‘ఛలో ట్యాంక్‌బండ్‌’లో పాల్గొనండి: ఉత్తమ్‌ పిలుపు | Uttam Called on Activists to Participate in the Chalo Tank Bund Program of RTC Workers | Sakshi
Sakshi News home page

‘ఛలో ట్యాంక్‌బండ్‌’లో పాల్గొనండి: ఉత్తమ్‌ పిలుపు

Published Fri, Nov 8 2019 7:45 PM | Last Updated on Fri, Nov 8 2019 7:59 PM

Uttam Called on Activists to Participate in the Chalo Tank Bund Program of RTC Workers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల పోరాటానికి కాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌ కూమార్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం ఆర్టీసీ కార్మికులు ఛలో ట్యాంక్‌బండ్‌ కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తమ్‌ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ఆర్టీసీ జేఏసీ తమ మద్దతు కోరిందనీ, అందుకోసం శనివారం చేపట్టే కార్యక్రమంలో కాంగ్రెస్‌ కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మరోవైపు ఉన్నత న్యాయస్థానం సమస్యలను పరిష్కరించాలని ఆదేశిస్తున్నా, ముఖ్యమంత్రి నిర్లక్ష్యంగా, నియంతలాగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నెల రోజులకు పైగా సమ్మె చేస్తున్నా కేసీఆర్‌ మనసు కరగకపోవడం దారుణమని మండిపడ్డారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement