హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి ఎదురుదాడి చేశారు. ప్రాజెక్టుల నిర్మాణ పేరుతో తెలంగాణ సర్కారు అనాలోచితంగా, ఆశాస్త్రీయంగా వ్యవహరిస్తోందని అన్నారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ అసలు అవసరం లేదని అన్నారు. డీపీఆర్ లు ఇవ్వాలని ఎన్నిసార్లు అడిగినా అధికారులు ఇవ్వలేదని ఉత్తమ్ చెప్పారు.
గత కొద్ది రోజులుగా మల్లన్న సాగర్ అంశంపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న విషయం తెలిసిందే. మరోసారి ఈ అంశంపై మరోసారి సోమవారం మాట్టాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి .. ప్రాజెక్టుల నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారమే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల రీడిజైన్ పై 23న గాంధీభవన్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుందని అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు కూడా రిజర్వాయర్లు లేకుండా రీ డిజైన్ చేయాలని అన్నారు.
మల్లన్న సాగర్ తో పాటు ఇతర రిజర్వాయర్లకోసం చేపట్టిన భూసేకరణ ఆపాలని డిమాండ్ చేశారు. సాగునీరు పారిశ్రామిక అవసరాలకోసం మాత్రమే రిజర్వాయర్ నిర్మిస్తే సరిపోతుందని అన్నారు. హరియాణాలోని యమునా నదిపై నిర్మించిన జవహార్ లాల్ నెహ్రూ లిఫ్టు ఇరిగేషన్ స్కీమ్ మాదిరిగానే కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టాలని అన్నారు. సంపులు, పంపులు, కాల్వల ద్వారా సాగునీరు అందించాలని చెప్పారు. ప్రాజెక్టుల గురించి బాగా తెలుసని అనుకుంటున్న కేసీఆర్ ప్రజలను, గ్రామాలను ముంచి ప్రాజెక్టులు కట్టాల్సిన పనిలేదని అన్నారు. మరోపక్క, మల్లన్న సాగర్ తో పాటు ఇతర రిజర్వాయర్ల కోసం చేపట్టిన భూసేకరణ వెంటనే ఆపాలని మరో కాంగ్రెస్ పార్టీ నేత మర్రి శశిధర్ రెడ్డి కూడా డిమాండ్ చేశారు.
'ప్రజలను ముంచి కట్టాల్సిన పనిలేదు'
Published Mon, Jul 18 2016 2:01 PM | Last Updated on Tue, Aug 14 2018 10:59 AM
Advertisement
Advertisement