
జీహెచ్ఎంసీలో అభయహస్తం దరఖాస్తుల మిస్సింగ్ కలకలం రేపుతోంది.
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీలో అభయహస్తం దరఖాస్తుల మిస్సింగ్ కలకలం రేపుతోంది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం 14 లక్షల దరఖాస్తులు వస్తే 11 లక్షల మాత్రమే జీహెచ్ఎంసీ కంప్యూటరైజ్ చేసింది. లేని దరఖాస్తులకు ప్రైవేట్ ఏజెన్సీలకు జీహెచ్ఎంసీ బిల్లులు చెల్లించింది.
జీహెచ్ఎంసీ పరిధిలోనీ అన్ని జోన్లలో అభయహస్తం దరఖాస్తుల్లో గందరగోళం నెలకొంది. మ్యానువల్ డాక్యుమెంట్స్‌ను కంప్యూటర్ చేసినట్లు లెక్కలు చూపి ప్రైవేట్ ఏజెన్సీలు నిధులు కాజేసినట్లు సమాచారం. ప్రైవేట్ ఏజెన్సీలకు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు సహకరించినట్లు తెలిసింది.
ఇదీ చదవండి: ఫోన్ ట్యాపింగ్ కేసు: హైకోర్టులో ప్రణీత్‌రావుకు చుక్కెదురు