Chalo Tank Bund
-
ఆర్టీసీ సమ్మె : ‘రేపు నలుగురు నిరాహార దీక్ష’
సాక్షి, హైదరాబాద్ : చలో ట్యాంక్‌బండ్ నిరసన కార్యక్రమం విజయవంతమైందని ఆర్టీసీ జేసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. ‘కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు. పాదాభివందనాలు’అని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళా కార్మికులు ధైర్యంగా నిరసన వ్యక్తం చేశారని కొనియాడారు. విద్యానగర్‌లోని ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో జరిగిన అఖిలపక్ష భేటీలో పాల్గొన్న ఆయన మీడియాతో మట్లాడారు. చలో ట్యాంక్‌బండ్ నిరసనలో జరిగిన దమనకాండపై మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించాలని డిమాండ్ చేశారు. రేపు మంత్రులు, ఎమ్మెల్యేల ఇంటి ముందు నిరసన కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.ప్రభుత్వం ఇప్పటికైనా చర్చలకు పిలవాలని విఙ్ఞప్తి చేశారు. నలుగురి నిరాహార దీక్ష ఆర్టీసీ జేఏసీ ముఖ్య నాయకులు నలుగురు రేపు (సోమవారం) ఒక్కరోజు నిరాహార దీక్షకు కూర్చుంటారని అశ్వత్థామరెడ్డి తెలిపారు. 13, 14వ తేదీల్లో ఢిల్లీలో మానవహక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్‌ను కలుస్తామని చెప్పారు. కార్మికులపై దమనకాండకు నిరసనగా ఈ నెల 18న సడక్ బంద్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. కార్మికులపై దాడికి సంబంధించిన ఫొటోలను ఎగ్జిబిషన్ పెట్టి ప్రదర్శిస్తామని అన్నారు. కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్ నేతలు వీ.హనుమంతరావు, సంపత్‌కుమార్, సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, తమ్మినేని వీరభద్రం, ప్రొఫెసర్ కోదండరాం పాల్గొన్నారు. నేటితో ఆర్టీసీ కార్మికుల సమ్మె 37వ రోజుకు చేరింది. -
కార్మికులపై లాఠీ
-
హక్కులను అణచివేస్తున్న సర్కార్
సాక్షి, హైదరాబాద్: ప్రజల భావ వ్యక్తీకరణను తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా అణచివేస్తోందని, రాష్ట్రం లో ప్రజలకు కనీస హక్కులు లేకుండా చేస్తోందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ఆర్టీసీ జేఏసీ పిలుపునిచి్చన ‘చలో ట్యాంక్‌బండ్’కార్యక్రమంపై చర్చించేందుకు శనివారం గాంధీ భవన్లో ముఖ్య నేతలు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ చిన్న ఉద్యమం చేపట్టినా కాంగ్రెస్ నేతల ఇళ్లను పోలీసులు దిగ్బంధనం చేస్తున్నారని, నేతలను గృహ నిర్బంధం చేస్తున్నారని, జిల్లాల్లోని నేతలను పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారని, ఇది ప్రజల హక్కులను కాలరాయడమేనని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను పూర్తిగా అణచివేసే విధంగా ఉన్న ప్రభుత్వ చర్యలను సహించేది లేదని అన్నారు. ‘చలో ట్యాంక్‌బండ్’సందర్భంగా చేసిన అరెస్టులు, లాఠీ చార్జీలను తీవ్రంగా ఖండించారు. గాయపడ్డ వారికి ప్రభుత్వమే పూర్తి స్థాయిలో చికిత్సలు చేయించాలని డిమాండ్ చేశారు. కాగా, భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందించేందుకు ఆదివారం మరోసారి సమావేశం కావాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. ఈ సమావేశంలో సీఎల్పీ మాజీ నేత కె.జానారెడ్డి,టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, కుసుమ కుమార్, ఏఐసీసీ కార్యదర్శులు సంపత్ కుమార్, వంశీ చందర్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్, మాజీ ఎంపీ వీహెచ్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ఎన్నికల అస్త్రం సమసిపోయింది: జెట్టి అయోధ్య వివాదాస్పద భూమి విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో బీజేపీకి ఎన్నికల అస్త్రం సమసిపోయిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్ అన్నారు.ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అయోధ్య పేరు చెప్పి ఓట్లు దండుకునేందుకు యతి్నంచేదని, ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో బీజేపీకి కీలక ఎన్నికల అస్త్రం చేజారినట్టయిందని ఆయన శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కోర్టు తీర్పును కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుందని, ప్రజలంతా సమన్వయంతో ముందుకెళ్లాలని ఆ ప్రకటనలో ఆయన కోరారు. పోలీసుల తీరు దుర్మార్గం: ఆర్.కృష్ణయ్య సాక్షి, హైదరాబాద్: మిలియన్ మార్చ్‌లో పాల్గొన్న ఆర్టీసీ కారి్మకులపై పోలీసులు ప్రవర్తించిన తీరు దుర్మార్గంగా ఉందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య విచారం వ్యక్తం చేశారు. ఉద్యమకారులు, ఆర్టీసీ కారి్మకులపై లాఠీచార్జి, బాష్పవాయువు ప్రయోగించి రక్తపాతం సృష్టించారని ఆయన ఆరోపించారు. సీఎం కేసీఆర్ నియంతృత్వ, నిరంకుశ వైఖరి మార్చుకోవాలని, పరిస్థితి చేయి దాటిపోక ముందే ఆర్టీసీ కారి్మకులతో చర్చలు జరిపి వారి డిమాండ్లను పరిష్కరించాలని సూచించారు. ఇప్పటికే 22 మంది కారి్మకులు చనిపోయారని, ఇంకా వేలాది మంది తీవ్ర నిరాశా నిస్పృహలతో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులు, విద్యార్థులు, సామాన్య ప్రజలు రవాణా వ్యవస్థ లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. 90 శాతం దేశాల్లో ప్రజా రవాణా వ్యవస్థ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తోందని, ఆరీ్టసీని ప్రైవేటీకరణ చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రైవేటీకరణతో విపరీతంగా చార్జీలు పెరుగుతాయని, పేద ప్రజలకు ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులో ఉండదన్నారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టకు పోకుండా వెంటనే ఆర్టీసీ ఉద్యోగులతో చర్చలు జరిపి, బస్సులు నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
‘ఆర్టీసీ’పై మళ్లీ సీఎం సమీక్ష
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెకు సంబంధించి దాఖలైన కేసును సోమవారం హైకోర్టు మరోసారి విచారించనున్న నేపథ్యంలో సీఎం కె. చంద్రశేఖర్‌రావు శనివారం రాత్రి మళ్లీ సమీక్షించారు. రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్‌శర్మ, రవాణాశాఖ కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా, ఏసీ ప్రసాద్ తదితరులతో దాదాపు గంటన్నరపాటు ఆయన భేటీ అయ్యారు. శుక్రవారం రాత్రి సమీక్షించి సుదీర్ఘంగా చర్చించిన సీఎం, శనివారం మళ్లీ భేటీ కావటం విశేషం. గత విచారణ సమయంలో హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేయటంతో సీఎం వరస సమీక్షలతో, తదుపరి విచారణ సమయంలో వ్యవహరించాల్సిన తీరుపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఏకంగా తెలంగాణ ఆర్టీసీ ఉనికినే ప్రశ్నించే పరిస్థితి వచ్చినందున, టీఎస్‌ఆరీ్టసీ ఆవిర్భావానికి దారితీసిన పరిస్థితులు, దాని చట్టబద్ధతను వివరించాలని ఆయన సూచించినట్లు తెలిసింది. సోమవారం హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన పక్షంలో, వాటిపై వ్యవహరించాల్సిన తీరుపై చర్చించినట్లు సమాచారం. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఇప్పటికే ఓసారి అభిప్రాయం వ్యక్తమైన నేపథ్యంలో, సోమవారం హైకోర్టు సూచనల అనంతరం దాని ఆవశ్యకతపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రైవేటు బస్సులకు పరి్మట్లు జారీ చేసే విషయానికి సంబంధించి సోమవారం వరకు నోటిఫికేషన్లు వెలువరించొద్దన్న ఆదేశం ఉన్నందున, దానిపై కోర్టు వ్యాఖ్యానిస్తే ఎలా వ్యవహరించాలన్న విషయంలోనూ చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశ వివరాలను సీఎం కార్యాలయం అధికారికంగా వెల్లడించకపోవటం విశేషం. భేటీకి హాజరైన అధికారులు కూడా మాట్లాడేందుకు అందుబాటులోకి రాలేదు. ‘కోర్టు ఎలా స్పందింస్తుందో వేచి చూద్దాం. మనం ఏం చెప్పినా వినే స్థితిలో లేదు. ప్రభుత్వం మీద వ్యతిరేక దృక్పథంతో ఉంది కోర్టు. మనం చెప్పాల్సిందేం లేదు. కేబినెట్ ప్రొసీడింగ్ అడిగే అధికారం కోర్టుకు లేదు. కొత్త చట్టం ప్రకారమే తీర్మానించాం. విధివిధానాలే ఖరారు చేయకముం దే ఎలా తప్పు పడతారు’’అని సమీక్ష సందర్భంగా సీఎం కేసీఆర్ స్పందించినట్లు తెలుస్తోంది. -
‘చలో ట్యాంక్‌బండ్’ ఉద్రిక్తం
ఆర్టీసీ సమ్మెలో భాగంగా కార్మిక సంఘాల జేఏసీ శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. ఆందోళనల నేపథ్యంలో పోలీసులు ట్యాంక్‌బండ్‌కు వచ్చే అన్ని మార్గాలను మూసేసినా ఆందోళనకారులు ఎలాగోలా అక్కడకు చేరుకున్నారు. జిల్లాల్లోనూ పలుచోట్ల ముందస్తు అరెస్టులు చేసినప్పటికీ పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు, ఆర్టీసీ కార్మికులు తరలివచ్చారు. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీచార్జి చేయగా ఆందోళనకారులు సైతం పోలీసులపైకి రాళ్లు రువ్వారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు లాఠీలు, తూటాలను లెక్కచేయబోమని ఆందోళనకారులు నినాదాలు చేశారు. దాదాపు 3,800 మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. సాక్షి, హైదరాబాద్: సకల జనుల సామూహిక దీక్షను ట్యాంక్‌బండ్‌పై నిర్వహించుకునేందుకు ఆర్టీసీ కారి్మకులకు అనుమతి నిరాకరించిన పోలీసులు.. ట్యాంక్‌బండ్‌పైకి ఎవరినీ రానీయకుండా అష్టదిగ్బంధనం చేశారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద, మారియట్ హోటల్ వద్ద భారీ బారికేడ్లు, ముళ్లకంచెలను ఏర్పాటు చేయడంతోపాటు పారామిలటరీ బలగాలతో పహారా ఏర్పాటు చేశారు. అలాగే లోయర్ ట్యాంక్‌బండ్‌కు వెళ్లే అన్ని మార్గాలను మూసేశారు. ఆంధ్ర మహిళా సభ, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, అశోక్‌నగర్ చౌరస్తా, ఇందిరాపార్క్, కట్టమైసమ్మ దేవాలయం, రాణిగంజ్, బుద్ధభవన్ తదితర ప్రాంతాల వద్ద బారికేడ్లను ఏర్పాటు చేశారు. అలాగే మారియట్ చౌరస్తా, లిబర్టీ చౌరస్తాల వద్ద ట్యాంక్‌బండ్ వైపునకు వెళ్లే దారులను మూసేశారు. పదుల సంఖ్యలో మఫ్టీలో ఉన్న పోలీసులు ఆర్టీసీ బస్సుల్లో తనిఖీలు నిర్వహించి ప్రయాణికుల్లా తరలివచి్చన కండక్టర్లు, డ్రైవర్లను గుర్తించి అరెస్టు చేశారు. బేగంపేట్, సికింద్రాబాద్, ఆర్టీసీ క్రాస్రోడ్స్తోపాటు అన్ని ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగాయి. పోలీసుల లాఠీచార్జిలో గాయపడిన ఆర్టీసీ కార్మికుడు బందోబస్తును ఛేదించుకొని... చలో ట్యాంక్‌బండ్‌లో పాల్గొనడం కోసం వివిధ పారీ్టల నాయకులు ముందుగానే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ట్యాంక్‌బండ్ సమీపంలోని తమ పార్టీ కార్యకర్తలు, కారి్మకుల ఇళ్లలో తలదాచుకున్నారు. సరిగ్గా మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో తొలుత సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్. వెంకటేశ్వర్రావు, కె. గోవర్ధన్లతోపాటు 50 మంది కార్యకర్తలు ఇందిరాపార్క్ చౌరస్తాలోకి దూసుకొచ్చారు. వారిని పోలీసులు అరెస్టు చేయగా కాసేపటికే మారియట్ హోటల్ సమీపంలోని కవాడిగూడ చౌరస్తాలో బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, గౌతమ్జీల నేతృత్వంలో వందలాది మంది ట్యాంక్‌బండ్‌పైకి దూసుకురావడానికి ప్రయతి్నంచగా పోలీసులు వారిని అరెస్టు చేసేందుకు వచ్చారు. అదే సమయంలో పోలీసుల దృష్టి మళ్లించి రాణిగంజ్, హకీంపేట్తోపాటు వివిధ జిల్లాల నుంచి వచి్చన కారి్మకులు పోలీసు బందోబస్తు, బారికేడ్లను ఛేదించుకొని ట్యాంక్‌బండ్‌పైకి వందలాదిగా చేరుకున్నారు. దీంతో పోలీసులు వారిని బతుకమ్మ ఘాట్ వద్ద అడ్డుకొని అరెస్టు చేశారు. చలో ట్యాంక్‌బండ్ నేపథ్యంలో శనివారం ట్యాంక్‌బండ్ పైకి దూసుకొస్తున్న ఆందోళనకారులు అంబేడ్కర్ విగ్రహం సాక్షిగా రణరంగం ఇదే సమయంలో ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సీపీఎం కార్యాలయం నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, నున్న నాగేశ్వర్రావు, వెంకట్, మల్లు లక్షి్మ, అరుణోదయ విమలక్క, పీవోడబ్ల్యూ సంధ్యల నేతృత్వంలో వందలాది మంది కార్యకర్తలు ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, అశోక్‌నగర్, ఇందిరాపార్క్ వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించుకుంటూ ట్యాంక్‌బండ్‌వైపు దూసుకువచ్చారు. కట్టమైసమ్మ దేవాలయం వద్ద మరోసారి వారిని అడ్డుకోవడానికి ప్రయతి్నంచినా పోలీసులకు సాధ్యంకాలేదు. అక్కడి నుంచి అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకోగానే వారికి ఎ.వి. కళాశాలలో ఉన్న వందలాది మంది ఆందోళనకారులు జత కలిశారు. ఇదే సమయంలో హిమాయత్‌నగర్, లిబర్టీ దగ్గర నుంచి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డిల నేతృత్వంలో వందలాది మంది పార్టీ కార్యకర్తలు వారికి తోడయ్యారు. అశోక్‌నగర్‌లోని ఆయన నివాసంలో కె.లక్ష్మణ్ గృహనిర్బంధం ఆర్టీసీ కారి్మకులకు మద్దతుగా సకల జనుల సామూహిక దీక్షలో పాల్గొనేందుకు శుక్రవారమే హైదరాబాద్ చేరుకున్న బీజేపీ ఎంపీ బండి సంజయ్ లిబర్టీ మీదుగా ట్యాంక్‌బండ్ వైపు వెళ్లేందుకు యతి్నంచగా పోలీసులు అరెస్టు చేశారు. ప్రొఫెసర్ కోదండరాంను అంబేడ్కర్ విగ్రహం వద్ద అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు తెలుగుతల్లి ఫ్లైఓవర్, బూర్గుల రామకృష్ణారావు భవన్‌వైపు నుంచి ఆర్టీసీ కార్మికులు వందలాది మంది మహిళలు, కారి్మకులు తరలిరావడంతో అంబేడ్కర్ విగ్రహం వద్ద వేలాది మంది చేరారు. అంతా కలసి ట్యాంక్బండ్వైపునకు వెళ్లి బారికేడ్లను తొలగించడానికి ప్రయతి్నంచారు. కొందరు బారికేడ్లను దాటి ట్యాంక్‌బండ్ చేరుకున్నారు. పరిస్థితి చేయి దాటుతోందని భావించిన పోలీసులు... ఉన్నతాధికారుల ఆదేశం మేరకు టియర్ గ్యాస్ ప్రయోగించి ఆపై లాఠీచార్జి చేశారు. అంబేడ్కర్ విగ్రహం నుంచి లిబర్టీ, దోమలగూడవైపు ఆందోళనకారులను తరిమారు. ఆగ్రహానికిగురైన ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వగా మోత్కూరి శేఖర్ అనే ఎస్ఐకి గాయాలయ్యాయి. చివరకు తమ్మినేని, నారాయణ, చాడ వెంకట్‌రెడ్డి, కోదండరాం సహా వందలాది మందిని పోలీసులు అరెస్టు చేశారు. పలువురికి గాయాలు... పోలీసుల లాఠీచార్జి్జలో పలువురికి గాయాలయ్యా యి. మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తికి చెందిన ఆర్టీసీ మహిళా కండక్టర్ శేషమ్మ ముక్కుకు తీవ్ర గాయమవగా ముషీరాబాద్ డిపో–1కు చెందిన ఆర్టీసీ కారి్మకుడు ఆశయ్యకు, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన పీడీఎస్‌యూ నేత అనిల్‌కు కా ళ్లు విరిగాయి. మరోవైపు ఆందోళనకారుల దాడిలో చిక్కడపల్లి ఏసీపీ కిరణ్ సైతం గాయపడ్డారు. ట్యాంక్‌బండ్‌ను చేరుకొని చూపించాం.... పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా దాదాపు వెయ్యి మంది కారి్మకులం ట్యాంక్‌బండ్ చేరుకొని చూపించామని జేఏసీ నేతలు పేర్కొన్నారు. వేల మంది కారి్మకులు స్వచ్ఛందంగా పాల్గొని చలో ట్యాంక్‌బండ్‌ను విజయవంతం చేశారన్నారు. సరూర్‌నగర్ సభ విజయవంతంతో చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమాన్ని విఫలం చేసేందుకు ప్రభుత్వం పోలీసులను ప్రయోగించిందని దుయ్యబట్టారు. వివిధ పారీ్టల కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేసినా తమ కార్యదీక్ష ముందు నిలవలేకపోయారని జేఏసీ నేతలు పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కారి్మకుల శక్తిని గుర్తించాలని సూచించారు. ఇందులో గాయపడ్డ కారి్మకులకు ఉచితంగా సేవ చేసేందుకు ముందుకొచి్చన వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఉద్యమంలో మావోయిస్టులు ఉన్నారన్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. చలో ట్యాంక్ బండ్ సందర్భంగా పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటుతున్న ఆర్టీసీ మహిళా ఉద్యోగులు మరోసారి బంద్ ఆలోచన? సమ్మెలో భాగంగా చేపట్టిన వివిధ రూపాల నిరసనల కార్యాచరణ పూర్తి కావడంతో తదుపరి కార్యాచరణను సిద్ధం చేసేందుకు కారి్మక సంఘాల జేఏసీ సిద్ధమైంది. ఆదివారం ఉదయం జేఏసీ నేతలు సమావేశమై దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమం నేపథ్యంలో కొందరు జేఏసీ నేతలను పోలీసులు శుక్రవారమే అదుపులోకి తీసుకొన్నారు. జేఏసీ కో–కన్వీనర్ రాజిరెడ్డి సహా మరికొందరిని అదుపులోకి తీసుకోగా జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి సహా ఇతర ముఖ్యులను ట్యాంక్‌బండ్ సమీపంలో శనివారం ఉదయం అరెస్టు చేసి రాత్రికి విడుదల చేశారు. దీంతో కొత్త కార్యాచరణ ఖరారుపై జేఏసీ నేతలు భేటీ కాలేకపోయారు. ఆదివారం అఖిలపక్ష నేతలతో జేఏసీ సమావేశమై తదుపరి కార్యాచరణను ఖరారు చేయనుంది. పోలీసులు కార్మికులపట్ల కఠినంగా వ్యవహరించి లాఠీచార్జి జరపడంతో చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. ముఖ్యంగా మహిళా కారి్మకులు ఎక్కువ మంది గాయపడ్డారు. దీన్ని జేఏసీ తీవ్రంగా పరిగణిస్తోంది. దీంతోపాటు స్వయంగా హైకోర్టు సూచించినా, పదుల సంఖ్యలో కారి్మకులు చనిపోయినా ముఖ్యమంత్రి స్పందించకపోవడం వంటి అంశాలను కారణంగా చూపుతూ మరోసారి రాష్ట్ర బంద్ నిర్వహించాలన్న అభిప్రాయాన్ని కొందరు అఖిలపక్ష నేతలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే దీనిపై ఆదివారం నాటి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. పోలీసుల లాఠీచార్జి, బలప్రయోగానికి నిరసనగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించారు. నగరంలో జరిగే ధర్నాలో అఖిలపక్ష నేతలు పాల్గొననున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నేతల నిర్బంధం ‘చలో ట్యాంక్‌బండ్’కు కాంగ్రెస్ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఆ పార్టీ నేతలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. టీపీసీసీ కీలక నేతలతోపాటు అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ నేతలను గృహనిర్బంధం చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనకుండా అడ్డుకున్నారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమ కుమార్, మండలిలో మాజీ ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, మాజీ మంత్రి గీతారెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిలను హైదరాబాద్‌లో, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాలను హన్మకొండలో గృహ నిర్బంధం చేశారు. అలాగే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని జూబ్లీ చెక్‌పోస్టు వద్ద అదుపులోకి తీసుకున్నారు. ప్రజల ఉద్వేగం ముందు నిలవలేకపోయారు: చాడ సాక్షి, హైదరాబాద్: ప్రజల ఉద్వేగం ముందు పోలీసులు తట్టుకోలేకపోయారని, మిలీనియం మార్చ్‌ను తలపించే విధంగా చలో ట్యాంక్‌బండ్ విజయవంతమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ కళ్లు తెరవాలని, మరింత ప్రజాగ్రహానికి గురికాక ముందే చర్చల ద్వారా ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసుల అతి ప్రవర్తనతో యుద్ధ వాతావరణం ఏర్పడిందని, ఈ చర్యలు అప్రకటిత అత్యవసర పరిస్థితికి అద్దం పడుతున్నాయన్నారు. ఇకనైనా మొండి వైఖరి వీడాలి: తమ్మినేని తీవ్ర నిర్బంధాన్ని అధిగమించి చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమం జయప్రదమైందని, ఇది కారి్మకులు సాధించిన విజయమని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ప్రజలు, ఆర్టీసీ కారి్మకులు, వామపక్షాలు, రాజకీయ పారీ్టల కార్యకర్తలు కలిసి విజయవంతం చేశారన్నారు. సీఎం కేసీఆర్ మొండి వైఖరిని విడనాడి కోర్టు సూచనలు పాటించి, చర్చల ద్వారా సమ్మె పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ సంఘాలు కూడా విలీనంపై పట్టుబట్టే అవకాశం అంతగా లేనందున కారి్మకుల సంక్షేమం కోసం ప్రతిష్టకు పోకుండా ఈ సమస్యకు ఇంతటితో తెరదించాలని సూచించారు. విపక్షాల గొంతు నొక్కుతున్నారు: కృష్ణసాగర్‌రావు ముఖ్యమంత్రి కేసీఆర్ విపక్షాల గొంతు నొక్కుతున్నారని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని, తెలంగాణను పోలీస్ రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ను గృహ నిర్బం ధం చేయడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. హేయమైన చర్య: ఎమ్మెల్సీ నర్సిరెడ్డి సాక్షి, హైదరాబాద్: చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమంలో పాల్గొన్న కార్మికులపై బాష్పవాయువు ప్రయోగించడం, మహిళలని కూడా చూడకుండా లాఠీచార్జీ చేయడం హేయమైన చర్య అని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మండిపడ్డారు. ఆర్టీసీ జేఏసీ నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులను గృహ నిర్బంధం చేయడం, అక్రమ అరెస్ట్‌లకు పాల్ప డటం, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా వ్యవహరించడం అత్యంత దుర్మార్గమని ఓ ప్రకట నలో ఆయన విమర్శించారు. గత 36 రోజు లుగా కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోగా, కోర్టు ఆదేశాలను సైతం లెక్క చేయకుండా తప్పుదోవ పట్టించేలా వ్యవహరించడం ప్రభుత్వ మొండితనం, మూర్ఖత్వాన్ని తెలియజేస్తోందన్నారు. ఇప్పటికైనా సీఎం బేషజాలకు పోకుండా ఆర్టీసీ జేఏసీని చర్చకు పిలిచి, సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అలా జరగని పక్షంలో ప్రభుత్వం కార్మికులు, రాష్ట్ర ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. కేసీఆర్ ఓ నియంత: పొన్నాల సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ నియంత.. ఆయనకు కనీస మానవత్వం కూడా లేదు’అని పీపీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసు పాలన సాగుతోందని, అయినప్పటికీ రజాకార్లను తలపించిన పోలీసులను తíప్పించుకొని చలో ట్యాంక్ బండ్‌ను విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. హన్మకొండలో ని తన నివాసంలో శనివారం సాయం త్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కేసీఆర్ ప్రజల హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌కు మానవతా దృక్పథం లేదని, ఇంటర్ విద్యార్థులు, ఆర్టీసీ కార్మికులపై నిర్దయతో వ్యవహరించారని, కొండగట్టు బస్ ప్రమాదంలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు మరణిస్తే వారి కుటుంబాలను కనీసం పరామర్శించలేదని మండిపడ్డారు. -
చలో ట్యాంక్‌బండ్
-
హరీశ్‌రావును పథకం ప్రకారమే తప్పించారు..
సాక్షి, వరంగల్ : ‘ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ నియంత.. ఆయనకు కనీస మానవత్వం కూడా లేదు’ అని పీపీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసు పాలన సాగుతోందని, అయినప్పటికీ రజాకర్లను తలపించిన పోలీసులను తప్పించుకొని చలో ట్యాంక్ బండ్‌ను విజయవంతంగా చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతున్నానని తెలిపారు. హన్మకొండలోని తన స్వగృహంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లక్ష్మయ్య మాట్లాడారు. నియంతలా వ్యవహరిస్తున్న కేసీఆర్ ప్రజల హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. లా అండ్ ఆర్డర్‌ను విస్మరించి పోలీసులు రాజకీయ పార్టీల నాయకుల ఇళ్ల ముందు కాపలా ఉన్నారన్నారు. కేసీఆర్ కు మానవతా దృక్పథం లేదని, ఇంటర్ విద్యార్థులు, ఆర్టీసీ కార్మికులపై నిర్దయతో వ్యవహరించారని, కొండగట్టు బస్ ప్రమాదంలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు మరణిస్తే వారి కుటుంబాలను కనీసం పరామర్శించలేదని మండిపడ్డారు. ఆర్టీసీ ఆస్తుల దక్కించుకోవడానికి ఆర్టీసీ గౌరవ అధ్యక్షుడుగా ఉన్న హరీశ్‌రావును పథకం ప్రకారమే తప్పించారని పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. చలో ట్యాంక్ బండ్ విషయంలో 70 ఏళ్లలో భారతదేశంలో ఇంతటి దుర్దినం కనిపించలేదన్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికుల చర్చలు కొనసాగించాలని, శనివారం ట్యాంక్‌బండ్ ఘటనపై సంజాయిషీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ఆర్టీసీ సమ్మెపై శనివారం సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సోమవారం హైకోర్టులో విచారణ నేపథ్యంలో ప్రైవేటీకరణపై న్యాయస్థానం వ్యాఖ్యలు, కార్మికుల మిలియన్ మార్చ్ తదితర అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తున్నట్లు సమాచారం. కాగా రాష్ట్రంలో 5,100 రూట్లను ప్రైవేటీకరించాలన్న మంత్రిమండలి నిర్ణయాన్ని హైకోర్టు ఆక్షేపించిన విషయం తెలిసిందే. అయితే ఈ నెల 11న కోర్టులో వాదనలు ఉన్నందున అనసరించాల్సిన తీరుపై సీఎం మళ్లీ సమీక్ష జరుపుతున్నారు. తదుపరి విచారణలో వాటిపై వ్యవహరించాల్సిన తీరుపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 36వ రోజు కూడా కొనసాగుతోంది. సమ్మెలో భాగంగా చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. ఇక ఆర్టీసీ కార్మికుల మిలియన్ మార్చ్ సందర్భంగా ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో విధించిన ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు ఎత్తివేశారు. వాహనాల రాకపోకలకు అనుమతి ఇచ్చి బారికేడ్లను తొలగించారు. చదవండి: పోలీసులపై ఆందోళనకారుల రాళ్లదాడి -
పోలీసులపై ఆందోళనకారుల రాళ్లదాడి
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికులు చేపట్టిన చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమం శనివారం ఉద్రిక్తతలకు దారి తీసింది. నిరవధిక సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మికులు బారికేడ్లను పడగొట్టి ఒక్కసారిగా ట్యాంక్‌బండ్ వైపు దూసుకు వచ్చారు. సీఎం డౌన్ ...డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పోలీసులు ఏర్పాటు చేసిన రక్షణ వలయాలను దాటుకుని ట్యాంక్ బండ్ చేరుకున్నారు. అయితే ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితిని ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీంతో ఆగ్రహించిన కార్మికులు ....పోలీసులపై రాళ్లదాడి చేశారు. ఆందోళనకారులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి అక్కడ నుంచి తరలించారు. ప్రగతి భవన్ గడీలు బద్ధలు కొడతాం.. మరోవైపు చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను అక్కడ నుంచి తరలించారు. ఈ సందర్భంగా ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ... అరెస్ట్‌ల ద్వారా ఉద్యమాలను అణచలేరన్నారు. మిలియన్ మార్చ్‌తోనే కేసీఆర్ పతనం ప్రారంభం అయిందని, ప్రగతి భవన్ గడీలను బద్దలు కొడతాం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పలుచోట్ల పోలీసులతో కార్మికులు, జేఏసీ నేతలు వాగ్వివాదానికి దిగారు. మీ ఆస్తులు అడగటం లేదు.... తాము ప్రభుత్వ ఆస్తులను రాసివ్వమని అడగటం లేదని, న్యాయమైన డిమాండ్లు సాధన కోసమే సమ్మెకు దిగామని ఆర్టీసీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. రెండు నెలలుగా తమకు జీతాలు లేవని, కుటుంబాలను ఎలా పోషించుకోవాలని అన్నారు. తండ్రి స్థానంలో ఉన్న ముఖ్యమంత్రిని ఆశ్రయిస్తే... బిడ్డలను ఇలాగేనా చూసేది అంటూ ప్రశ్నించారు. పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్నామని, తాము ఎలా బతకాలంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. -
లాఠీఛార్జ్, ఆర్టీసీ కార్మికులకు గాయాలు
కదం తొక్కిన కార్మికులు చలో ట్యాంక్ బండ్ ఆందోళనలో పాల్గొనేందుకు వచ్చిన ఆర్టీసీ కార్మికులు కదం తొక్కారు. బారికేడ్లను తోసుకుని ముంద ట్యాంక్‌బండ్‌పైకి పరుగులు తీశారు. వీరిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై రాళ్లు రువ్వారు. భారీ సంఖ్యలో కార్మికులు తరలిరావడంతో వీరిని అడ్డుకోవడం పోలీసుల వల్ల కాలేదు. దీంతో ఆందోళనకారులపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. ప్రభుత్వం తమ కడుపు కొడుతోందంటూ కార్మికులు సర్కారుపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. పోలీసుల లాఠీఛార్జ్‌లో పలువురు కార్మికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఓ వైపు వందలాది మంది కార్మికులతో పాటు, పలువురు రాజకీయ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళా కార్మికుల అరెస్ట్ చలో ట్యాంక్ బండ్ ఆందోళనలో పాల్గొనేందుకు వచ్చిన ఆర్టీసీ మహిళా కార్మికులను పోలీసులు అడ్డుకోవడంతో తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా పోలీసులు, కార్మికులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. 20 మంది ఆర్టీసీ కార్మికులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని గోషామహల్ స్టేషన్‌కు తరలించారు. కాగా, చలో ట్యాంక్ బండ్ నేపథ్యంలో ఇప్పటి వరకు 170 మందిని అరెస్ట్ చేసినట్టు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. ఆర్టీసీ జేఏసీ నాయకులు, రాజకీయ పార్టీలకు చెందిన నాయకులను ముందస్తు అరెస్టులు చేసినట్టు వెల్లడించారు. ట్యాంక్ బండ్‌పై ప్రశాంత వాతావరణం ఉందన్నారు. అశ్వత్థామరెడ్డి అరెస్టు.. చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. హిమాయత్ నగర్ లిబర్టీ వద్ద నుంచి వెళ్తున్న ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ నేతల గృహనిర్బంధం ఆర్టీసీ కార్మికుల చలో ట్యాంక్‌బండ్ ఆందోళన కార్యక్రమం నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్, శానసనమండలిలో మాజీ ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, మాజీ మంత్రి గీతారెడ్డిలను హైద్రాబాద్‌లో హౌస్ అరెస్ట్ చేశారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను హన్మకొండలో గృహ నిర్బంధం చేశారు. ఇంత దారుణమా?: భట్టివిక్రమార్క రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, ప్రజలకు కనీస హక్కులు లేకుండా చేస్తున్నారనిసీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల చలో ట్యాంక్‌బండ్ ఆందోళన కార్యక్రమం నేపథ్యంలో ఆయనను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంత నిర్బంధం దేశంలో ఎక్కడా లేదని, ఎప్పుడు ఇలాంటి నిర్బంధాన్ని చూడలేదని వాపోయారు. ప్రజలు, ప్రజాస్వామ్య వాదులు, మేధావులు, విద్యావంతులు ప్రతి ఒక్కరు దీన్ని ఖండించాలని పిలుపునిచ్చారు. అరెస్టులే అరెస్టులు చలో ట్యాంక్‌బండ్ ఆందోళన కార్యక్రమం నేపథ్యంలో ములుగు జిల్లాలో వివిధ పార్టీలకు చెందిన నాయకులన పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్, సర్పంచ్‌లు ఎండీ అహ్మద్ పాషా, గండి కుమార్, బీజేపీ నాయకులు బలరాం ఆలె, శోభన్ మోహన్, ఎల్కతుర్తి రాజన్న రవి తదితరులను అదుపులోకి తీసుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బీజేపీ నేతలు గీస సంపత్, తౌటం ప్రభాకర్, మరోజు కృష్ణమచారి, గొర్రె శశికాంత్, తాటికంటి రవికుమార్, తోట ఓదేలు, పున్నం మల్ల రెడ్డి, కుమార్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. మెదక్ జిల్లా నర్సాపుర్‌లో 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరులో బీజేపీ నాయకుల అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మంచిర్యాల డిపోకు చెందిన 17 మంది కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ నాయకులను.. ఆర్టీసీ కార్మికులను ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌లో వివిధ పార్టీల నాయకులు, ఆర్టీసీ కార్మికుల అరెస్ట్‌లు కొనసాగుతున్నాయి. స్థానికులకు కష్టాలు ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన చలో ట్యాంక్‌బండ్ ఆందోళన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు మూడంచెల భద్రత ఏర్పాటు చేయడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో వారిని కూడా పోలీసులు అనుమతించకపోవడంతో ఉద్యోగాలకు, కాలేజీలు, పాఠశాలలకు వెళ్లే వారు ఇబ్బందులు పడుతున్నారు. రహదారులు మూసివేసి, ట్రాఫిక్ మళ్లించడంతో కష్టాలు పడుతున్నామని స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: నిరవధిక సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మికులు శనివారం తలపెట్టిన చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ట్యాంక్‌బండ్ పరి సర ప్రాంతాల్లో గట్టి నిఘా పెట్టారు. ట్యాంక్‌బండ్ రోడ్డున పూర్తిగా వేసి వాహనదారులు అటువైపు వెళ్లకుండా కట్టుదిట్టం చేశారు. చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు సమాయత్తమవుతున్న నాయకులను అడ్డుకునేందుకు పోలీసులు ముందస్తు అరెస్టులు చేపట్టారు. పోలీసుల కళ్లుగప్పి ట్యాంక్‌బండ్ చేరుకునేందుకు ఆర్టీసీ కార్మికులు ప్రయత్నిస్తున్నారు. వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు, ఆర్టీసీ కార్మికులు, కార్మిక సంఘాల నేతలు, విద్యార్థులు ట్యాంక్‌బండ్‌కు తరలి వచ్చేందుకు యత్నిస్తున్నారు.శనివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకు అప్పర్ ట్యాంక్‌బండ్ పూర్తిగా మూసేస్తున్నామని నగర ట్రాఫిక్ విభాగం అదనపు సీపీ అనిల్‌కుమార్ తెలిపారు. -
నేడు సిటీ పోలీస్‌కు సవాల్!
సాక్షి,సిటీబ్యూరో: ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల సాధనకు మిలియన్ మార్చ్‌తరహాలో తలపెట్టిన ‘చలో ట్యాంక్‌బండ్’ ఒక వైపు.. ఏళ్ల తరబడి నలుగుతున్న అయోధ్య అంశంపై సుప్రీంకోర్టు తుది తీర్పు శనివారం వెలువడనుంది. ఈ నేపథ్యంలో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. నెలరోజులకు పైగా ఆందోళనలతో పాటు ఆత్మహత్యలకు సైతం వెనుకాడకుండా ఆర్టీసీ సిబ్బంది చేస్తున్న ఉద్యమంతో పోలీసులకు కంటిమీద కునుకులేకుండా పోయింది. ప్రభుత్వం ఎంతకూ దిగిరాకపోవడంతో ఆర్టీసీ జేఏసీ నేతలు శనివారం చలో ట్యాంక్‌బండ్‌కు పిలుపునిచ్చారు. ఈ ఆందోళనకు వివిధ రాజకీయ పార్టీలు సైతం మద్దతు పలికాయి. ఎన్ని నిర్బంధాలు ఎదురైనా విజయవంతం చేసేందుకు ఆర్టీసీ జేఏసీ సన్నద్ధమైంది. మరోపక్క ఆయా డిపోల వద్ద కూడా ఆందోళనలు కొనసాగించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాల్సిందిగా ప్రధాన పార్టీల ముఖ్య నేతలు ఇప్పటికే తమ శ్రేణులకు పిలుపునిచ్చారు. జిల్లాల నుంచి ఆర్టీసీ కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, ఆయా పార్టీల కార్యకర్తలు భారీ సంఖ్యలో నగరానికి చేరుకోనున్నారు. అయితే, ఆందోళనలను కట్టడి చేసేందుకు పోలీస్ శాఖ అప్రమత్తమైంది. నిరసన తెలిపేందుకు కార్మికులు ఏ మలుపు నుంచి ఎక్కడ ప్రత్యక్షమవుతారో.. ఏ గుంపు ఎటు నుంచి వస్తుందో తెలియకపోవడంతో పోలీసులు అన్ని ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో చేసిన మిలియన్ మార్చ్ ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు తగిన బందోబస్తు ఏర్పాటు చేశారు. శుక్రవారం రాత్రే నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ పాతబస్తీలో మకాం వేశారు. పురానీ హవేలీలో ఉన్నతాధికారులతో సమావేశమై రాత్రి మొత్తం నగర వ్యాప్తంగా గస్తీ ముమ్మరం చేయాలని ఆదేశించారు. అంతకుముందు కమిషనర్ కార్యాలయం నుంచి శాంతి భద్రతలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. అయోధ్య తీర్పు కూడా నేడే.. దశాబ్దాలుగా సాగుతున్న అయోధ్య అంశంపై సుప్రీంకోర్టు తుది తీర్పు వెల్లడయ్యే క్షణం కూడా నేడే కావడంతో నగరంలోని సున్నిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసులు, పారామిలటరీ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడా జనం గుమికూడకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఉన్నతాధికారులు పర్యవేక్షించనున్నారు. మరోవైపు గురునానక్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ర్యాలీలు జరుగనున్నాయి. ఇంకోవైపు మిలాద్ ఉన్ నబీ నేపథ్యంలో ఆదివారం కూడా పాతబస్తీ రద్దీగా మారనుంది. గత నెల రోజులుగా ఆందోళనలు, ధర్నాల కట్టడిలో అలసిపోయిన పోలీసు సిబ్బందికి విశ్రాంతితో పాటు సెలవులు సైతం లేవు. శనివారం కూడా వారు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. కాగా, మూడు కమిషనరేట్ల పరిధిలో దాదాపు 20 వేల మంది బలగాలను మోహరించారు. ఘర్షణలకు అవకాశమున్న ప్రాంతాలకు ఆక్టోపస్ కమెండోలు, వాటర్ క్యాన్లు, వజ్ర వాహనాలను పంపించారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే సందేశాలు పోస్ట్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హెచ్చరించారు. -
నేడు ఆర్టీసీ కార్మికుల చలో ట్యాంక్‌బండ్
సాక్షి, హైదరాబాద్/ముషీరాబాద్/తార్నాక: ఒకవైపు ఆర్టీసీ కార్మికులు శనివారం నిర్వహించతలపెట్టిన చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమానికి పోలీసులు అనుమతిని నిరాకరించడం, మరోవైపు ఎట్టి పరిస్థితుల్లోనూ చలో ట్యాంక్‌బండ్ చేపట్టి తీరుతామంటూ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించడంతో నగరంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టీసీ కార్మిక సంఘాల నిరవధిక సమ్మెలో భాగంగా శనివారం చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు శుక్రవారం రాత్రి నుంచి పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ట్యాంక్‌బండ్ వైపునకు వచ్చే అన్ని మార్గాలను తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. మరోవైపు చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమానికి అఖిలపక్షాల మద్దతు కూడా ఉండటంతో వివిధ పార్టీలకు చెం దిన కార్యకర్తలు, నాయకులు, ఆర్టీసీ కార్మికులు, కార్మిక సంఘాల నేతలు ట్యాంక్‌బండ్‌కు తరలి వచ్చే అవకాశం ఉన్నందున పోలీసులు పెద్దెత్తున ముందస్తు అరెస్టులకు దిగారు. కార్మిక సంఘాలకు చెందిన పలువురు నాయకులతో పాటు, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, తెలంగాణ జన సమితి, తదితర పార్టీలకు చెందిన వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. జిల్లాల నుంచి హైదరాబాద్‌కు చేరుకోకుండా నిఘాను ఏర్పాటు చేశారు. అదే సమయంలో చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ గట్టి పట్టుదలతో ఉంది. శుక్రవారం అఖిల పక్ష సమావేశం నిర్వహించడంతోపాటు ఉస్మాని యా వర్సిటీ విద్యార్థి సంఘాలతోనూ సమావేశమయ్యారు. అన్ని వర్గాల భాగస్వామ్యంతో తమ ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేయనున్నట్లు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. అన్ని జిల్లాలకు చెందిన ఆర్టీసీ కార్మికులు నగరానికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయమే జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డిని అదుపులోకి తీసుకుని గుర్తు తెలియని ప్రాంతానికి తరలించారు. మిగతా నేతలు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తపడ్డారు. చలో ట్యాంక్‌బండ్ నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ మోహరించడంతో ఆర్టీసీ కార్మికులు సోషల్ మీడి యా ద్వారా తమ ప్రచారం కొనసాగిస్తున్నారు. విద్యార్థుల అరెస్టులు... చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు సమాయత్తమవుతున్న ఉస్మానియా వర్సిటీ విద్యార్థి సంఘాల నాయకులను అడ్డుకునేందుకు పోలీ సులు ముందస్తు అరెస్టులు చేపట్టారు. పలు పోలీస్స్టేషన్లకు తరలించారు. అఖిలపక్ష నేతల భేటీ... చలో ట్యాంక్‌బండ్ సక్సెస్ చేయడం కోసం అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణపై శుక్రవారం ముఖ్దూంభవన్‌లో అఖిలపక్షనేతలు సమావేశమయ్యారు. చాడ వెంకటరెడ్డి, అజీజ్‌పాషా, పశ్యపద్మ (సీపీఐ), తమ్మినేని వీరభద్రం, డీజీ నరసింహా రావు (సీపీఎం), ప్రొ. కోదండరాం (టీజేఎస్), ఎల్.రమణ (టీడీపీ) తదితరులు పాల్గొన్నారు. ముందస్తు అరెస్ట్‌లు అప్రజాస్వామికం... పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజాస్వామ్య విలువలకు పాతర వేస్తున్నారని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రజాస్వామ్యానికి ఊపరిపోస్తాయని టీజేఎస్ నేత కోదండరాం చెప్పారు. చట్టాన్ని కాదని ఆర్టీసీని ప్రభుత్వం ఎలా ప్రైవేటీకరిస్తుందని సీపీఎంనేత తమ్మినేని ప్రశ్నించారు. కాగా చలో ట్యాంక్‌బండ్‌లో పాల్గొని సక్సెస్ చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. బీజేపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పిలుపునిచ్చారు. చలో ట్యాంక్‌బండ్‌కు అనుమతి లేదు ట్రాఫిక్ చీఫ్ అనిల్‌కుమార్ చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమానికి అనుమతి లేదని నగర ట్రాఫిక్ విభాగం అదనపు సీపీ అనిల్‌కుమార్ శుక్రవారం అన్నారు. అయినప్పటికీ కొంద రు ఆ ప్రాంతంతో పాటు చుట్టుపక్కలకు చేరుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయని, అలా కాకుండా ఉండేందుకు పోలీసుల సూచనలు పాటించాలని ఆయన కోరారు. శనివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకు అప్పర్ ట్యాంక్‌బండ్ పూర్తిగా మూసేస్తున్నామని తెలిపారు. ►సికింద్రాబాద్ వైపు నుంచి ట్యాంక్‌బండ్ వైపు వచ్చే వాహనచోదకు లు కర్బాలామైదాన్, కవాడిగూడ చౌరస్తా, సీజీఓ టవర్స్, ముషీరాబాద్ చౌరస్తా మీదుగా వెళ్లాలి. ►ఇందిరాపార్క్ వైపు నుంచి వచ్చే వాహనాలు అశోక్‌నగర్ ఎక్స్ రోడ్స్ మీదుగా ప్రయాణించాలి. ►తెలుగుతల్లి ఫ్లైఓవర్ వైపు నుంచి వచ్చే వాహనాలు ఇక్బాల్ మినార్, రవీంద్రభారతి మీదుగా ప్రయాణించాలి. ►ఇక్బాల్ మినార్ వైపు నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్లే వాహనాలు నెక్లెస్ రోటరీ, నెక్లెస్ రోడ్ మీదుగా వెళ్లాలి. ►హిమాయత్‌నగర్ వై జంక్షన్ వైపు నుంచి వచ్చే వాహనాలు లిబర్టీ నుంచిబషీర్బాగ్ మీదుగా వెళ్లాలి. -
‘ఛలో ట్యాంక్‌బండ్’లో పాల్గొనండి: ఉత్తమ్ పిలుపు
సాక్షి, హైదరాబాద్ : న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కూమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం ఆర్టీసీ కార్మికులు ఛలో ట్యాంక్‌బండ్ కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తమ్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ఆర్టీసీ జేఏసీ తమ మద్దతు కోరిందనీ, అందుకోసం శనివారం చేపట్టే కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మరోవైపు ఉన్నత న్యాయస్థానం సమస్యలను పరిష్కరించాలని ఆదేశిస్తున్నా, ముఖ్యమంత్రి నిర్లక్ష్యంగా, నియంతలాగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నెల రోజులకు పైగా సమ్మె చేస్తున్నా కేసీఆర్ మనసు కరగకపోవడం దారుణమని మండిపడ్డారు.