'కేసీఆర్ ఫ్యామిలీ తప్ప ఎవరూ హ్యాపీగా లేరు' | tpcc chief uttam takes on cm kcr | Sakshi
Sakshi News home page

'కేసీఆర్ ఫ్యామిలీ తప్ప ఎవరూ హ్యాపీగా లేరు'

Published Mon, Sep 19 2016 1:21 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

tpcc chief uttam takes on cm kcr

హైదరాబాద్: ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహించడం తప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణకు చేసేందేమీ లేదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.90 వేల కోట్లను ముఖ్యమంత్రి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు శిక్షణా కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. ఈ తరగతులకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ తోపాటు నారాయణ స్వామి, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇతర నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ భగీరథలో అవినీతి జరుగుతుందని అన్నారు. ఒక్క కేసీఆర్ కుటుంబం తప్ప రాష్ట్రంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని ఆయన ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement