. చేతకాక మేయర్‌ పార్టీ మారింది: బీజేపీ ఎల్పీ లీడర్ శంకర్ యాదవ్

👉మేయర్ పోడియం వద్ద బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్ల ఆందోళన

👉మేయర్‌ కామెంట్స్‌.. 
👉సంతాపం పెడదామని మేయర్ చెప్పినా వినిపించుకొని బీఆర్‌స్‌ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు
👉ఆరు నెలల నుంచి జీహెచ్‌ఎంసీలో ఏమైనా పనులు అయ్యాయా? -మేయర్.

👉అభివృద్ధిపై సభలో చర్చ జరగాలి.

👉అన్ని పార్టీల నేతలు చర్చకు సహకరించాలి.

👉అభివృద్ధిపై మేయర్ వ్యాఖ్యలకు అభ్యంతరం వ్యక్తం చేసిన బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు.

👉అభివృద్ధి చేసేది మేయర్ కాదా అని ప్రశ్నించి బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్ల నిరసన.

👉కార్పొరేటర్లు మేయర్ చైర్‌కు మర్యాద ఇవ్వాలన్న మేయర్.
 

👉 కౌన్సిల్‌లో కాంగ్రెస్‌, బీజేపీ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం. 
👉 బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్ల తీరుపై మేయర్‌ ఆగ్రహం. 
👉మేయర్ పోడియం ముందుకు వెళ్ళిన బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు. 

👉పార్టీల ఫిరాయింపులపై బీఆర్‌ఎస్‌ నాయకుల నిరసన

👉ఫిరాయింపులను ప్రోత్సహించింది బీఆర్‌ఎస్‌ పార్టీనే- మేయర్
👉బీఆర్‌ఎస్‌ నేతలకు ఫిరాయింపులపై మాట్లాడే హక్కు లేదు - మేయర్

👉అభివృద్ధిని అడ్డుకోవడమే బీఆర్‌ఎస్‌ టార్గెట్.
👉బీఆర్‌ఎస్‌ నేతల వద్ద సబ్జెక్టు లేదు.
👉జీహెచ్ఎంసీ కౌన్సిల్ హాల్లో జామర్స్ పెట్టిన  అధికారులు
👉జీహెచ్ఎంసీ కౌన్సిల్ 15 నిమిషాల పాటు వాయిదా
👉జీహెచ్ఎంసీ కౌన్సిల్ సహా బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం..

 

 

👉బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ ను నెట్టివేసిన ఎంఐఎం కార్పొరేటర్లు.
👉రాజ్యాంగం బుక్ తో కౌన్సిల్లోకి వచ్చిన కాంగ్రెస్ కార్పొరేటర్ ఫస్టుద్దీన్.

👉పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతూ రాజ్యాంగం బుక్ తో రావడం ఏంటని ప్రశ్నించిన బీజేపీ

👉జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. మేయర్ రాజీనామా చేయాలని బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. 

👉జీహెచ్‌ఎంసీ ఆఫీస్ ముందు బీజేపీ కార్పొరేటర్ల నిరసన.

👉డ్రైనేజీ నగరం హైదరాబాద్‌ అంటూ నిరసన చేస్తున్న కార్పొరేటర్లు.

👉నాలాల కూడికతీత, మాన్ హోల్స్ సేఫ్టీ ఏర్పాటు చేయాలని డిమాండ్.

👉జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశానికి సర్వం సిద్ధమైంది. మేయర్‌ విజయలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్‌ సమావేశం జరగనుంది. దాదాపు నాలుగున్నర నెలల తర్వాత జరుగుతున్న ఈ సమావేశంలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అన్ని పార్టీలకు సంబంధించి 23 ప్రశ్నలతో సుదీర్ఘంగా చర్చ సాగేలా సభ సన్నద్ధమైంది. అయితే, ఈ సభ ప్రత్యేకతను సంతరించుకున్నది. మేయర్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ శ్రీలతా శోభన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన తర్వాత జరుగుతున్న తొలి సమావేశం కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

👉ఈ నేపథ్యంలోనే బీఆర్‌ఎస్‌ పార్టీ గ్రేటర్‌ ప్రజాప్రతినిధులు ఈ సమావేశానికి హాజరు కావాలని బీఆర్‌ఎస్‌ పార్టీ నిర్ణయించింది. పార్టీ మారిన మేయర్‌ రాజీనామా డిమాండ్‌, అభివృద్ధి, ఆరు గ్యారంటీల అమలు ఎజెండాగా బీఆర్‌ఎస్‌ ముక్త కంఠంతో ప్రశ్నించేందుకు సిద్ధమైంది.

అధికార పార్టీ కంటే బలంగా ఉన్న ప్రతిపక్షాలు..
👉గడిచిన కొన్ని నెలలుగా జంపింగ్‌ జపాంగ్‌లు ఉన్నప్పటికీ బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు, ఎక్స్‌ అఫీషియో సభ్యులతో నేటికీ బీఆర్‌ఎస్‌ మాత్రమే బలంగా ఉంది. 150 మంది కార్పొరేటర్లలో ఇద్దరు ఎంఐఎం కార్పొరేటర్లు ఎమ్మెల్యేలుగా కాగా, మరో ఇద్దరు ఎర్రగడ్డ, గుడిమల్కాపూర్‌ కార్పొరేటర్లు చనిపోయారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు 47 మందితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా ఉన్నారు. ఇక ఎంఐఎం 41, బీజేపీ 39, కాంగ్రెస్‌ 19 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement